HEROES

‘నువ్విలా’ తారల మనోభావాలు

హీరో ‘సూర్య’

hero surya sa 1 hero surya sa 2

 

అక్కినేని : అభినయ వాల్మీకి

 

నటుడు, నిర్మాత,దర్శకుడు, ఆర్.నారాయణమూర్తి

hero r narayanamurty sa 1 hero r narayanamurty sa 2direc r narayanamurty 1 direc r narayanamurty 2

ఆ పార్టీలు టికెట్‌ ఇస్తామన్నాయి

వెండి తెర ఎగరేసిన ఎర్రజెండా… ఆర్‌.నారాయణమూర్తి! సామాన్యుడి వెతలే ఆయన కథలు. పాటలు, మాటలు… అన్నింట్లోనూ అవే కనిపిస్తాయి. అభ్యుదయ చిత్రాలు తీయడం ముళ్లబాట అనుకుంటే – దాన్నే నమ్ముకుని, ఆ ముళ్లన్నీ ఏరేసి, హైవేగా మార్చేసి, ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచిన ఘనత ఆయనదే.  ఇప్పుడాయన ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’ అంటూ మరో సినిమా తీశారు. దేశంలో ఓటు, సీటు ఎలా అమ్ముడుపోతున్నాయో ఈసినిమాలో చూపించబోతున్నారు. ఈ సందర్భంగా ఆర్‌.నారాయణమూర్తితో ‘హాయ్‌’ సంభాషించింది. అమ్మ నింపిన స్ఫూర్తి, సినిమా ప్రయాణం, ఎదుర్కొన్న కష్టాలు… ఇలా అనేక విషయాలు పంచుకున్నారు.

* చిత్రసీమలో ఆస్తులు అమ్ముకునైనా సినిమాలు తీస్తుంటారు. లేదంటే ఆస్తుల్ని సంపాదించడానికి సినిమాలు తీస్తుంటారు. మీకు అమ్ముకోవడానికి ఆస్తులూ లేవు. సంపాదించాలన్న కోరికా లేదు. అయినా సినిమాలు తీస్తూనే ఉంటారెందుకు?
సినిమా అనేది ఓ అభిరుచి. పిచ్చి. నాకెప్పుడూ ఈ విషయంలో డబ్బు ప్రధానం కాదు. బీఏ పాసయ్యాక మద్రాసులో అడుగుపెట్టా. నా గురువుగారు దాసరి నన్ను చేరదీశారు. ‘నేరము శిక్ష’ సినిమాలో 170మంది జూనియర్‌ ఆర్టిస్టులుంటే ఆ గుంపులో నేనొకడ్ని. ‘నీడ’లో చాలా మంచి పాత్ర దక్కింది. ‘సంగీత’లో గురువుగారు నన్ను హీరోని చేశారు. సినిమా హిట్టయ్యింది. తర్వాత నేనేం బిజీ కాలేదు. నేనా రైతుబిడ్డని. చేతిలో డబ్బులు లేవు. పూట పూటకీ  అన్నం మెతుకులు వెదుక్కోవాల్సిన పరిస్థితి. ఏదో ఒకటి సాధిస్తే తప్ప ఇంటికెళ్లకూడదని సతమతమవుతున్న సమయంలో ‘శ్రీశ్రీ’గారి పాట నన్ను నడిపించింది. ‘అగాధమవు జలనిధిన ఆణిముత్యామున్నట్టే శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే.. శోధించి సాధించాలి. అదే ధీరగుణం’ అనే మాటలు కనువిప్పు కలిగించాయి. నా బతుకు నేనే నిలబెట్టుకోవాలి, నేనెక్కాల్సిన మెట్టు నేనే కట్టుకోవాలనిపించింది. నేను హీరో అవ్వాలంటే నేనే డైరెక్టర్‌ అవ్వాలి. నేను డైరెక్టర్‌ అవ్వాలంటే నేనే నిర్మాత అవ్వాలి. అందుకే కాలేజీ రోజుల్లో నా స్నేహితుల్ని ఆశ్రయించి, వాళ్లిచ్చిన పెట్టుబడితో ‘అర్ధరాత్రి స్వాతంత్య్రం’ సినిమా తీశాను. అలా దర్శకుడిగా, కథానాయకుడిగా ప్రయాణం మొదలైంది.

