MUSIC DIRECTORS

సంగీత దర్శకుడు ‘మిక్కీ.జె.మేయర్’

సంగీత దర్శకుడు ‘మాధవపెద్ది సురేష్’

సంగీత దర్శకుడు సుసర్ల దక్షిణామూర్తి మృతి

అయిదున్నర దశాబ్దాల క్రితం ‘సంతానం’ (1955) చిత్రం కోసం ఘంటసాల పాడిన ‘చల్లని వెన్నెలలో చక్కని కన్నె సమీపములో…’ పాట ఇప్పటికీ మనసు దోచే మధుర గీతం. అదే చిత్రం ద్వారా లతా మంగేష్కర్‌ పాడిన తొలి తెలుగు సినీగీతం ‘నిదురపోరా తమ్ముడా…’ మనసును తడి చేసే మంచి పాట! ఒరియా గాయకుడు రఘునాథ్‌ పాణిగ్రాహి ‘ఇలవేలుపు’ (1956) చిత్రం కోసం పాడిన ‘చల్లని రాజా ఓ చందమామా…’ నేటికీ ఓ మధురానుభూతి. ‘నర్తనశాల’ (1963) చిత్రంలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ పాడిన ‘సలలిత రాగ సుధారస సారం…’ లాంటి పాటలు తెలుగువారు ఎవరైనా, ఎన్నటికైనా మరిచిపోగలిగేవేనా? మరి, మంగళంపల్లి, లతా మంగేష్కర్‌, రఘునాథ్‌ లాంటి అగ్రశ్రేణి కళాకారులను మొట్టమొదటిగా తెలుగు సినిమాల్లోకి తెచ్చి, ఇలాంటి మధుర గీతాలు పాడించిన సంగీత దర్శకుడు ఎవరో ఎందరికి గుర్తున్నారు? 90 ఏళ్ళ వయస్సులో ఆయన ఇవాళ్టికీ మన మధ్యనే ఉన్నారని ఎందరికి తెలుసు? సంప్రదాయ సంగీతాన్ని ప్రాతిపదికగా చేసుకొని, దక్షిణ భారత సినీ సంగీతంలో సినిమాలోని సన్నివేశానికీ, సాహిత్యానికీ కొత్త సొబగులు చేకూర్చిన ఆ సంగీత దర్శకుడు – సుసర్ల దక్షిణామూర్తి.
తొమ్మిది పదుల పండు వయసులో ఆ సంగీతజ్ఞుడు తన ఆఖరి సంతానమైన అనురాధ ఇంట్లో చెన్నపట్నంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. కంటి చూపు పూర్తిగా పోయి, వినికిడి బాగా తగ్గిన ఈ ముదిమి వయస్సులోనూ మనస్సులో మిగిలిన సంగీతాన్ని మర్చిపోలేదు. 1930ల చివరి నుంచి సినీరంగంలో ఉన్న ఆయన ఇవాళ మన మధ్య ఉన్న తెలుగు సినీ సంగీత దర్శకుల్లోకెల్లా సీనియర్‌! ప్రభుత్వం, సినీ పరిశ్రమ మర్చిపోయినా, సంగీతమే తోడుగా శేషజీవితం గడుపుతున్న సుసర్ల దక్షిణామూర్తిని ‘ప్రజాశక్తి’ కలిసింది. కుమార్తె అనురాధ సాయంతో ఆయనతో ముఖాముఖి జరిపింది. సుసర్ల, వారి కుమార్తె చెప్పిన ఆపాత మధుర జ్ఞాపకాలు కొన్ని…
సుసర్ల దక్షిణామూర్తి గారికి ఆయన తాత గారి పేరే పెట్టారు. తాతగారైన సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి సీనియర్‌ సాక్షాత్తూ త్యాగరాజ శిష్యపరంపరకు చెందినవారు. కర్ణాటక సంగీత త్రిమూర్తుల్లో ఒకరైన త్యాగరాజు గారి శిష్యులు ఆకుమళ్ళ (మనంబుచావడి) వెంకట సుబ్బయ్య వద్ద దక్షిణామూర్తి సీనియర్‌ శాస్త్రీయ సంగీతం అధ్యయనం చేశారు. ఆ అధ్యయనం తరువాత తిరిగి స్వగ్రామం పెదకళ్ళేపల్లికి వచ్చిన దక్షిణామూర్తి సీనియర్‌ ఎంతో మందికి ఇంట్లోనే భోజనాది వసతులు కల్పించి మరీ, కర్ణాటక సంగీతంలో శిక్షణనిచ్చారు. ఆయన దగ్గర శిక్షణ పొందిన ప్రసిద్ధుల్లో పారుపల్లి రామకృష్ణయ్య పంతులు, (అంధుడైనప్పటికీ, సంగీతం నేర్చుకొని గొప్పవాడైన) సింహాద్రి అప్పలాచార్యులు, రాజనాల వెంకటప్పయ్య, పిచ్చి హరి, వంకమామిడి వీరరాఘవయ్య తదితరులు ఉన్నారు.
సుసర్ల దక్షిణామూర్తి సీనియర్‌ నుంచి ఆయన కుమారుడు సుసర్ల కృష్ణబ్రహ్మశాస్త్రికీ, అనంతరం ఆయన నుంచి ఆయన కుమారుడైన సుసర్ల దక్షిణామూర్తి జూనియర్‌కూ శాస్త్రీయ సంగీతం వాహినిగా ప్రవహించింది. 11 నవంబర్‌ 1921 నాడు కృష్ణాజిల్లా దివిసీమలో దక్షిణ కాశీగా ప్రసిద్ధికెక్కిన పెదకళ్ళేపల్లి గ్రామంలో సుసర్ల దక్షిణామూర్తి జూనియర్‌ జన్మించారు. తల్లి పేరు – అన్నపూర్ణ. దక్షిణామూర్తి జూనియర్‌ తన తండ్రి కృష్ణబ్రహ్మ శాస్త్రి వద్దే ఆరో ఏట నుంచి సంగీతం అభ్యసించారు. ఒకపక్క గాత్ర సంగీతంతో పాటు, మరోపక్క వయొలిన్‌ కూడా నేర్చుకున్నారు. మొదట గాత్రంలో, ఆ తరువాత వయొలిన్‌లో దిట్టగా తయారయ్యారు. దక్షిణామూర్తి జూనియర్‌ బడి చదువులు పెద్దగా చదివింది లేదు. ”ఏ ఆరో తరగతి వరకో, ఏడో తరగతి వరకో చదువుకున్నా. అంతే! హిందీ భాష రాయడం, చదవడం, మాట్లాడడం తెలుసు” అని ఆయన చెప్పారు. ఇటు వయొలిన్‌తో, అటు గాత్రంతో జంత్ర – గాత్ర కచ్చేరీలు చేస్తూ, 13 ఏళ్ళ ప్రాయంలోనే ఎన్నో రాజాస్థానాల్లో ఆయన సంగీత కచ్చేరీలు చేశారు. చల్లపల్లి రాజా గారి దగ్గర, ఏలూరులో, విజయవాడలో – ఇలా చాలా చోట్ల వయొలిన్‌తో కచ్చేరీలు చేశారు. 16వ ఏటనే ‘గజారోహణ’ గౌరవం అందుకున్నారు. ”విజయవాడలో నా గాత్రం విని ప్రముఖ పండితులు తిరుపతి వేంకట కవులు సంతోషించారు. నా మీద ఏకంగా పద్యమే చెప్పారు” అని సుసర్ల తెలిపారు.
