Singer Pardhasaradhi

singer pardhasaradhi 1 singer pardhasaradhi 2

Director Chandu Mondeti

Direc Chandu Mondeti 1 Direc Chandu MOndeti 2

అప్పట్లో… నా భార్యే నన్ను పోషించింది!

ఓ సినిమాకి సంబంధించిన ట్రెయిలర్‌లూ, టీజర్‌లూ లక్షల్లో వ్యూస్‌ కొల్లగొట్టడం కొత్తేం కాదు. కానీ, అసలు షూటింగే మొదలుపెట్టకుండా కేవలం గ్రాఫిక్స్‌ బొమ్మలతో ‘కాన్సెప్ట్‌ వీడియో’గా విడుదలై లక్షల వీక్షణలు కొల్లగొట్టింది ఆ మధ్య విడుదలైన ‘కార్తికేయ-2’ వీడియో. దానికింత క్రేజు రావడానికి కారణం దాని మొదటి భాగం ‘కార్తికేయ’ సాధించిన అద్భుత విజయం. ఈ రెండు ‘కార్తికేయల’ నడుమ ‘ప్రేమమ్‌’, ‘సవ్యసాచి’ సినిమాలు చేసి సత్తా ఉన్న యువదర్శకుడిగా పేరు తెచ్చుకున్న చందూ మొండేటి మనోగతం…

‘ఆర్య’ విడుదలైన రెండో రోజు అనుకుంటా… హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని ఓ టిఫిన్‌ సెంటర్‌. వేడి వేడి బజ్జీలు వేగి పోతున్నాయి. అంతకంటే వేడిగా అక్కడ సినిమా కబుర్లు మొదలయ్యాయి. ఏ నోట విన్నా ‘ఆర్య’ మాటే. ‘ఆ సీను భలే ఉంది..’, ‘సుకుమార్‌ ఏం తీశాడ్రా’… ఇలా ప్రతీ రీలునీ మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుంటున్నారు. అక్కడ బజ్జీలు తిని పక్కనే ఉన్న టీ బడ్డీకి వెళితే అక్కడా అవే మాటలు! ‘ఓ సినిమా తీస్తే.. జనం ఇంతలా మాట్లాడుకుంటారా, ఆ సినిమా నచ్చితే దర్శకుడ్ని ఇంతలా పైకెత్తేస్తారా’ అనిపించింది. ‘నా గురించీ ఇలా మాట్లాడుకుంటే బాగుంటుంది కదా’ అనే ఆలోచనా రేకెత్తింది. అది 2004… అంతకు ఏడాది ముందే బీటెక్‌ ముగించాను. హైదరాబాద్‌లో మా బావ వాళ్లింటికొచ్చాను. మా బావకి దర్శకుడు సుకుమార్‌ రాజోలులో ట్యూషన్‌ మాస్టార్‌గా ఉన్నప్పటి నుంచీ పరిచయమట. నేను అప్పుడప్పుడూ హైదరాబాద్‌కి వస్తుంటే మా బావా వాళ్ల ఫ్రెండ్సూ సుకుమార్‌ గురించీ, దర్శకుడిగా ఆయన చేస్తున్న ప్రయత్నాల గురించీ చెబుతుండేవారు. అప్పటిదాకా నా ఆలోచనల్లో మా బావ పరిచయస్తుల్లో ఒకడిగా మాత్రమే ఉన్న సుకుమార్‌… ‘ఆర్య’ తర్వాత రాత్రికిరాత్రే స్టార్‌ దర్శకుడైపోవడం నన్ను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తింది. సినిమాకున్న శక్తేమిటో అప్పుడు అర్థమైంది. అదే నన్ను సినిమాలవైపు నడిపించింది.