* తొలి సినిమా ఖర్చెంత? రాబడి ఎంత?
రూ. 16.5 లక్షలు పెట్టి తీశా. ఆ సినిమాకి సెన్సార్‌ ఇబ్బందులు ఎదురయ్యాయి. నా సినిమా విడుదల అవుతుందా? అనే కంగారు పట్టుకుంది. ఏదోలా కష్టపడి సెన్సార్‌ పూర్తి చేశా. ఒక్క షోకే వ్యాపారం అయిపోయింది. సినిమా చూసిన ఒకావిడ ‘ఎంతకిస్తారు?’ అని అడిగారు. ‘నాకు ఇంత అయ్యింది. దానికి మూడు రూపాయల వడ్డీ వేసి ఇవ్వండి చాలు’ అన్నాను. దాంతో అప్పులు తీర్చేయొచ్చని నా ఆశ. అడిగినంతా ఇచ్చేశారు. 1986లో విడుదలై సంవత్సరం ఆడేసింది. సొంత సినిమాలు తీసుకున్నా కాబట్టి ఇలా ఉన్నా. లేదంటే జూనియర్‌ ఆర్టిస్టు దగ్గరే ఉండిపోయేవాడ్ని కదా? ఎంతోమంది విప్లవ చిత్రాలు తీసినా ఎవ్వరూ నాలా ట్రెండ్‌ సృష్టించలేదు. నా విజయాలు చూసి పరిశ్రమ మొత్తం ఇలాంటి కథలవైపు చూసింది. కృష్ణ, మోహన్‌బాబు, దాసరి గారు… ఇలా అందరూ విప్లవ చిత్రాలు తీయడం మొదలెట్టారు. ‘విప్లవ చిత్రాలు తీయడం ముళ్లబాట. దాని రాస్తాగా మార్చాడు నా బిడ్డ. ఆ రాస్తాలో మేమంతా పయనిస్తున్నాం. ఒసేయ్‌ రాములమ్మా తీయడానికి స్ఫూర్తి ఆర్‌.నారాయణమూర్తే’ అని గురువుగారు దాసరి అన్నారు. అంతకంటే క్రెడిట్‌ ఏం కావాలి? కాకపోతే అందరూ ఇలాంటి కథలు తీయడం మొదలెట్టేసరికి జనాలకు మొహం మొత్తేసింది.

* డబ్బులున్నప్పుడే జాగ్రత్త పడాలని ఎవ్వరూ చెప్పలేదా?
అన్నా.. నా దృష్టి ఎప్పుడూ అటు పోలేదే. నా బతుకెప్పుడూ జనంతోనే. ఉద్యమాలతోనే విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు, జై ఆంధ్రా, తెలంగాణ ఉద్యమం, సారా వ్యతిరేక ఉద్యమం.. ఇలా చిన్నప్పటి నుంచీ పోరు బాటలోనే ఉన్నా. డబ్బులున్నా, లేకున్నా చాప, దిండు, రెండు జతల దుస్తులే నా ఆస్తి. ఉంటే నా డబ్బులతో సినిమాలు తీస్తా. లేదంటే అప్పులు చేసి తీస్తా. ఇప్పుడైతే డబ్బు విలువ తెలిసింది. ప్రభుత్వం వాళ్లు అనేకసార్లు ఇళ్లు ఇస్తామన్నారు. వద్దన్నాను. చిత్రపురిలో ఇల్లు ఇస్తామన్నారు. తీసుకోలేదు. రాజశేఖర్‌రెడ్డి హయాంలో విశాఖలో 10 ఎకరాల స్థలం కేటాయిస్తామన్నారు. దండం పెట్టి వచ్చేశా. కేసీఆర్‌ డబుల్‌ బెడ్రూం మంజూరు చేస్తామన్నారు ‘వద్దన్నా’ అని నమస్కరించా.

* చిన్నప్పటి నుంచీ మీ జీవన విధానం ఇంతేనా?
ఇంతే. ఇలానే ఉండేవాడ్ని. మాది వ్యవసాయ కుటుంబం. నా చదువు విషయంలో ఎలాంటి ఇబ్బందులూ ఎదురుకాలేదు. మా ఊర్లో బీఏ చదివిన మొట్టమొదటివాడ్ని నేనే. సినిమాల్లోకి వచ్చినా నా విధానం మారలేదు. చెట్టు కింద హ్యాపీగా ఉంటా. ఆసుపత్రులు, కాలేజీలకు, బోరింగులు, కమ్యూనిటీ హాళ్లు.. ఇలా చాలావాటికి విరాళాలు ఇచ్చా. ఎక్కడా నా పేరుండదు. కోట్లు సంపాదించా. పంచేసా. తిన్నా. అనుభవించా. తెలుగుదేశం పార్టీ కాకినాడ సీటు ఇప్పటికి మూడుసార్లు ఆఫర్‌ చేసింది. వైఎస్‌ఆర్‌ పార్టీ తుని సీటు ఇస్తామన్నారు. 2009లో పీఆర్పీ ఆహ్వానించింది. వెళ్లలేదు. ప్రజలతో ఉంటున్నా. ఉద్యమ సినిమాలు తీస్తున్నా. అంతకంటే ఏం కావాలి?