”మా అమ్మ, నాన్న గారు తెనాలిలో చాలా కాలం కాపురం ఉన్నారు. అక్కడే నేనూ ఉండేవాణ్ణి. ప్రఖ్యాత నటి కాంచనమాలదీ తెనాలే! సంగీతంలో నా విద్వత్తును గుర్తించిన ఆమె, ప్రముఖ సినీ సంగీత దర్శకుడు భీమవరపు నరసింహారావు లాంటి సినిమావాళ్ళతో చెబితే, వాళ్ళు వచ్చి నా కచ్చేరీ చూశారు. తెనాలిలో నేను చేసిన కచ్చేరీ చూసిన భీమవరపు నరసింహారావు, ‘మద్రాసుకు వస్తావా?’ అని అడిగారు. వారి పిలుపు మేరకు నేను మద్రాసు చేరాను. రాజనాల వెంకటప్పయ్య వెంట ఉండి నన్ను మద్రాసుకు తీసుకువెళ్ళారు” అని దాదాపు 17వ ఏట నుంచి స్వతంత్రంగా బతికిన సుసర్ల తన సినీ జీవిత ఆరంభాన్ని చెప్పుకొచ్చారు. భీమవరపు నరసింహారావు వద్ద చేరి, 1937 నుంచి సహాయకునిగా పనిచేశారు. భీమవరపు సంగీతం అందించిన నవ్యకళా ఫిలిమ్స్‌ వారి ‘మీరాబాయి’ (1940) చిత్రానికి పనిచేశారు. దక్షిణామూర్తికి అదే తొలి సినీ అనుభవం. ఆ తరువాత ”ఎన్నో సినిమాలకు సంగీత శాఖలో పనిచేస్తూ, వయొలిన్‌ వాయించాను. నేపథ్య గానం కూడా చేశాను” అని సుసర్ల తెలిపారు.
1938లో ‘హిజ్‌ మాస్టర్స్‌ వాయిస్‌’ (హెచ్‌.ఎం.వి) సంస్థలో హార్మోనిస్టుగా చేరారు. ”తరువాతి రోజుల్లో సంగీత దర్శకులుగా ప్రసిద్ధులైన జంట ఎం.ఎస్‌. విశ్వనాథన్‌ – రామ్మూర్తిలో ఒకరైన రామ్మూర్తి నాకు సహోద్యోగి. నేను, రామ్మూర్తి హెచ్‌.ఎం.వి.లో వాద్యకళాకారులుగా పనిచేశాం” అని సుసర్ల చెప్పారు. 1939 ప్రాంతంలో ‘ఆకాశవాణి’ (ఏ.ఐ.ఆర్‌) – ఢిల్లీలో ప్రవేశించారు. ”ఆకాశవాణిలో నేను ‘ఏ’ గ్రేడ్‌ ఆర్టిస్టును. మద్రాసు, కలకత్తా, బెల్గామ్‌, పూనా, బొంబాయి, కటక్‌ లాంటి ఎన్నో చోట్ల ఆకాశవాణిలో పనిచేశాను. మద్రాసులో దాదాపు ఓ ఏడాది పాటు పనిచేశాను. నా పనితీరుకు మెచ్చి, ఢిల్లీకి వెళ్ళమని మద్రాసు ఆకాశవాణి కేంద్రం డైరెక్టరే నన్ను ఢిల్లీకి పంపించారు” అని ఆయన తెలిపారు. దక్షిణ భారత భాషల సంగీత నిర్దేశకుడిగా సుసర్ల ఎన్నో మధుర స్వరాలను ఆకాశవాణి శ్రోతలకు అందించారు. జాతీయ వార్త సంస్థ ‘సెంట్రల్‌ న్యూస్‌ ఆర్గనైజేషన్‌’లో సంగీత నిర్దేశకుడిగా సేవలందించారు.
పర్లాకిమిడి రాజా గజపతిదేవ్‌ తీసిన ‘నారద నారది’ (1946) చిత్రంతో సుసర్ల దక్షిణామూర్తి తొలిసారిగా సంగీత దర్శకత్వం చేపట్టారు. తరువాతి కాలంలో ప్రముఖ నటిగా పేరు తెచ్చుకున్న సూర్యకాంతం తొలి చిత్రమైన ఈ సినిమాకు ఆయన సంగీత సారథ్యం వహించడమే కాకుండా, చిన్న పాత్ర కూడా ధరించారు. ఆ తరువాత కొల్హాపూర్‌లో నిర్మించిన ‘సేతు బంధన్‌’ (1946) చిత్రానికీ, పూనాలో నిర్మించిన ‘భట్టి విక్రమార్క’ చిత్రానికీ సంగీత దర్శకత్వం వహించారు.
వయొలినిస్టుగా అనేక చిత్రాల్లో పనిచేస్తూ వచ్చారు. ప్రముఖ సినీ సంగీత దర్శకుడు సి.ఆర్‌. సుబ్బురామన్‌ దగ్గర సహాయకుడిగా పలు చిత్రాలకు పనిచేశారు. ”ఆయన దగ్గర కలకత్తాలో ఓ చిత్రానికి సంగీతం చేశాం” అని సుసర్ల చెప్పారు. ‘చెంచులక్ష్మి’ (1943), ‘రత్నమాల’ (1948 జనవరి2 విడుదల), ‘స్వప్నసుందరి’ (1950), అక్కినేని ‘దేవదాసు’ (1953) తదితర చిత్రాలకు కూడా ఆయన పనిచేశారు. ”నాన్నగారు వయొలినే కాకుండా హార్మోనియం, అరుదుగా వేణువు కూడా వాయించేవారు” అని అనురాధ చెప్పుకొచ్చారు.