ఎప్పుడూ సినిమా గోలే
మాది పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు. నాన్న భాస్కరరావు చెన్నైలోని ఐఎమ్‌సీసీ అనే కంపెనీలో జనరల్‌ మేనేజర్‌. మా ఇల్లు ఆంధ్ర, తమిళనాడు సరిహద్దుల్లోని  గుమ్మడిపూండిలో ఉండేది. ముందు నుంచీ చదువంటే ‘ఎందుకొచ్చిన గొడవ’ అన్నట్టే ఉండేది నాకు. లెక్కలూ, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌ అన్నీ నన్ను ఇబ్బందిపెట్టేవి… ఒక్క చరిత్ర తప్ప! ఇంగ్లిషు మాస్టారు షెర్లాక్‌ హోమ్స్‌ గురించి చెబుతుంటే నా ముందు సినిమానే కనిపించేది. అప్పుడే అనుకున్నా. నా జీవితానికి లెక్కలూ, సైన్స్‌ ఎందుకూ పనికిరావని. నా ఆసక్తి సృజనాత్మక సినిమా ప్రపంచంలోనే ఉంది అని. అయినా సరే… ఇంజినీరింగ్‌ దాకా ఎలాగో నెట్టుకొచ్చాను. కాలేజీలో కూడా నా దృష్టంతా సాహిత్యం, అంతకన్నా సినిమాలపైనే ఎక్కువ ఉండేది. సినిమాలపైన ఈ మోజు పదో తరగతప్పుడే మొదలైంది. కొత్త తెలుగు సినిమా విడుదల అవుతోందంటే.. తిరుపతి వెళ్లేవాళ్లం. మా ఊరి నుంచి తిరుపతికి నాలుగు గంటల ప్రయాణం. బైకు మీద కబుర్లు చెప్పుకుంటూ వెళ్తే అలసటే తెలిసేది కాదు. ఆరోజంతా తిరుపతిలో ఉండి నాలుగు సినిమాలు చూశాకగానీ తిరిగొచ్చేవాళ్లం కాదు. అందరూ సినిమా చూసి కాసేపు మాట్లాడుకునివదిలేస్తే నేను మాత్రం వారం వరకూ ఆ ఆలోచనల్లోనే ఉండేవాణ్ణి. ఓ సినిమాని అనౌన్స్‌ చేయగానే ఆ కథ ఎలా ఉంటే బాగుంటుందంటూ నాకు నేనే ఏవేవో ఊహించి స్నేహితులకి చెప్పేవాణ్ని. కొన్నిసార్లు తెరపై సినిమా కంటే నా ఊహలే బాగుండేవనిపించేది. ఏం మాట్లాడినా, ఎవరితో మాట్లాడినా టాపిక్‌ని సినిమాలవైపు తీసుకెళ్లేవాణ్ణి. ఇదంతా చూసి.. ‘నువ్వు సినిమాల్లోకి వెళ్తే బాగుంటుంది’ అని స్నేహితులు పొగుడుతుండేేవారు. ఆ నేపథ్యంలోనే ఓసారి హైదరాబాద్‌ వెళ్లడం, ‘ఆర్య’ చూడటం, నేనూ సినిమాల్లోకి రావాలని నిశ్చయించుకోవడం జరిగిపోయాయి. మరి అక్కడికి ఎలా వెళ్లాలి..? పాటల రచయిత కృష్ణ చైతన్య కాలేజీలో నా జూనియర్‌. అప్పట్లోనే పాటలు రాసి స్టేజీ ఎక్కి పాడేవాడు. అతణ్ని కాంటాక్ట్‌ అయితే ‘హైదరాబాద్‌ వచ్చేయ్‌. సహాయ దర్శకుడిగా చేర్పిస్తా’ అన్నాడు. సినిమాల్లోకి వెళతానంటే ఇంట్లో ఒప్పుకోరని భయం భయంగానే అడిగినా… వాళ్లు ఒప్పుకుని నన్ను ఆశ్చర్యపరిచారు. అందులో మా అన్నయ్య రఘురామ్‌దే కీలకపాత్ర!