* రాజకీయాల్లోకి వస్తే ప్రజలకు ప్రత్యక్షంగానే సేవ చేయొచ్చు కదా?
బ్రదర్‌.. సేవ అనే పదం పక్కన పెట్టండి. వాళ్ల జీవితాలతో ఆడుకోకుండా ఉంటే చాలు. అదే పెద్ద సేవ. ఏ రాజకీయ పార్టీలో అయినా చేరానే అనుకోండి. వాళ్లు చెప్పింది నేను చేయాలి. నాకు నచ్చకపోతే ఘర్షణ పడాలి. అది నాకు అవసరమా? నా రాజ్యంలో నేను రాజులా ఉంటున్నా. అక్కడకి వెళ్లి ఎందుకు తలొంచాలి?

* మీ సినిమాలన్నీ విమర్శనా బాణాలే. ఈ ప్రయాణంలో మీకెలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? మిమ్మల్ని ఎవరూ బెదిరించలేదా?
దేశం మొత్తమ్మీద ఈ స్థాయిలో, ఇన్నిసార్లు సెన్సార్‌ ఇబ్బందులు పడిన ఏకైక దర్శకుడ్ని నేనేనేమో. ‘అర్ధరాత్రి స్వాతంత్య్రం’ నుంచి మొన్నటి ‘అన్నదాతా సుఖీభవ’ వరకూ ప్రతీ సినిమాకీ ఇబ్బందే. ‘లాల్‌ సలామ్‌’ అయితే బీభత్సం. అప్పటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డి గారు ఓ సభలో ‘ఇలాంటి సినిమాలు తీస్తావేంటి నారాయణమూర్తి’ అని నన్ను తిట్టారు. అప్పటి ఇంటెలిజెన్స్‌ ఐజీ ‘ఇలాంటి సినిమాలు తీస్తే మిమ్మల్ని ఎన్‌కౌంటర్‌ చేయాల్సి వస్తుంది’ అని బెదిరించారు. ‘చీకటి సూర్యులు’ సినిమాకి అసలు షూటింగ్‌ అనుమతే దొరకలేదు. చంద్రబాబు నాయుడుగారు ఇప్పించారు. ఓ సినిమా సెన్సార్‌ అవ్వక ఆగిపోతే.. అనుపమ్‌ ఖేర్‌ వచ్చి క్లియరెన్స్‌ ఇప్పించారు. నా సినిమా విడుదలైతే థియేటర్‌ చుట్టూ పోలీస్‌ వ్యాన్లు చక్కర్లు కొట్టేవి. ఎవరైనా చంకలో సంచి వేసుకుని సినిమాకొస్తే, వాళ్లని పక్కకు తీసుకెళ్లి విచారించేవారు.

* మీలో కమ్యూనిజం భావజాలం ఎక్కువగా కనిపిస్తుంది. ఆ సిద్ధాంతాల్ని బలంగా నమ్ముతారా?
నేను కమ్యూనిస్టుని కాదు. అంత గొప్పవాడ్ని కాదు. ‘ఎవరి శ్రమ ఫలితం వాళ్లకు దక్కాలి’ అనేది దాస్‌ కాపిటల్‌లో కారల్‌మార్క్స్‌ చెప్పిన సిద్ధాంతాం. అదే జరిగితే.. ఈ భూమండలం అంతా స్వర్గధామం అవుతుంది. ‘అత్యుత్తమ మానవవాదే.. అత్యుత్తమ కమ్యూనిస్ట్‌’ అన్నాడు మార్క్స్‌. ఉన్నవాడు, లేనివాడు ఇద్దరూ సుఖంగా బతకాలి. అది నా సిద్ధాంతం. కమ్యూనిజం అంటే మరేదో కాదు.. అసలు సిసలైన ప్రజాస్వామ్యమే కమ్యూనిజం.