‘సంసారం’ (1950) చిత్రంతో సంగీత దర్శకుడిగా సుసర్ల దక్షిణామూర్తి బాగా ప్రాచుర్యం పొందారు. ఆ రోజుల్లోనే ”ప్రముఖ నటి – నిర్మాత లక్ష్మీరాజ్యం నిర్మించిన రెండు, మూడు సినిమాలకు కలకత్తాలో పనిచేశాను” అని ఆయన చెప్పారు. ఆకాశవాణిలో పనిచేయడం కూడా సంగీత దర్శకుడయ్యాక సుసర్లకు బాగా ఉపయోగపడింది. ”గాయని లతా మంగేష్కర్‌ అప్పట్లో ఢిల్లీ రేడియో స్టేషన్‌లో పాటలు పాడుతుండేది. ఆమె గాత్రంతో, ఆమెతో పరిచయం ఉండడంతో, నేను సినిమా సంగీత దర్శకుడినైన తరువాత ఆమెను పిలిపించాను. ఆమెతో తొలిసారిగా తెలుగు సినిమాలో పాట పాడించాను. ‘నిదురపోరా తమ్ముడా…’ అనే ఆ అనిసెట్టి సుబ్బారావు రచన ఎంతగా ప్రాచుర్యం పొందిందో అందరికీ తెలిసిందే!” అని ప్రఖ్యాత గాయని లతాజీతో తన పరిచయాన్ని సుసర్ల వివరించారు.
తొలి రోజుల్లో ‘సంసారం’ (1950)తో నిలదొక్కుకున్న సుసర్ల ఆ తరువాత సంగీతం అందించిన చిత్రాల్లో ముఖ్యమైనవి కొన్ని – ‘ఆలీబాబా – నలభై దొంగలు’, ‘సర్వాధికారి’ (1951), ‘ఆడజన్మ’ (1951), ‘దాసి’ (1952), ‘సంతానం’ (1955), ‘ఇలవేలుపు’ (1956), ‘హరిశ్చంద్ర’ (1956), ‘భలే బావ’ (1957), ‘శ్రీకృష్ణలీలలు’ (1959), ‘అన్నపూర్ణ’ (1960), ‘నర్తనశాల’ (1963), ‘శ్రీమద్విరాటపర్వం’ (1979), ‘శ్రీమద్విరాట్‌ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర’ (1984) మొదలైనవి. నిండైన గాత్రం ఉన్న దక్షిణామూర్తి తొలి రోజుల్లో సినీ నేపథ్య గాయకుడిగా పలు పాటలు పాడారు. ‘పరమానందయ్య శిష్యులు’ (1950), ‘శ్రీలక్ష్మమ్మ కథ’ (1950), ‘స్త్రీ సాహసం’ (1951) మొదలైన చిత్రాలలో ప్రముఖ హీరో అక్కినేని నాగేశ్వరరావుకు ప్లే-బ్యాక్‌ పాడారు. ‘సర్వాధికారి’ (1951) చిత్రంలో తమిళ హీరో ఎం.జి.ఆర్‌.కు గొంతు అరువిచ్చారు.
అలా సినీ జీవితపు తొలి రోజుల్లో కొన్ని చిత్రాల్లో ప్లే-బ్యాక్‌ కూడా పాడిన సుసర్లకు అప్పట్లో నటన మీద కూడా కొంత ఆసక్తి ఉండేది. ”నటన మీద మీకు ఆసక్తి ఉండేదా?’ అని అడిగితే ‘ఏం చెప్పను! ‘నారద నారది’లో చిన్నవేషం, రాజ్యం పిక్చర్స్‌ ‘హరిశ్చంద్ర’ చిత్రంలో కాశీ రాజు వేషం వేశాను” అంటూ ఆయన నవ్వేశారు.
అన్ని భాషల్లోనూ కలిపి 135 దాకా చిత్రాలకు సుసర్ల దక్షిణామూర్తి పని చేశారు. సంగీత దర్శకులు ఎస్‌.పి. కోదండపాణి, ఏ.ఏ. రాజ్‌, శ్యామ్‌ మొదలైనవారు ఈయన వద్ద పనిచేసినవాళ్ళే! అలాగే, ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎస్‌. విశ్వనాథన్‌ సైతం సుసర్ల వద్ద హార్మోనిస్టుగా పనిచేశారు. సంగీత దర్శకుడిగా సుసర్ల ప్రధానంగా హార్మోనియమ్‌ మీదే బాణీలు కట్టేవారు. జమునా రాణి, పి. లీల, బెంగుళూరు లత మొదలైన గాయనీమణులకు తొలి అవకాశం ఇచ్చి, పరిచయం చేసింది – సుసర్లే! ‘సంతానం’ (1955)తో లతా మంగేష్కర్‌నూ, ‘ఇలవేలుపు’ (1956)తో రఘునాథ్‌ పాణిగ్రాహినీ, ‘వచ్చిన కోడలు నచ్చింది’ (1959)తో ఎం.ఎల్‌. వసంత కుమారినీ, ‘నర్తనశాల’ (1963)తో మంగళంపల్లి బాలమురళీకృష్ణనూ సుసర్ల దక్షిణామూర్తి తెలుగు చిత్ర రంగానికి పరిచయం చేశారు. సుసర్ల స్వరపరచగా, రావు బాలసరస్వతి గానం చేసిన ‘నీలవణ్ణ కణ్ణా వాడా నీ వరు ముత్తం తాడా…’ (శివాజీ గణేశన్‌, పద్మిని నటించిన ఓ తమిళ చిత్రంలోని పాట) లాంటి తమిళ చిత్ర గీతాలు సైతం ఇవాళ్టికీ అక్కడ పాపులరే!
ఆంధ్ర రాష్ట్ర అవతరణ సందర్భంగా ప్రార్థనా గీతం పాడి జవహర్‌లాల్‌ నెహ్రూ చేతులమీదగా సన్మానం అందుకున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చిన గుర్తింపు తక్కువైనప్పటికీ, వివిధ ప్రైవేటు సాంస్కృతిక, కళా సంస్థలు ఎన్నో సన్మానాలు, సత్కారాలు చేశాయి. బిరుదులు ప్రదానం చేశాయి. ‘స్వరశిల్పి’, ‘సంగీత కళాప్రపూర్ణ’, ‘సుస్వరాల సుసర్ల’, ‘స్వరబ్రహ్మ’, ‘సంగీత కళానిధి’, ‘సంగీత సమ్రాట్‌’, ఎన్టీఆర్‌ పేర్కొన్న ‘స్వర సుధానిధి’ లాంటి బిరుదులు సుసర్లకు దక్కాయి. విదేశాలలో కూడా కచ్చేరీలు చేసి, తమ సంగీత వైభవాన్ని సుసర్ల చాటుకున్నారు.