ఎన్నెన్ని తిప్పలో..!
నన్ను హైదరాబాద్‌కి రప్పించిన కృష్ణచైతన్య అప్పట్లో శశాంక్‌ హీరోగా చేస్తోన్న ఓ సినిమాకి పాటలు రాస్తుండేవాడు. నేనూ ఆ టీమ్‌లోనే సహాయకుడిగా చేరిపోయాను. చేరానే కానీ ఓ సినిమా కోసం సీన్‌లూ, డైలాగులూ ఎలా రాయాలో కూడా నాకు తెలియలేదు. ఏదో నవలలూ, కథలూ రాస్తున్నట్టు పేరాలకి పేరాలు రాసేవాణ్ణి. నేను చెన్నైలోనే చదువుకోవడం వల్ల తెలుగు రాసే  అలవాటు పెద్దగా లేదు  కాబట్టి వాక్య నిర్మాణాలే తప్పులూ తడకలుగా ఉండేవి. తెల్లకాగితం మీద వాక్యాలన్నీ వంకరటింకర్లుగా పోయేవి. ‘నువ్వేం రైటర్‌వయ్యా…!’ అంటూ అందరూ నవ్వేవాళ్లు. నవ్వితే సమస్య లేదుకానీ చాలామంది విసుక్కునేవాళ్లూ, కోపగించుకునేవాళ్లు కూడా. కానీ ఇదంతా ఛాలెంజ్‌గానే తీసుకున్నాను. నన్ను నేను సరిదిద్దుకోవడం, మళ్ళీ మళ్ళీ రాయడం, మంచి స్క్రిప్టుల్ని చూసి అధ్యయనం చేయడం ప్రారంభించాను. నేను పడుతున్న ఈ పాట్లన్నీ ఇద్దరు దగ్గరగా గమనిస్తూ ఉండేవారు. ఒకడు నిఖిల్‌… శశాంక్‌ హీరోగా ఉన్న సినిమాలో అతను చిన్న వేషం వేస్తుండేవాడు. మరొకడు… సుధీర్‌వర్మ. తనూ నాలాగే సహాయ దర్శకుడు.
ఆ ఇద్దరూ నాకు దగ్గరి స్నేహితులయ్యారు. కాకపోతే, మేం కలిసి పనిచేసిన సినిమా మధ్యలోనే ఆగిపోయింది. అయినా ఎవ్వరం నిరుత్సాహ పడకుండా ఎవరి ప్రయత్నాల్లో వాళ్లం ఉండిపోయాం. ఈలోపు నిఖిల్‌ ‘హ్యాపీడేస్‌’ అడిషన్‌కి వెళ్లి… ఛాన్స్‌ కొట్టేశాడు. అప్పట్లో చేతినిండా పనిలేకపోయినా ఆర్థికంగా పెద్దగా ఇబ్బంది పడలేదంటే-అది నిఖిల్‌ వల్లే. ఎంతో అండగా ఉండేవాడు. ఆ తర్వాత నేను లక్ష్మీకాంత్‌ చెన్నా, పరశురామ్‌ల దగ్గర సహాయకుడిగా చేరిపోయా.

ఆమె నాకు అమ్మానాన్నలంత!
దర్శకుడు పరశురామ్‌ది ప్రేమ వివాహం. అతని తొలిచిత్రం ‘యువత’ తీయడానికి ముందు ఓ చిన్న ఇంట్లో కాపురం ఉంటుండేవాడు. నేను వారాంతాల్లో వాళ్లింటికి వెళ్తుండేవాణ్ణి. ఓసారి పరశురామ్‌ భార్య చెల్లెలితోపాటూ అక్కడికొచ్చింది… సుజాత. తనని చూసిన నిమిషంలోనే ప్రేమలో పడిపోయాను. తనని ఇంప్రెస్‌ చేయాలని నాకున్న జ్ఞానాన్నంతా ఒలకబోశాను. తనేమో మేధావి… పీహెచ్‌డీ స్కాలర్‌. ఎంబీఏ కూడా ముగించిన అమ్మాయి కాబట్టి గుంభనగా ఉండిపోయింది. నా చేష్టల్లో అమాయకత్వమో నిజమైన ప్రేమో ఏదో కనిపించి ఉండాలి… నాతో స్నేహం చేసింది. అది ప్రేమగా మారింది. ఇద్దరి కుటుంబాల్లోనూ పెద్దగా వ్యతిరేకత లేకున్నా సరే… పెళ్లి మా సొంత ఖర్చుతోనే జరగాలన్నది సుజాత కోరిక. ఆ మేరకే పరశురామ్‌ ఇంట్లో చాలా సింపుల్‌గా జరిగింది మా పెళ్లి. కాపురం పెట్టాక నన్ను మా ఆవిడే పోషించింది! తను ఓ ప్రైవేటు కాలేజీలో లెక్చరర్‌గా చేస్తుండేది. స్క్రిప్టు రాయడానికి ల్యాప్‌టాప్‌ లేకపోతే నేను అడిగిన వెంటనే తెచ్చిచ్చింది..! ఇందుకోసం ఏడాదిపాటు ఈఎంఐలు కడుతూ… ఆ మేరకు తన సొంత ఖర్చుల్ని తగ్గించుకుంది. తను పనిచేసే కాలేజీ హైదరాబాద్‌ శివార్లలో ఉండేది. నేను ఓ రెండు కిలోమీటర్లు స్కూటర్‌ మీద దింపితే అక్కడి నుంచి రెండు బస్సులు మారాల్సి వచ్చేది తను. గర్భం దాల్చాక కూడా అంతే… కిక్కిరిసిన బస్సుల్లోనే ప్రయాణం. అంతెందుకు, కాన్పుకి రెండురోజులు ముందుకూడా ఉద్యోగానికి వెళ్లొచ్చింది! బాబు పుట్టిన రోజు ఆసుపత్రిలో ‘ఎందుకింత కష్టపడ్డావ్‌…?’ అని అడిగితే ‘నువ్వు దర్శకుడిగా ఎంత పెద్దవాడివైనా కుటుంబం పట్ల నీకు బాధ్యత ఉండాలనే’ అని చెప్పింది. ఆ మాటలకి కన్నీళ్లు ఆగలేదు నాకు! అప్పటి నుంచి ఇప్పటిదాకా తను నిర్దేశించిన ఏ బాధ్యత నుంచీ తప్పుకున్నది లేదు నేను. ఇక ఇంట్లో ముగ్గురం అయిపోయాం కాబట్టి నా భార్యకి చేదోడువాదోడుగా ఉండాలని సినిమా పనులు పక్కనపెట్టి సీరియళ్లూ, రియాల్టీ షోలకి రాయడం మొదలుపెట్టాను. రోజుకి రెండువేల రూపాయలు వస్తుండేవి. మంచి ఆదాయమే అయినా సరే సుజాత ఒప్పుకోలేదు.
‘నీ లక్ష్యం ఇది కాదుకదా! నువ్వు సీరియళ్లలో ఇరుక్కోవద్దు. సక్సెస్‌ వచ్చేదాకా సినిమాల కోసమే ప్రయత్నించు!’ అని గట్టిగా చెప్పింది. ఓ రకంగా సుజాత లేకుంటే నేను సినిమాల్లో స్థిరపడటం అసాధ్యం. అందుకే తను నాకు మా అమ్మానాన్నలంత అని చెబుతుంటాను!