- మహమ్మద్‌ అన్వర్‌, ఫొటోలు: మధు

 


* అమ్మ చెప్పింది
పదోతరగతి పరీక్షలో ఫెయిల్‌ అయ్యాను. మా నాన్నకు కనిపిస్తే కొట్టేస్తాడేమో అని ఇంటి వెనుక దాక్కున్నాను. నాకోసం మా అమ్మ ఊరంతా వెదుకుతూ వచ్చింది. ‘పరీక్ష తప్పానమ్మా’ అని అమ్మని పట్టుకుని ఏడ్చేశా. అప్పుడు మా అమ్మ ఓ మాట అంది. ‘అరేయ్‌ పిచ్చోడా.. భూమినే నమ్ముకుని యేటా పంట వేస్తున్నాం. ఓ సంవత్సరం పండుతుంది. ఓ సంవత్సరం పండదు. పండనంత మాత్రాన ఆపేస్తామా.. మళ్లీ భూమినే నమ్ముకుంటాం. ఈసారి బాగా రాయి. పాసవుతావు’ అంది. ఆ మాట ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటా. ఈనాటి తల్లిదండ్రులు తమ బిడ్డల్లో ఇలానే స్ఫూర్తి నింపితే… విద్యార్థుల ఆత్మహత్యలు ఆగిపోతాయి కదా!


* పెళ్లి చేసుకోనందకు బాధ పడుతుంటా
పెళ్లి అవ్వాల్సిన సమయంలో ఇంట్లోవాళ్లతో గొడవ పెట్టుకుని వచ్చేశా. ఆ తరవాత.. పెళ్లి ఊసెత్తలేదు. కానీ జంట పక్షుల్ని చూసినా, దంపతుల్ని చూసినా ‘నేనెందుకు పెళ్లి చేసుకోలేదు’ అని బాధ వేస్తుంది. యువతరానికి నా సలహా ఒక్కటే. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలి. ‘స్థిరపడిన తరవాతే పెళ్లి’ అంటూ వాయిదా వేసుకోవద్దు.
*టెంపర్‌లో నటించమని పూరి అడిగారు. అలా చాలా ఆఫర్లు వచ్చాయి. హరీష్‌ శంకర్‌, దిల్‌రాజు, శేఖర్‌ కమ్ముల మంచి పాత్రలు ఇస్తామన్నారు.  చేయలేదు. ఆర్‌.నారాయణమూర్తి సినిమా అంటే ఓ బ్రాండ్‌. దాన్ని పాతికేళ్ల నుంచీ కాపాడుకుంటూ వస్తున్నా. ఇప్పుడు చిన్న చిన్న పాత్రలు చేసి దాన్ని పాడు చేసుకోవాలా?


* స్కూటర్‌ నడపడం రాదు
తిండి విషయంలో నాకు మొహమాటం లేదు. ఏదైనా తింటా. రోడ్డు పక్కన బడ్డీ కొట్టు కనిపిస్తే, అక్కడ నిలబడి తినేస్తా. కడుపునిండా తినడం, కష్టపడి పనిచేయడం ఇదే తెలుసు. వంట చేతనవ్వదు. ఇన్నేళ్లుగా హోటల్‌ భోజనమే. స్కూటర్‌ నడపడం రాదు. సెల్‌ఫోన్‌లో పచ్చ బటను, ఎర్ర బటనూ తప్ప ఇంకేం తెలీవు. నాకిప్పుడు 65 ఏళ్లు. నా వయసుకి నప్పిన పాత్రలు చేస్తా. అలాంటి కథలే ఎంచుకుంటా. నటనకు ఎప్పుడు ఎక్కడ పుల్‌ స్టాప్‌ పెట్టాలోనాకు తెలుసు. సినిమాలు మానేశాక.. ప్రజలతో కలసి బతుకుతా. నా జీవన ప్రయాణాన్ని ఓ పుస్తకంలా రాయాలనివుంది.

హీరో ‘వెంకటేష్’

హీరో ‘కార్తి’

కధానాయకుడు ‘నరేష్’

hero allari naresh 1 hero allari naresh 2mudra a naresh ee

 

కధానాయకుడు ‘నాని’

hero nani with his wifesakshi nani sakshi nani 1
నానీ పాంచ్‌ పటాకా!
‘మనం’ అంటే మన పేరు మాత్రమే కాదు… మన ఇష్టాలూ, అనుభవాలూ, అనుబంధాలూ… ఇవన్నీ. ‘జెర్సీ’తో కెరీర్‌లోనే ఓ పెద్ద హిట్‌ అందుకున్న నేచురల్‌స్టార్‌ నానీని పలకరించి… నచ్చే వ్యక్తులూ, మెచ్చే సినిమాలూ, మర్చిపోలేని సంఘటనలూ… ఇలా పలు అంశాల్లో ‘టాప్‌-5’ గురించి చెప్పమంటే చాలా ఓపిగ్గా ఆ విషయాల్ని చెప్పుకొచ్చాడిలా!