కుటుంబ జీవితం సంగతికి వస్తే – దక్షిణామూర్తికి చిన్న వయస్సులోనే పెళ్ళయింది. ”మా అమ్మ, నాన్న గార్ల పెళ్ళి చాలా గమ్మత్తుగా జరిగింది. మా నాన్న గారు నంద్యాలలో కచ్చేరీ చేయడానికి వెళ్ళినప్పుడు, అక్కడ ఆయనకు భోజనాది వసతులు చూడడం కోసం చిన్న పిల్ల అయిన మా అమ్మ గారిని అక్కడి పెద్దలు నియోగించారట. పద్మశాలీ కుటుంబానికి చెందిన మా అమ్మ గారి ఒద్దిక, ఓర్పు చూసి, మా నాన్నగారు ఇష్టపడ్డారు. చివరకు పూరీలోని జగన్నాథ స్వామి గుడిలో వారిద్దరూ పెళ్ళి చేసుకున్నారు. అప్పటికి మా నాన్న గారి వయస్సు 17 ఏళ్ళు, మా అమ్మ గారి వయస్సు 15 ఏళ్ళు” అని ఆ సంగతులను అనురాధ వివరించారు.
అయితే, కొన్నేళ్ళ తరువాత సుసర్ల జీవితం హాయిగా ఏమీ సాగిపోలేదు. ఆరోగ్యం ఆయనను కుంగదీసింది. మధుమేహ వ్యాధి అధికమైంది. దాంతో, ఆయన రెండు కళ్ళకూ రెటీనా డిటాచ్‌మెంట్‌ వచ్చింది. 1960లలో మొదట ఆయన ఎడమ కన్ను దెబ్బతింది. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. ఉన్న ఒంటి కన్ను చూపుతోనే కష్టపడి సంగీతం చేస్తూ వచ్చారు. సంగీత దర్శకుడిగా అవకాశాలు తగ్గాక, కుటుంబ పోషణ కోసం అప్పటి ప్రముఖ సంగీత దర్శకుడు చక్రవర్తి దగ్గర పాటల రికార్డింగుల్లో వయొలిన్‌ వాద్య కళాకారుడిగా కూడా పనిచేశారు. 1982 నుంచి 1987 వరకు ఆయన చక్రవర్తి సంగీత బృందంలో వయొలిన్‌ వాయించారు. కానీ, ఆ తరువాత 1987 ప్రాంతంలో సుసర్లకు రెండో కన్ను కూడా దెబ్బతింది. దాంతో దాదాపుగా అంధత్వం ఆవరించింది. అయినా, ఆయన ఇప్పటికీ మనోనేత్రంతో సంగీత లోకాలను దర్శించడం మానలేదు. వయస్సు 90 ఏళ్ళు నిండుతున్నా, ఇవాళ్టికీ కాస్తంత హుషారుగా అనిపిస్తే, ప్రతిభావంతురాలైన భరతనాట్య కళాకారిణి అయిన మనుమరాలు శుభాంజలీ సద్గురుదాస్‌ లాంటి వారు చేతికి వయొలిన్‌ అందించగానే అలవోకగా పాట పాడుతూ, తీగలపై సుస్వర విన్యాసం సాగిస్తారు.
గణనీయమైన సంఖ్యలో ఎన్‌.టి.రామారావు చిత్రాలకు సంగీతం అందించిన సుసర్ల, ”ఎన్టీఆర్‌ నన్ను బాగా చూసుకున్నారు. ఆయన చిత్రాల్లో పనిచేసేందుకు నాకు పదే పదే అవకాశమిచ్చారు” అని చెప్పారు. ”శాస్త్రీయ సంగీత ప్రధానమైన బాణీలు కట్టాలంటే – అప్పట్లో సాలూరి రాజేశ్వరరావు గారు, నాన్న గారినే ఎక్కువగా అడిగేవారు. అలాంటి చిత్రాలకు నాన్నగారిని ఎన్టీఆర్‌ ప్రత్యేకంగా పిలిపించి పెట్టుకొనేవారు. ఎన్టీఆర్‌ రూపొందించిన ‘శ్రీమద్విరాటపర్వం’, ‘శ్రీమద్విరాట్‌ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర’ చిత్రాలకు పనిచేసే నాటికే నాన్నగారికి సరిగ్గా కళ్ళు కనిపించేవి కావు. ఎవరో ఒకరు వచ్చి, నాన్నగారిని రికార్డింగులకు తీసుకువెళ్ళేవారు. ఆ పరిస్థితుల్లో కూడా ఆయన హార్మోనియమ్‌ ముందు కూర్చొని, బాణీలు కట్టి, గాయకులతో పాడించేవారు” అని ప్రస్తుతం దగ్గరుండి మరీ సుసర్ల దక్షిణామూర్తి ఆలనా పాలనా చూసుకుంటున్న ఆయన ఆఖరి సంతానం అనురాధ వివరించారు.
చాలామందికి తెలియని విషయం ఏమిటంటే – సుసర్ల దక్షిణామూర్తి కొన్ని చిత్రాలను నిర్మించారు కూడా! ”నా పేరు మీద ‘అనురాధా మూవీస్‌’ అనే సంస్థను నెలకొల్పి, రెండు సినిమాలు కూడా తీశారు. అవి – ‘మోహినీ రుక్మాంగద’, ‘రమా సుందరి’ అని నాకు గుర్తు. అయితే, తెలియని వ్యవహారం కావడంతో చిత్ర నిర్మాణం వల్ల చాలా నష్టపోయారు” అని అనురాధ చెప్పుకొచ్చారు.
తొంభై ఏళ్ళ వయసులో, కంటి చూపు లేక పూర్తిగా ఇంటికే పరిమితమైనా, ఇప్పటికీ సుసర్ల దక్షిణామూర్తికి సంగీతమే మానసికంగా ఆసరా. ఈ వయసులో ఆయన ఒంటరిగా కూర్చొని, తనలో తానే ఏవో పాటలు, కీర్తనలు పాడుకుంటూ ఉంటారు. బహుశా ఆ సలలిత రాగ సుధారస సారమే అనేక ఆర్థిక, మానసిక ఇబ్బందుల్లో మధ్య కూడా ఈ వయస్సులోనూ ఆయనను ముందుకు నడిపిస్తోంది. తెలుగు సినీ రంగంలో ప్రస్తుతం ఉన్న అత్యంత సీనియర్‌ సంగీత దర్శకుడైన ఈ సంగీత మూర్తికి ప్రభుత్వం, కళాప్రియులు కూడా అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