అంత అభిమానం…!
కార్తికేయ సినిమాని నేను నిఖిల్‌ కోసమే రాశాను. ఆ కథ విని ఎందరో నిర్మాతలు ముందుకొచ్చినట్టే వచ్చి వెనక్కి తగ్గారు. చివరి నిర్మాత ఒప్పుకున్నాక కూడా ఎన్నో తటపటాయింపులతో సినిమా పట్టాలకెక్కలేదు. ఈలోపల సుధీర్‌ వర్మ నిఖిల్‌ని హీరోగా పెట్టి తీసిన ‘స్వామి రారా’ పెద్ద హిట్టయింది. ఆ హిట్టుతో నిఖిల్‌పైన ఇండస్ట్రీ అంచనాలు పెరగడమే కాదు… నాకున్న అడ్డంకులూ తొలగి సినిమా పట్టాలకెక్కింది. నిఖిల్‌, నేనూ చాలా కసిగా పనిచేశాం. మా ట్రైలర్‌ని ప్రశంసిస్తూ రాజమౌళిగారు ట్వీట్‌చేశారు. ఓ విషయం చెప్పాలి. ‘మగధీర’ వచ్చిన కొత్తల్లో అనుకుంటాను… రాజమౌళిగారూ, రమా రాజమౌళిగారూ పాల్గొన్న ఓ కార్యక్రమానికి నేనూ, మా ఆవిడా వెళ్లాం. ఆ కార్యక్రమం ముగిసి అందరూ వెళ్లాక ఆ ఇద్దరూ కూర్చున్న కుర్చీల్లో మేం కూర్చుని ఆనందించాం! రాజమౌళిగారంటే నాకు అంత అభిమానం. అలాంటిది… ఆయనే మెచ్చుకుంటూ ట్వీట్‌ చేస్తే అంతకన్నా ఆనందం ఉంటుందా! అంతేకాదు, కార్తికేయ విడుదలకు ముందురోజు రాత్రి నాకు ఆల్‌ ది బెస్ట్‌ చెబుతూ రాజమౌళి తన అసిస్టెంట్‌చేత పెద్ద లేఖ రాసి దాన్ని ఫ్రేమ్‌కట్టి మరీ పంపించారు. ఓ అభిమానికి ఇంతకంటే పెద్ద కానుక ఏం ఉంటుంది?

చైతూ నేనూ!
కార్తికేయ తర్వాత నాగార్జున గారే పిలిచి ‘చైతూ కోసం ఓ కథ సిద్ధం చెయ్‌!’ అన్నారు. నేను ఆ పనుల్లో ఉండగానే మలయాళ సినిమా ‘ప్రేమమ్‌’ రీమేక్‌ చేసే ఆఫర్‌ వచ్చింది. నిజానికి రీమేక్‌ చేయడానికి ఏమాత్రం అవకాశం లేని కథ అది. ఆ విషయమే చెప్పి నాదైన సొంత కథ సిద్ధం చేసే పనిలో పడిపోయాను… నిర్మాతలు ఇంకె వర్నైనా దర్శకుడిగా ఎంచుకుంటారనే ఆలో చనతో. కానీ చైతూ ఫోన్‌ చేసి ‘ఈ సినిమా నువ్వు చేస్తే చేస్తా.. లేదంటే మానేస్తా’ అన్నాడు. దాంతో ‘ప్రేమమ్‌ని తెలుగులో తీస్తే అందులో ఏయే అంశాలుంటే బాగుంటుంది?’ అని ఆలోచించడం మొదలు పెట్టాను. అలా చైతూ మేనమామగా వెంకటేష్‌ని చూపిస్తే తిరుగుండదు అనిపించింది. అలాంటి పది పాయింట్లు రాసుకొని నిర్మాత దగ్గరకు వెళితే ‘ఓకే’ అన్నారు.