నచ్చే వ్యక్తులు…అవసరాల శ్రీనివాస్‌: పక్కవాళ్ల గురించి ఏమాత్రం చెడుగా ఆలోచించని వ్యక్తి. ఏదో చేయాలన్న తపన  ఉంటుంది. నటుడిగా ఎదగాలని మాత్రమే ఆలోచిస్తుంటాడు. అంతకు మించి లక్ష్యాలేం పెట్టుకోడు.
వెంకటేష్‌: మనకంటే పెద్దవాళ్లతో మాట్లాడడానికి భయపడుతుంటాం. వాళ్లే సరదాగా మాట్లాడుతున్నా, శ్రద్ధగా వింటాం అంతే. కానీ వెంకటేష్‌గారి దగ్గర మాత్రం అలా అనిపించదు. ఏ వయసు వారితోనైనా ఇట్టే కలిసిపోతారు. ఆయనో జోక్‌ వేస్తే… మనక్కూడా ఓ జోక్‌ వేయాలనిపిస్తుంది. అంత చనువు ఇచ్చేస్తారు.
ఇంద్రగంటి మోహనకృష్ణ: చాలా పద్ధతైన మనిషి. ఆయనకు ఇష్టమైన సినిమాని తీయడానికి, ఇష్టంగా అనుసరించే పద్ధతులు నాకెంతో ఇష్టం. నన్ను ఓ గదిలో రోజంతా బంధించేస్తే… ఆ గదిలో నాతో పాటు ఇంద్రగంటిగారు ఉండాలని కోరుకుంటా. ఎందుకంటే, చెవులప్పగించి వినే టాపిక్‌్్స ఆయన దగ్గర చాలా ఉంటాయి.
రమా – వల్లి: వీళ్లిద్దరూ నన్ను చూసుకునే విధానం, పలకరించే పద్ధతీ చూస్తే, మా మధ్య ఏదో తెలియని అనుబంధం ఉందేమో అనిపిస్తుంది. ఓ పిన్నిలా,
పెద్దమ్మలా కనిపిస్తారు.
నివేదా థామస్‌: తనకేదైనా మంచి జరిగితే… మొదటి ఫోన్‌ నాకే వస్తుంది. నా గురించి ఎక్కడైనా ఓ మంచి విషయం చదివితే… ఓ పెద్ద మెసేజ్‌ పెడుతుంది. అంత నిజాయతీగా ఒకర్ని ఇష్టపడే అమ్మాయి ఈరోజుల్లో కన్పించడం చాలా కష్టం.
మెచ్చే సినిమాలు…దళపతి: మణిరత్నం మ్యాజిక్‌ ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తుంది. ఆ సినిమాలో షాట్‌ మేకింగ్‌, లైటింగ్‌… ఇవన్నీ నాకు చాలా చాలా ఇష్టం. ఫిల్మ్‌మేకింగ్‌పై పిచ్చి పెరగడానికి ఈ సినిమా ఓ కారణం. ఆ రోజుల్లో అలాంటి సాంకేతిక విషయాలు ఎలా నోటీస్‌ చేశానో.. నాకే అర్థం కాదు.సీతారామయ్యగారి మనవరాలు: ఊళ్లో లేకపోతే- మా ఇల్లు పదే పదే గుర్తొస్తే- చూసే సినిమా ‘సీతారామయ్యగారి మనవరాలు’. తెలుగుదనం నూటికి నూరుపాళ్లూ ఉన్న సినిమా.
మగాడు: రాజశేఖర్‌ ‘మగాడు’ సినిమా అంటే నాకు చాలా ఇష్టం. ఆ రోజుల్లో హైజాక్‌ స్టోరీ, కిడ్నాప్‌ డ్రామా డీల్‌ చేయడం అంటే మామూలు విషయం కాదు.
జెంటిల్‌మేన్‌: కమర్షియల్‌ సినిమాకి కొత్త అర్థం చెప్పింది. అప్పటివరకూ హీరోయిజం అంటే.. ప్రతినాయకుడిమీద పోరాటం చేయడమే. కానీ దీన్లో మాత్రం కథానాయకుడి పోరాటమంతా ఓ వ్యవస్థపై ఉంటుంది.
వంశవృక్షం: బాపూగారి ‘వంశవృక్షం’ నన్ను షాక్‌కి గురిచేసిన సినిమా. ఈరోజు కూడా అలాంటి ఆలోచనతో ఓ సినిమా తీసే గట్స్‌ ఎవ్వరికీ లేవు. బాపు తలచుకుంటే, పెద్ద హీరోతో కమర్షియల్‌ సినిమా తీయొచ్చు. కానీ వాటి జోలికి వెళ్లకుండా ఏదైతే నమ్మారో, అలాంటి సినిమానే తీశారు.