సంగీత దర్శకుడు ‘దేవిశ్రీ ప్రసాద్’

ee 13 jan 13 devisriprasad

సంగీత దర్శకుడు ‘శేఖర్ చంద్ర’

సంగీత దర్శకుడు ‘చక్రి’

కాలేజీ సిలబస్ లో ‘రెహమాన్’ సంగీతం

సంగీత దర్శకురాలు ‘వింజమూరి అనసూయాదేవి’

సంగీత దర్శకుడు సాలూరు రాజేశ్వరరావు

సాలూరు రాజేశ్వరరావు- తెలుగు సినీ రంగానికి సుమారు ఐదు దశాబ్దాలపాటు మధురమైన సంగీతాన్నీ అందించిన సంగీత దర్శకుడు కేవలం సాలూరు రాజేశ్వరరావు గారు మాత్రమే. ఎన్నో అజరామరమైన వెండితెర వెలుగులకు సంగీతపు మధురిమలు అందించినవారిలో ఆయన స్థానం ప్రత్యేకం.

నాడే తెలుగు సినీ గీతంలో హిందుస్తానీ, పాశ్చాత్య సంగీతాన్ని మేళవించిన అసమాన ప్రతిభా సంపన్నుడు సాలూరి రాజేశ్వరరావు. తొలిచిత్రంలోనే తన గాన, నటనా కౌశలాన్ని సాలూరి తెలుగు ప్రేక్షకులకు చాటి చెప్పాడు. శశిరేఖాపరిణయం (మాయాబజార్‌ 1936) ఆయన రెండవ చిత్రం. దీనిలో అభిమన్యుడి పాత్రని పోషిస్తూ కొన్ని పాటలు కూడా పాడారు. గాయక నటునిగా పేరు సంపాదించినా సంగీతకారునిగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే తృష్ణ ఈయనలో అధికంగా వుండేది.

అత్యంత యువ సంగీతదర్శకుడిగా చరిత్ర సృష్టించినా సినీ సంగీతదర్శకునిగా బాగా గుర్తింపు తెచ్చిన మొదటి సినిమా ఇల్లాలు (1940).ఆ చిత్రంతో తెలుగు శ్రోతలకొక కొత్తరకమైన సంగీతం పరిచయం చేయబడింది. “లలిత సంగీత”మన్న దానికి తెలుగులో మొదటిగా శ్రీకారం చుట్టి ఒక కొత్త వొరవడిని సృష్టించాడు. కలకత్తాలో బెంగాలీ సంగీతం ద్వారా ప్రభావితుడైన సాలూరి ఆధునికత్వం కోసం చేసిన ప్రయోగాలు తెలుగు సినీ పరిశ్రమలో అంతగా ఆదరణ పొందకపోయినా, తెలుగు పాటకు పాశ్చాత్య బాణీని యెలా జతపరచవచ్చో “ఇల్లాలు” ద్వారా; ఆ తరువాత ఈయన పాడిన లలిత గీతాల ద్వారా, సమర్ధవంతంగా నిరూపించాడు. ఆర్కెస్ట్రా నిర్వహణలో “హార్మొనీ” యొక్క ప్రాధాన్యత ఏమిటో ఆయనకు అర్థమయినంతగా మరెవ్వరికి కాలేదేమో!

ఇల్లాలు చిత్రం ద్వారా సాలూరి కి ఒక బాల సరస్వతి గారి స్వరం తోడై ఒక నూతనత్వానికి తెరలేపింది. వీరిరువురు కలిసి పాడిన పాటలు అత్యంత ప్రజాదరణ పొందడమే కాక గ్రాంఫోన్ రికార్డుల రూపం లోవెల్లువెత్తి తెలుగు సంగీత చరిత్రలో ఒక కమనీయమైన ఘట్టంగా శాశ్వతంగా నిలిచిపోయింది. ఆంధ్రదేశంలో సంగీతరంగానికి నలభయ్యవ దశకం ఒక స్వర్ణయుగమైతే దానిలో సుమారొక యెనిమిదేళ్ళపాటు రాజేశ్వరరావు, బాలసరస్వతులు రాజ్యమేలారంటే అతిశయోక్తి కాదు.జెమినీసంస్థకి ఆస్థాన సంగీత దర్శకుడిగా పని చేసి ఎన్నో మధురమయిన సుస్వరాలని అందిచారు.