అలా ప్రేమమ్‌ మొదలుపెట్టాం. అది మంచి విజయం సాధించింది. ఆ తర్వాత మాటల మధ్యలో ఓసారి చైతూతో ‘సవ్యసాచి’ కథని చెబితే ‘నా కోసం ఇదొక్కటి చెయ్‌’ అన్నాడు. అలా ‘సవ్యసాచి’ చేశాం. అది చాలా విభిన్నమైన కాన్సెప్టే కానీ అసలు కథకి జోడించిన కమర్షియల్‌ హంగులు సరిగ్గా కుదరక ఆశించినంత ఫలితం రాలేదు. దాంతో నేను చాలా నిరుత్సాహానికి గురయ్యాను. దానికి చైతూ ‘ఇదంతా మామూలే. నెక్స్ట్‌ సినిమా కోసం ప్రయత్నించు’ అంటూ వెన్నుతట్టినా తేరుకోవడానికి కాస్త సమయం పట్టింది. అలా తేరుకున్నాకే ‘కార్తికేయ-2’ కథ రాసి నిర్మాతలకి వినిపించాను. బడ్జెట్‌ పరంగా నిఖిల్‌కూ, నాకూ ఉన్న మార్కెట్‌తో పోలిస్తే చాలా భారీ బడ్జెట్‌ సినిమా అది. అయినా సరే నిర్మాతలు దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. శ్రీకృష్ణుడి జీవితం ఆధారంగా అల్లిన సోషియో-ఫాంటసీ థ్రిల్లర్‌ ఇది. దాన్ని వివరిస్తూనే కాన్సెప్ట్‌ వీడియోని విడుదలచేశాం! దానికి అద్భుతమైన స్పందనొచ్చింది. ఆ వీడియో విడుదలయ్యాక చైతూ ఓ పెద్ద మెసేజ్‌ పెట్టాడు… అందులో చివరిగా ‘ఈ సినిమాతో నువ్వు బ్లాక్‌ బస్టర్‌ హిట్టు కొట్టాలి. అలాంటి హిట్టు నీకు వస్తే ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ సంతోషించేది నేనే!’ అని ఉంది. ఓ స్నేహితుడిగా నాకు అంతకన్నా ఏం కావాలి?!

 

Director Karankumar (Palasa)

నాన్న… నేను చచ్చిపోయాననుకున్నాడు!

కొందరు సినిమావాళ్ల జీవితంలో వాళ్లు తీసే చిత్రంలోకన్నా ఎక్కువ నాటకీయతా సాహసాలూ కనిపిస్తుంటాయి. కరుణకుమార్‌ జీవన ప్రయాణం అలాంటిదే. ‘పలాస 1978’తో తెలుగు చిత్రసీమకి ఓ విలక్షణ చిత్రాన్నందించి ప్రశంసలు అందుకున్న కరుణకుమార్‌… పదిహేనేళ్ల వయసులో హోటల్లో ప్లేట్లు కడగడంతో జీవితాన్ని మొదలుపెట్టాడు. అంచెలంచెలుగా ఎదిగి ఆంత్రప్రెన్యూర్‌గా మారాడు. అదే సాహసంతోనే సినిమాలవైపూ వచ్చాడు. ఆ ప్రయాణం ఆయన మాటల్లోనే…

అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండే ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లోని ఓ కుగ్రామం మాది. పేరు కంట్రగడ. శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుందా పల్లెటూరు. అప్పట్లో మానాన్న సాగుచేస్తూ ఉన్న ఆరు సెంట్ల భూమే మాకున్న ఏకైక ఆస్తి. కానీ ఊరిలో ఒక్కసారిగా నక్సలైట్ల ప్రభావం హెచ్చింది. అన్నలు వందల ఎకరాలున్న కామందుల భూములతోపాటూ మా ఆరుసెంట్లనీ అక్కడి గిరిజనులకి పంచేశారు! అలా మాకున్న ఒకే ఒక జీవనాధారం పోయింది. కడుపు నిండటమే కష్టమైంది. అప్పుడు నేను పదో తరగతి పాసై ఉన్నాను. పై చదువులకి వెళ్లే స్థోమత లేకున్నా సరే నాన్న నన్ను చదివించాలనుకున్నాడు. శ్రీకాకుళం పట్టణంలోని గవర్నమెంట్‌ జూనియర్‌ కాలేజీలో చేర్చాడు. అక్కడ ఆయనకు తెలిసిన ఓ ప్రభుత్వాధికారి ఇంట్లో ఉంటూ చదువుకునే ఏర్పాటుచేశాడు. కాలేజీకి వెళుతున్నానన్న మాటేకానీ ఇంటికొచ్చి కనీసం పుస్తకంపట్టే అవకాశం కూడా ఇచ్చేవారు కాదు ఆ ఇంట్లోవాళ్లు. ఉదయం నుంచి సాయంత్రం దాకా క్షణం తీరికలేకుండా ఏదో ఒక పని చెబుతూ ఉండేవారు. అప్పటికే సరైన ఆహారం లేక అర్భకంగా ఉండే నన్ను ఆ పనులు మరింతగాకృశించేలా చేశాయి. ఇదే కాయకష్టం నేను బయట చేస్తే కనీసం నాలుగు డబ్బులైనా చేతికొస్తాయనే ఆలోచన వచ్చింది. దాంతో ఓ రాత్రి ఆ ఇంటి నుంచి బయటపడ్డాను. బస్సెక్కి ఆముదాలవలస రైల్వే స్టేషన్‌కి చేరుకున్నాను. ఓ రైలొస్తే అది ఎక్కడికి వెళుతుందో కూడా చూసుకోకుండా ఎక్కేశాను. టీటీఈ కంటపడకుండా రాత్రంతా లెట్రిన్‌లో దాక్కున్నాను. ఎప్పుడు నిద్రపోయానో తెలియదు… ఆ తర్వాతి రోజు నేను కళ్లు తెరిచేసరికి ట్రెయిన్‌ చెన్నై సెంట్రల్‌ స్టేషన్‌లో ఉంది!

ప్లాట్‌ఫామే పడక…
తెలియని ఊరు… అర్థంకాని భాష. ఎక్కడికెళ్లాలో తెలియక స్టేషన్‌లోనే ఉండిపోయాను. ఆకలైతే అక్కడున్న కొళాయి నీళ్లతోనే కడుపు నింపుకున్నాను. మరీ తట్టుకోలేకపోతే ప్రయాణికుల దగ్గరకెళ్లి అడిగితే తాము తింటున్నదాంట్లో కొంత పెట్టేవారు. అమ్మావాళ్లు గుర్తుకొచ్చి ఏడుపొచ్చినా డబ్బు సంపాదించకుండా వాళ్ల దగ్గరకెళ్లకూడదనుకున్నాను. నా చావో బతుకో ఇక్కడే తేలిపోవాలనుకున్నాను. అలా ఐదు రోజులూ స్టేషన్‌లోనే గడిపాను. ఓసారి బాగా ఆకలిగా అనిపించి ఓ ప్రయాణికుడి దగ్గరకెళితే ఆయన చేతిలో తెలుగు పత్రిక కనిపించింది. తెలుగువాళ్లనగానే ప్రాణం లేచి వచ్చి ‘ఆకలవుతోంది… సార్‌!’ అన్నాను. వెంటనే ఆయన స్టేషన్‌ బయట ఉన్న హోటల్‌కి తీసుకెళ్లి కడుపునిండా భోజనం పెట్టించాడు. నా కథంతా విన్నారు. ‘నువ్వు స్టేషన్‌లోనే ఉండిపోతే ఆకలితో చచ్చిపోతావ్‌. ఇక్కడ ఏదైనా హోటల్‌లో పనిచెయ్‌… కనీసం మూడుపూటలా అన్నమైనా పెడతారు..!’ అని చెప్పి వెళ్లిపోయాడు. ఆయన చెప్పినట్టు స్టేషన్‌కి దగ్గర్లో బ్లూ స్టార్‌ అనే హోటల్‌కి వెళ్లి పని అడిగాను. కొత్తవాళ్లకి ఇవ్వలేమని చెప్పేశారు. అప్పుడు ఆ హోటల్‌ పక్కన రిక్షాపైన అన్నం వండి అమ్ముతూ ఉన్న ఓ కుటుంబం కనిపించింది. నేను వాళ్లకి సాయంగా ప్లేట్లు కడగటం మొదలుపెట్టాను. వాళ్లు నాకు మూడుపూటలా భోజనం పెట్టేవారు. అదే నా తొలి ఉద్యోగం! వాళ్ల గుడిసె దగ్గరే ప్లాట్‌ఫామ్‌పైన పడుకునేవాణ్ణి నేను. అక్కడ పరిచయమైన స్నేహితుడొకడు చెన్నైలోని ఉడుపి హోటల్‌లో పనికి కుదిర్చాడు. ఆ హోటల్‌ వడపళని అనే ప్రాంతంలో ఉంటుంది. విజయవాహిని సినిమా స్టూడియో ఉండేది కూడా అక్కడే! ఆ చుట్టుపక్కల తెలుగువాళ్లు ఎక్కువ కాబట్టి పాత తెలుగు పుస్తకాలు బాగా దొరికేవి. అప్పటి నుంచి అవే నాకు నేస్తాలయ్యాయి. అప్పటికి నేను ఇల్లు వదిలి ఆరునెలలు. అప్పుడప్పుడూ అమ్మావాళ్లు గుర్తొచ్చేవారు. ఒక్కగానొక్క కొడుకు కానరాక వాళ్లెంత అల్లాడిపోతారో అనే ఆలోచనొస్తే బాగా ఏడుపొచ్చేది. వెంటనే నేను ఫలానా చోట ఉన్నానంటూ ఓ జాబు రాయటం మొదలుపెట్టేవాణ్ణి. వెంటనే ‘మీవాడు చెన్నైలో కప్పులు కడుగుతున్నాడట…’ అని నలుగురూ అంటే వాళ్లకెంత అవమానం!’ అనుకుని రాసిన ఉత్తరాలు చించేసేవాణ్ణి. ఇలా అయినవాళ్లతో సంబంధాలు తెంచుకోవడం వల్ల బాగా ఒంటరితనంగా అనిపించేది. ఆ ఒంటరి తనాన్నంతటినీ పుస్తకాలే పొగొట్టాయి. అప్పట్లో యండమూరి నవలలు నాకెంతో స్ఫూర్తినిచ్చేవి. వాటిని చదవడం మొదలు పెట్టినప్పటి నుంచి ఆలోచనలన్నింటినీ డైరీలా రాసుకోవడం మొదలుపెట్టాను. నా రచనలకి బీజం అక్కడే పడింది.