నా సినిమాలు…అష్టా చమ్మా: నా సినీ జీవితానికి- మరోరకంగా చెప్పాలంటే ఓ కొత్త జీవితానికి శ్రీకారం చుట్టింది ‘అష్టాచమ్మా’తోనే. ఆ సినిమా, అందులో నా పాత్ర, నేను కలసి పనిచేసిన వ్యక్తులూ… అన్ని విధాలా స్పెషల్‌.
ఈగ : రాజమౌళి గారి సినిమాలో అవకాశం రావడం ఇప్పటికీ ఓ కలలా ఉంటుంది. అందులో తెరపై కనిపించేది పదిహేను నిమిషాలే. కానీ సినిమా అంతా ఆ ఇంపాక్ట్‌ ఉంటుంది. ‘ఈగ 2’ తీస్తానని రాజమౌళి మాటిచ్చారు. ఆ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా
ఎవడే సుబ్రహ్మణ్యం: కొన్ని సినిమాలు కెరీర్‌ని మారుస్తాయి. ఇంకొన్ని మన ఆలోచనా విధానాన్ని మారుస్తాయి. ఈ రెండో కోవకు చెందే సినిమా ‘ఎవడే సుబ్రహ్మణ్యం’. చాలామంది స్నేహితుల్ని కూడా ఇచ్చింది.
భలే భలే మగాడివోయ్‌: నా కథల్లో వినోదం అందించే అంశాలు ఎక్కువగా ఉండాలని కోరుకుంటుంటా. ఎందుకంటే, నాకూ అలాంటివే ఇష్టం. కానీ సంపూర్ణంగా నవ్వించడానికి చేసిన సినిమా మాత్రం ఇదే. ఓ సమస్యని నవ్విస్తూ చెప్పడం మామూలు విషయం కాదు. అయినా పెద్దగా కష్టపడకుండా ఆడుతూ పాడుతూ చేసేశాను. నా సినిమాలన్నింటిలోకీ నిర్మాతలకు మంచి లాభాల్ని అందించిన చిత్రమిది.
జెర్సీ: ఓ సినిమా చేస్తున్నప్పుడు నటీనటులతోనూ, సాంకేతిక నిపుణులతోనూ ఓ అనుబంధం ఏర్పడుతుంది. కానీ చేసిన పాత్రని బాగా ప్రేమించేయడం, ఆ పాత్రని వదిలి రాలేకపోవడం ‘జెర్సీ’తోనే జరిగింది. అర్జున్‌ పాత్రని అంతగా ఇష్టపడ్డా. షూటింగ్‌ పూర్తయి ఇంటికి తిరిగివస్తున్నప్పుడు గుండె బరువెక్కిపోయింది. అర్జున్‌లో ఓ స్నేహితుడ్ని చూసుకున్నా. భవిష్యత్తులో ఎన్ని విజయాలు సాధించినా వాటిలో ‘జెర్సీ’కి తప్పకుండా స్థానం ఉంటుంది.
నోరూరిస్తాయి…అమ్మ చేతి వంట ఏదైనా ఇష్టమే. ఆఖరికి అది రసం అయినా. బయటకు వెళ్లినప్పుడు ఏదైనా కూర తింటుంటే ‘ఇది అమ్మ చేసి ఉంటే ఇంకా బాగుండేది కదా’ అనిపిస్తుంది. మా అమ్మమ్మ చేసే చేపల పులుసు నా ఆల్‌టైమ్‌ ఫేవరెట్‌. పూత రేకులు, ఉలవచారు, తిరుపతి లడ్డూ.. వీటిని తలచుకున్నప్పుడల్లా నోరూరిపోతుంటుంది.
ఇష్టపడే ప్రదేశాలు…తిరుపతి: ఇంచుమించు ప్రతి ఏడాదీ వెళ్తా.
హైదరాబాద్‌: దీంతో ఉన్న అనుబంధం ప్రత్యేకమైంది. విదేశాలకు వెళ్లి తిరిగొస్తున్నప్పుడు శంషాబాద్‌ ఎయిర్‌ పోర్ట్‌ చూడగానే.. ‘హమ్మయ్య ఇల్లు వచ్చేసింది’ అనుకుంటా.
చెన్నై: ఊరొదిలేసి ఎక్కువ కాలం ఉన్న నగరమిది. ఎప్పుడక్కడకు వెళ్లినా ఓ తెలియని ఆనందం కలుగుతుంది.
హిమాలయాలు: నా మరో ఫేవరెట్‌ ప్లేస్‌. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సమయంలో 42 రోజులపాటు అక్కడ ఉన్నా. అక్కడి ప్రశాంతమైన వాతావరణాన్ని ఎప్పటికీ మర్చిపోలేం.
గోవా: అక్కడి బీచ్‌లో టేబుల్‌ ముందు కూర్చుని నచ్చిన ఫుడ్‌ ఆర్డర్‌ చేసుకుని తింటూ ఉంటే.. భలే బాగుంటుంది.
జున్నుగాడి కబుర్లు