సాలూరి ప్రతిభను యావద్భారత దేశానికి తెలియ జెప్పిన చిత్రం చంద్రలేఖ (1948). కర్ణాటక, హిందుస్తానీ, పాశ్చాత్య శాస్త్రీయ సంగీతాలని,లాటిన్‌ అమెరికన్‌, పోర్చుగీస్‌, స్పానిష్‌ జానపద సంగీత పోకడల్ని ఎంతో ప్రతిభావంతంగా సమ్మిళితం చేసి, ఆ కాలంలో వూహించలేనటువంటి పెద్ద వాద్యబృందంతో సృష్టించిన చిత్రమది.

సాలూరి కిరీటంలో కలికితురాయి మల్లీశ్వరి (1951). సినిమా సంగీతంలోను, సినిమా తీసే పద్ధతిలోను గణనీయమైన మార్పులు చెందినా, అర్ధ శతాబ్దం తర్వాతకూడా నేటికీ గల గలా ప్రవహించే నదిలా వీనులవిందు గొలుపుతున్న సాహిత్య సంగీతాల మేళవింపు “మల్లీశ్వరి”. బి.ఎన్‌.రెడ్డి కార్యదక్షతతో, దేవులపల్లి మల్లెపూరేకు బరువుతో వ్రాసిన సాహిత్యంతో, పసుమర్తి కృష్ణమూర్తి నృత్య సారధ్యంతో, ఘంటసాల భానుమతిల గళ మధురిమతో యీ చిత్రంలోని సంగీతం తక్కిన అన్ని హంగుల మాదిరిగానే నభూతో నభవిష్యతి. దీనిని మించిన సంగీతభరితమైన చిత్రం ఇంతవరకు రాలేదు, ఇక ముందు కూడా రాబోదని దృఢంగా విశ్వసించే చాలామంది వున్నారు. సాలూరే “మల్లీశ్వరి” పై వ్యాఖ్యానిస్తూ “చంద్రలేఖ” కథకు ఒక కాలం అంటూ లేదు కనుక అన్నిరకాల సంగీతం వినిపించడానికి అవకాశం కలిగింది. కాని, “మల్లీశ్వరి” చరిత్రకు సంబంధించిన చిత్రం. అటు కథాకాలానికి, ఇటు కాస్త ఆధునికంగానూ వుండేలా సంగీతం కూర్చవలసి వచ్చింది. శాస్త్రీయ రాగాలను తీసుకొని, సెమిక్లాసికల్‌ గా స్వరపరిచాను. అలాగే అందులోని ఏ పాటా కూడా ట్యూన్‌కి రాసింది కాదు! బి.ఎన్‌.గారికి సంగీతాభిరుచి ఎక్కువ కావడంతో ఒక్కో పాటకు ఐదారు వరసలు కల్పించవలసి వచ్చింది. ఆ చిత్రానికి మొత్తం ఆరునెలలపాటు మ్యూజిక్‌ కంపోజింగ్‌ జరిగింది” అన్నాడు.

ప్రతి సంగీత విద్యార్ధి మొదటిగా నేర్చుకొనే శ్రీగణనాధ సింధూరవర్ణ (మలహరి) అన్న పురందరదాస కృతితో చిత్రం ప్రారంభమవుతుంది. తరువాత తేలికగా పాడుకోగలిగే బాణీలలో పిల్లల పాటలు (ఉయ్యాల జంపాల, రావి చెట్టు తిన్నె చుట్టూ), హాస్య గీతం (కోతీబావకు పెళ్ళంట), ప్రకృతి పాట (పరుగులు తీయాలి), జావళి ( పిలచిన బిగువటరా), జానపదం (నోమీన మల్లాల), వీడ్కోలు పాట (పోయిరావే తల్లి), యక్షగానం (ఉషాపరిణయం), యుగళ గీతం, ఇలా అన్నిరకాల పాటలనందించి విభిన్న శ్రోతలను ఆనందపరచిన చిత్రమిది. మరింత ప్రత్యేకంగా పేర్కొనవలసినది, తెలుగువారందరూ ఎంతో గర్వపడ వలసినది, కాళిదాసుని మేఘసందేశానికేమాత్రం తీసిపోని సాలూరి, దేవులపల్లి, ఘంటసాల భానుమతుల సమిష్టి కృషిఫలితం ఆకాశవీధిలో అన్న పాట. ఈ రాగమాలిక(భీంపలాస్‌, కళంగద, కీరవాణి, హంసానంది) అనురాగరసంతో విరహగీతాన్ని విరచించే తూలిక!

శాస్త్రీయ సంగీత బాణీలు, కర్ణాటక హిందుస్తానీ రాగాలలో యుగళ్‌ బందీలు , పాశ్చాత్య సంగీత రూపాలు, … ఇలా చేపట్టిన ఏ ప్రక్రియలోనైనా అద్వితీయమైన సంగీతాన్ని విన్పించారు. అనేక సంగీత రీతుల్ని సమన్వయం చేయడంలో ఆయన సాధించిన విజయాలు మరెవ్వరూ సాధించలేదు. వాయిద్యాలపై ఆయనకున్న పట్టును గురించి చిత్రరంగంలో చాల గొప్పగా ఈనాటికీ చెప్పుకుంటారు.