అదే పెద్ద మలుపు…
ఉడుపి హోటల్లో చేరానని చెప్పాను కదా… అక్కడ హోటల్‌ బయట ఊడవడంతో మొదలుపెట్టి ప్లేట్లు కడగడం, టేబుళ్లు తుడవటం, తర్వాత అక్కడి ప్రధాన చెఫ్‌కి సహాయకుడిగా మారడం… ఇలా చాలా అంచెలు దాటాక నన్ను బిల్లింగ్‌ టేబుల్‌ దగ్గర కూర్చోబెట్టారు… హోటల్‌లో ఉద్యోగాల పరంగా అది ఓ పెద్ద ప్రమోషన్‌లాంటిది! కాలేజీకి వెళ్లకున్నా సాహిత్యాన్ని చదువుతుండటం వల్ల నా మాట తీరూ, మన్ననా చూసి మా హోటల్‌కి తరచుగా వచ్చే ఒకతను ‘సైఫన్‌’ అనే రొయ్యల సాగు సంస్థలో నన్ను ఆఫీస్‌ బాయ్‌గా చేర్చాడు. ఆఫీస్‌ వాతావరణం నన్ను చాలా మార్చింది. ఖాళీ సమయంలో సాహిత్యంతోపాటూ స్పోకెన్‌ ఇంగ్లిషు, టైపింగ్‌, కంప్యూటర్‌ నైపుణ్యాలు నేర్చుకోవడం మొదలుపెట్టాను. ఏడాది తిరక్కుండానే కంప్యూటర్‌ ఆపరేటర్‌ని అయ్యాను. ‘టాలీ’ సాఫ్ట్‌వేర్‌ అప్పుడప్పుడే మార్కెట్‌లోకి వస్తుంటే దానిపైన పట్టు సాధించడంతో ఆ సంస్థకి నన్ను అకౌంట్‌ ఎగ్జిక్యూటివ్‌గా చేశారు. ఒక్కసారిగా నా జీవితం మారిపోయింది. మూడేళ్లు అక్కడ పనిచేశాక… అమ్మానాన్నల దగ్గరకెళ్లడానికి ఇదే సరైన సమయం అనుకున్నాను. అలా ఊరొదిలి వచ్చిన పదేళ్ల తర్వాత ఇంటి బాట పట్టాను.