వాడి పేరు: అమ్మాయి పుడుతుందని అంజనా, నేనూ చాలా పేర్లు సెలక్ట్‌ చేసి పెట్టుకున్నాం. తీరా అబ్బాయి పుట్టాడు. ‘రైడ్‌’లో నాపేరు అర్జున్‌. ఆ పేరు నాకు బాగా సూటయిందని అప్పట్లో అంజనా అంది. అందుకే ‘అర్జున్‌’ అని పెట్టాం.
ఆ పిలుపు: జీవితంలో అత్యంత గొప్ప జ్ఞాపకం ఏమిటంటే.. మావాడు ‘నాన్నా’ అని తొలిసారి పిలవడం. సాధారణంగా పిల్లలకు అమ్మ, అత్త, తాత అనే పిలుపులే త్వరగా వస్తాయి. కానీ మా జున్నుగాడు మాత్రం ‘నాన్న’ అనే పిలుపే ముందు నేర్చుకున్నాడు. ఓరోజు మా ఆవిడ ఫోన్‌చేసి ‘జున్నుగాడు నాన్న అన్నాడు’ అని చెబితే గబగబా ఇంటికి వెళ్లా. నన్ను చూసి వాడు ఊఁ ఆఁ అంటేనా! ‘నిజంగానే ‘నాన్న’ అన్నాడా? మరి మళ్లీ ఎందుకు అనట్లేదు’ అని ఆ రోజంతా ఆలోచించా. తర్వాత ఓరోజు షూటింగ్‌ నుంచి ఇంటికెళ్లి తలుపు తీయగానే నన్ను చూసి ‘నాన్నా’ అన్నాడు. ఆ క్షణం సిక్సర్‌ కొట్టినట్లు అనిపించింది.
ట్విటర్‌లో: జున్నుగాడి ఫస్ట్‌ బర్త్‌డే రోజున ‘దొంగ నా కొడుకు జున్నుగాడు…’ అని ట్వీట్‌ చేశాను. అది చదివి చాలామంది షాకయ్యారు. మొదటిపుట్టినరోజుకన్నా ముందే వాడికి తెలివి బాగా ఎక్కువైంది. ఏడిస్తే ఏదైనా ఇచ్చేస్తారని తెగ ఏడ్చేవాడు. వాడి దొంగ వేషాలు గుర్తొచ్చి సరదాగా అలా పెట్టానంతే!
ఆరోజు: ‘దేవదాస్‌’ షూటింగ్‌ సమయంలో జున్నూని మొదటిసారి సెట్స్‌కి తీసుకువెళ్లాను. పదేళ్లకుపైగా సినిమాల్లో చేస్తున్నప్పటికీ ఏరోజూ నెర్వస్‌గా ఫీలవ్వలేదు. కానీ ఆరోజు జున్నుగాడు ఎదురుగా ఉన్నప్పుడు మాత్రం కొంచెం
నెర్వస్‌గా ఫీలయ్యా!
అదే బాధ: ‘జెర్సీ’ షూటింగ్‌లో వికెట్ల మధ్య పరుగులు తీస్తూ పడ్డాను. ఎక్స్‌రే తీస్తే ముక్కు ఫ్రాక్చర్‌ అయింది. కోలుకోవడానికి రెండువారాలు పడుతుందన్నారు. ఆ టైమ్‌లో జున్నూని కాస్త దూరంగా ఉంచాల్సివచ్చింది. ఎందుకంటే వాడు దగ్గర ఉంటే నా ముక్కుమీదే ప్రయోగాలు చేస్తాడు… అందుకే. కానీ గాయంకంటే వాణ్ని దూరంగా ఉంచడమే ఎక్కువ బాధించేది.