ఈయన సుదూర సుస్వర సంగీతయాత్రలో 200కు పైగా చిత్రాలకు, ఎన్నో లలిత గీతాలకు, పెక్కు ప్రైవేటు రికార్డులకు సంగీతాన్ని అందించాడు. ఆయన 40 ఏళ్ళకు పైబడిన సినీ జీవితంలో కనీసం పేరైనా పేర్కొనవలసిన చిత్రాలు రాజు పేద (54), మిస్సమ్మ (1955), భలేరాముడు (1956), మాయాబజార్‌ (1957, 4 పాటలు మాత్రమే), అప్పుచేసి పప్పుకూడు, (1958), చెంచులక్ష్మి (1958), భక్త జయదేవ (1960), అమరశిల్పి జక్కన (1963), భక్త ప్రహ్లాద (1967). అభేరి (భీంపలాస్‌), కల్యాణి, మోహన, సింధుభైరవి,శంకరాభరణం ఈయనకు ప్రియమైన రాగాలు. శాస్త్రీయ రాగాల్లో ఆయన వినిపించిన వరసలను గురించి మరొక సుదీర్ఘమైన వ్యాసమే రాయవచ్చు. జగమే మారినది (కల్యాణి, దేశ ద్రోహులు 62), నా హృదయంలో నిదురించే చెలీ (శంకరాభరణం, ఆరాధన 62), పాడవేల రాధికా (మోహన, ఇద్దరు మిత్రులు 60), … లాంటి పాటలు మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే.

ఏదో ఒక సంగీతానికే కట్టుబడి వుండాలని ఈయన మడికట్టుకు కూర్చోలేదు. మారుతున్న కాలాన్నిబట్టి పరిస్థితులు ఎన్నో మారుతున్నాయి. అదే విధంగా సినిమా సంగీతంలో కూడా మార్పులెన్నో వచ్చాయి. పాశ్చాత్య శాస్త్రీయ సంగీతాన్ని, జాజ్‌, పాప్‌, రాక్‌, డిస్కో వంటి అధునాతన పాశ్చాత్య సంగీతాన్ని మనం అడ్జస్ట్‌ చేసుకోక తప్పలేని పరిస్థితి. వాటిని మనం అనుసరించడంలో తప్పులేదు. కానీ, కేవలం అనుసరించడం, అనుకరించడం కోసమై మన సంగీతానికి ప్రాణసమానమైన ‘మెలొడీ’ ని ఈతరంవారు మర్చిపోతున్నారు అని అన్న ఆయన మాటలు ఎంతయినా నిజం. ముఖ్యంగా ఈనాడు! సాంఘికమైనా, పౌరాణికమైనా తను నమ్ముకున్న మెలొడీకి ప్రాధాన్యతనిస్తూ సంప్రదాయ రాగాల్లో వుండేటటువంటి మధురిమను వదులుకోకుండా చక్కని చిక్కని పాటలు అందించాడు.

సంగీతదర్శకుడు ‘ పెండ్యాల నాగేశ్వరరావు

పెండ్యాల నాగేశ్వరరావుగారు తెలుగు చిత్రాలకు దొరికిన అద్భుత సంగీత దర్శకులలో ఒక్కరు. తెలుగు సినిమాసంగీతాన్ని గగనదిశకు తీసుకువెళ్లి తారాపథంలో నిలబెట్టి, ఆచంద్రతారార్కం ఆ మధురసంగీతాన్ని వింటూ, పరవశిస్తూపాడుకునేలా చేసిన చలనచిత్ర సంగీతసమ్రాట్‌ పెండ్యాల నాగేశ్వరరావు. పెండ్యాల గారు సినీ జీవితం ప్రారంభించినకొత్తల్లో తల్లిప్రేమ (1941), సతీ సుమతి (1942) చిత్రాలకు హార్మోనిస్టుగా, సహాయ సంగీతదర్శకుడిగా పని చేశారు. స్వతంత్ర్య సంగీత దర్శకుడిగా పని చేయగల ప్రతిభ, పేరు ఉండి కూడా కొత్తపొకడలు నేర్చుకోవచ్చునన్న ఆశతోసాలూరు రాజేశ్వరరావు గారి దగ్గర సహాయకులుగా చేరారు. సాలూరు రాజేశ్వరరావు గారు విదేశీయ సంగీతాన్నీ, హిందుస్తానీ పోకడల్నీ తీసుకుని మన రాగాలతో మిళితం చేసి, ‘తెలుగుపాట’లా చేసి వినిపించగల సమర్థుడనిపెండ్యాల పేర్కొనేవారు. పెండ్యాల గారు సంగీతాన్ని అందించిన సినిమాలు దొంగరాముడు , ముద్దుబిడ్డ , భాగ్యరేఖ , జయభేరి , మహామంత్రి తిమ్మరుసు , శ్రీకృష్ణార్జున యుద్ధం , రాముడు భీముడు , శ్రీ కృష్ణ తులాభారం కొన్ని చాలు – వందకుపైగా సంగీతం కూర్చిన ఆ స్వరచక్రవర్తి సంగీతం గురించి చెప్పుకోవడానికి.

అద్భుతమైన పాటలే కాదు, పద్యాలు కూర్చారు. పౌరాణిక చిత్రాలకు సాంఘిక, జానపద చిత్రాలకూ అద్భుతమైన బాణీలు సమకూర్చడానికి తాను ఎంత రిహార్సిల్స్‌ చేసేవారో, గాయనీ గాయకులతో కూడా రిహార్సిల్స్‌ చేయించి మరీ పాడించేవారు. రంగస్థల నటుడు, హార్మోనిస్ట్‌ కూడా కావడంతో పద్యాల మీద రంగస్థలంలో తనకు గల పట్టు, చిత్రాల్లో కూడా పద్యాల మీద చూపి సినిమాల్లో కూడా ఓహో అనేలా పద్యాలు పాడించేవారు. గాయనీ గాయకుల టేలెంట్‌ గుర్తించి, వారి టేలెంట్‌ని సద్వినియోగం అయ్యేలా చేయడానికి మీదు మిక్కిలి శ్రమించేవారు పెండ్యాల.

శాస్త్రీయ సంగీతంలోనూ, హార్మోనియం వాయించడంలోను పేరు ప్రఖ్యాతులు పొందిన తండ్రి సీతారామాయ్య నుంచి గాత్రం, హార్మోనియం రెండూ నేర్చుకున్నారు మిగతా విద్యార్థులతో పాటు. అలాగే తండ్రి రంగస్థల ప్రదర్శనలకు హాజరు అవుతుంటే పెండ్యాల దృష్టి అటువేపు మళ్ళింది. అందుకే స్కూల్లో పాటలు పద్యాలు పాడటమే కాకుండా అప్పుడప్పుడు వేషాలూ వేస్తూ మెల్లిగా రంగస్థలం మీదకు నటుడుగా ప్రవేశించి హార్మోనియం కూడా మీటేవారు.

ఆరుద్ర పెండ్యాల, తిలక్‌ కాంబినేషన్లో రూపొందిన చిత్రాల్లో ఎంత చక్కని పాటలు రూపొందాయో, ఘంటసాల, సుశీల, పెండ్యాల కాంబినేషన్లోనూ అద్భుతమైన పాటలు వెలువడ్డాయి.

దొంగరాముడు, ముద్దుబిడ్డ, ఎమ్‌ఎల్‌ఎ, భాగ్యరేఖ, జయభేరి, భట్టి విక్రమార్క, ఈడూజోడూ, అత్తా ఒకింటి కోడలే, హరిశ్చంద్ర, మహాకవి కాళిదాసు, శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం, జగదేక వీరుని కథ, వాగ్దానం, మహామంత్రి తిమ్మరుసు, కులగోత్రాలు, శ్రీకృష్ణార్జున యుద్ధం, శ్రీకృష్ణ తులాభారం, రాముడు భీముడు, వెలుగునీడలు, ఉయ్యాల జంపాల, శ్రీకృష్ణ సత్య, బావామరదళ్లు, అక్కాచెల్లెలు ఇలా అనేక చిత్రాలను అద్భుతమైన సంగీతం సమకూర్చారు పెండ్యాల.

పెండ్యాల ప్రతిభని పసిగట్టిన గాలిపెంచల నరసింహారావు మాయలోకం (1945) చిత్రానికి హార్మోనిస్టుగా పిలిస్తే, దుక్కిపాటి మధుసూదనరావుగారి సలహాతో పెండ్యాల తిరిగి సినిమారంగానికి వచ్చారు. గృహప్రవేశం (1946) చిత్రనిర్మాణానికి సారథ్యం వహించిన కె.ఎస్‌.ప్రకాశరావు పెండ్యాలకి సహాయ సంగీతదర్శకుడి స్థానం ఇచ్చారు. ఆచిత్రానికి సంగీతర్శకుడు బాలాంత్రపు రజనీకాంతరావు. ఆయన ఆలిండియో రేడియోలో తీరిక లేకుండా వుంటారుగనక, సమర్థుడైన సహాయకుడు కావాలని నాగేశ్వరరావును తీసుకున్నారు. అంతే! పెండ్యాల ప్రజ్ఞ ప్రకాశరావుగారికిపూర్తిగా అర్థమైంది. తరువాత తాను నిర్మించిన, ద్రోహి(1948)కి పెండ్యాలకు సంగీతదర్శకుడుగా అవకాశం ఇచ్చారుప్రకాశరావుగారు. ఆ చిత్రానికీ, ఆ చిత్రంలోని కాఫీ ఖవాలీ, మనోవాంఛలు, పూవు చేరి, చిక్కిలిగింతలు మొదలైనపాటలకీ మంచి పేరొచ్చింది. పెండ్యాల సంగీతగాదర్శకుపెండ్యాల నాగేశ్వరరావుడు స్థిరపడ్డారు. సినిమాలోని సన్నివేశాన్ని అర్థం చేసుకుని, దానికి తగ్గట్టుగా ట్యూన్‌ వచ్చేవరకూ, ఒళ్లు వంచి పనిచెయ్యడం, తను అనుకున్నట్టే గాయనీగాయకుల చేతపాడించడం – పెండ్యాల గుణం. గాయనీ గాయకుల దగ్గర ఎంత ప్రతిభ వుందో, అంత ప్రతిభనీ పూర్తిగావినియోగించుకునే సంగీతదర్శకుడాయన. ఘంటసాలకీ, పెండ్యాలకీ ఒకరిమీద ఒకరికి అమితమైన అభిమానం. పెండ్యాల గారి దృష్టిలో ఘంటసాలని మించిన గాయకుడులేడు!. పెండ్యాల గారి వేలపాటల్లో – అది క్లబ్బుపాటైనాఅందులో కూడా మాధుర్యం తొంగిచూసినట్టే, హిందీపాటని అనుసరించినా, పాశ్చాత్యధోరణిని అనుకరించినా అందులోతెలుగుదనం వుట్టిపడుతుంది. సంగీతరస హృదయులకీ, గాయనీగాయకులకీ అందరికీ నచ్చే సంగీతం ఆయనది.

మీరజాలగలడా పాట పాడించడంలో సుశీలగారిని గుక్క తిప్పుకోవడానికీ, సంగతుల్ని వెయ్యడంలో ఎక్కడైనానిలబెట్టడానికీ వీలుకల్పంచకుండా పెండ్యాలగారు మొత్తం అనుకొన్నది రాబట్టేవరకూ విడిచి పెట్లేదు.

జగదేకవీరుని కథలోని శివశంకరీ పాట గురించి ఘంటసాల చెప్పేవారు. ‘పాట మొత్తం ఒకే టేక్లో పాడగలిగితేబావుంటుంది – ఎన్ని రోజులు రిహార్సల్లు తీసుకున్నా సరే’ అని పెండ్యాలగారంటే – ‘ఒకే టేక్లో మొత్తం పాడతానుచూడండి’ అని ఘంటసాల ‘పందెం’ వేసినట్టు అన్నారు. ‘వారం రోజుల పాటు ఇంకో రికార్డింగ్కి వెళ్లకుండా ఆపాటనే సాధన చేసి, అనుకున్నది సాధించిన మహాదీక్షాపరుడాయన’ అని పెండ్యాలగారు, ఘంటసాల మృతిసందర్భంగా చెబుతూ, ఆయన్ని స్తుతించారు.‌ ‌ ‌