గుర్తుకొస్తుంటాయి…

నవీన్‌: చిన్నప్పట్నుంచీ అందరూ నన్ను ‘నాని’ అనే పిలిచేవారు. స్కూల్‌ రికార్డుల్లో మాత్రం నవీన్‌ అని ఉంటుంది. స్కూల్లో నవీన్‌ అని టీచర్‌ పిలిస్తే అదెవర్నో అనుకునేవాణ్ని. పక్కనున్నవాళ్లు ‘నిన్నే’ అని చెబితే అప్పుడు గుర్తొచ్చేది. స్క్రీన్‌మీద ఏ పేరు వెయ్యాలని మోహనకృష్ణగారు అడిగినపుడు… ‘నాని అనే వేయండి. నవీన్‌ బాగా చేశాడని పొగిడినా అది నేను కాదన్న ఫీలింగ్‌ ఉంటుంది’ అని చెప్పా.
దెయ్యం సినిమా: ఎనిమిదో తరగతి విజయవాడ దగ్గర ఈడుపుగల్లులో రెసిడెన్షియల్‌ స్కూల్లో చదివాను. హాస్టల్‌కి దగ్గర్లో సినిమా థియేటర్‌ ఉండేది. అప్పడప్పుడూ గోడ దూకి వెళ్లి సినిమా చూసేవాళ్లం. అక్కడ ఏ సినిమా ఆడుతుందో కూడా తెలీదు. ఓసారి అలా వెళ్లినపుడు ‘దెయ్యం’ ఆడుతోంది. సినిమా చూసి బయటకు వచ్చాక తిరిగి పొలాల మధ్యలోంచి హాస్టల్‌కి వెళ్లడానికి ధైర్యం సరిపోలేదు. మా ఫ్రెండ్‌ మాత్రం అలానే వెళ్లిపోయాడు. నేను రోడ్డుమీద నుంచి వెళ్లి మెయిన్‌గేట్‌ దగ్గర వార్డెన్‌కి దొరికిపోయి దెబ్బలు తిన్నా.
ముక్కోడు: చిన్నపుడు మావయ్య నన్ను ‘ముక్కోడా’ అని సరదాగా పిలిచేవాడు. నీ ముక్కుకి ఐదులక్షలు ఎక్కువ కట్నం వస్తుందనేవాడు.
ఏడాది తిరిగా: డిగ్రీ ఫస్టియర్‌లో కాలేజీ ప్రోగ్రామ్‌లో స్టేజిమీద నా డ్యాన్స్‌ చూసి మా వైస్‌ ప్రిన్సిపల్‌ సినిమాల్లో ట్రై చేయొచ్చుగా అని చెప్పి తెలిసిన డైరెక్టర్‌ ఉన్నారని ఫోన్‌ నంబరు ఇస్తే, వెళ్లి కలిశాను. అతడు‘ఇదిగో అదిగో’ అని చెప్పుకుని ఏడాదిపాటు తిప్పాడు. నాన్న స్కూటర్‌మీద వెళ్లేవాణ్ని. దాన్ని సొంత బండిలా, నన్నో డ్రైవర్‌గా ఉపయోగించుకున్నాడు. నా అకౌంట్‌లో తొమ్మిది వేలు ఖాళీ అయ్యాకగానీ అసలు విషయాన్ని గుర్తించలేకపోయాను.
ముద్దు సీన్లో: ‘ఆహా కళ్యాణం’ మా ఆవిడతో కలిసి చూశా. ఓ ముద్దు సన్నివేశంలో తను బాగా ఇబ్బంది పడినట్టు అనిపించింది. ‘నాని ఇలాంటి సన్నివేశాల్లో నటించడు’ అన్నది తన నమ్మకం. తను అంతకుముందే హిందీ సినిమా చూసింది. దాని రీమేక్‌ కాబట్టి, దీన్లో ముద్దు సన్నివేశానికి ప్రిపేర్‌ అయిపోయి వచ్చిందనుకున్నాను. తీరా ఆ సీన్‌ వచ్చేసరికి… తన మొహం మాడిపోయింది.

విశ్వ విఖ్యాత నటసార్వభౌమ ‘నందమూరి తారక రామారావు’

హీరో ‘అక్కినేని నాగార్జున’