‘మాఅబ్బాయివి కాదేమో’
ఊరి పొలిమేరలోనే కనిపించిన నాన్న ఎదురుగా నిల్చుంటే ఆయన నన్ను గుర్తుపట్టలేదు. ఎంత చెప్పినా నేను నేనేనని నమ్మలేదు. నేను ఊరొదిలి వచ్చేటప్పుడు విజయనగరం ప్రాంతంలో తోటపల్లి ప్రాజెక్ట్‌ నిర్మాణం జరుగుతుండేది. ఆ నిర్మాణానికి మగపిల్లల్ని బలిస్తున్నారంటూ వదంతులు రేగుతుండేవి అప్పట్లో. నేను కూడా అలా బలైపోయానని అనుకున్నాడట. అంటే…వాళ్ల దృష్టిలో నేను చచ్చిపోయానన్నమాట! అన్నేళ్లు నేను వాళ్లకి సమాచారం ఇవ్వకుండా ఉన్నందుకు తొలిసారి పశ్చాత్తాపపడ్డాను. ఆయన్ని హత్తుకుని తన కొడుకుని నేనేనంటూ ఏడ్చాను. అమ్మతో నాకింత సమస్యరాలేదు. నాన్నతో వస్తున్న నన్ను చూడగానే తన కన్నపేగు కదిలినట్టుంది… భోరుమంటూ వచ్చి హత్తుకుంది. మూడునెలలపాటు అమ్మానాన్నల్ని విడిచి ఎక్కడికీ వెళ్లలేదు నేను. ఆ తర్వాత విశాఖలో ‘హాలిడేస్‌ వరల్డ్‌’ అనే పర్యటనల నిర్వహణ సంస్థలో చేరాను. కార్పొరేట్‌ సంస్థల నుంచి వీఐపీల దాకా వాళ్లక్కావాల్సిన దేశీ, విదేశీ పర్యటనల్ని నిర్వహించే సంస్థ అది. అందులో మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌గా చేరి ‘టూర్‌ మేనేజర్‌’గా ఎదిగాను. ఆ కంపెనీలో పనిచేస్తున్న నీలిమని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. మాది కులాంతర వివాహం. నా జీవితాన్ని ‘నీలిమకి ముందు, ఆ తర్వాత’ అని చెప్పొచ్చు. ఉద్యోగిగా ఉన్న నేను ఆంత్రప్రెన్యూర్‌గా మారానన్నా… రచనలవైపు సాగానన్నా… ఇప్పుడు సినిమా దర్శకుణ్ణయ్యానన్నా అంతా తన చలవే. ‘హాలిడేస్‌ వరల్డ్‌’ సంస్థలో ఉద్యోగిగా ఉంటున్న నేను దాని ఫ్రాంచైజీ తీసుకుని హైదరాబాద్‌లో ఆఫీసు తెరిచాను. కానీ తొలి ఆరేడునెలలు మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా తీవ్ర ఆటుపోట్లకి గురైతే ఆ బాధలన్నీ నా భార్యే పంటిబిగువున భరిస్తూ కుటుంబాన్ని ఒంటిచేత్తో నడిపించింది. మొదట్లో ఆటుపోట్లు వచ్చినా సంస్థ లాభాల బాట పట్టింది. ఇంతలో ‘పసిఫిక్‌ ట్రయల్స్‌’ అనే ఎమ్మెన్సీ సంస్థ నన్ను డిప్యుటీ జనరల్‌ మేనేజర్‌గా చేరమంది. సింగపూర్‌లో ఉద్యోగం. 2003లోనే ఆరు అంకెల జీతం. కానీ భార్యాపిల్లలకి దూరంగా ఉండటంలో అర్థంలేదు అనిపించి రాజీనామా చేసి మళ్లీ హైదరారబాద్‌ వచ్చాను. ‘నవదీప్‌ హాలిడేస్‌’ అనే పర్యటక సంస్థని స్థాపించాను. అనతికాలంలోనే బజాజ్‌ అలయెన్జ్‌ వంటి సంస్థల ఉద్యోగులూ మా వినియోగదారులుగా మారారు!

సినిమాలవైపు…
పదిహేనేళ్లప్పుడు సాహిత్యంతో ఏర్పడ్డ సాహచర్యాన్ని నేను వదులుకోలేదు. హైదరాబాద్‌ వచ్చాక మహ్మద్‌ ఖదీర్‌బాబు, కుప్పిలి పద్మ, మహీ బెజవాడ వంటి రచయితలు పరిచయమయ్యారు. వాళ్లు నిర్వహించే వర్క్‌షాపుల ద్వారా ‘చున్నీ’, ‘పుష్పలత నవ్వింది’, ‘498’, ‘జింగిల్‌ బెల్స్‌’… వంటి ఆరు కథలు రాశాను. అవి వివిధ సంపుటాలూ, పత్రికల్లో అచ్చయ్యాయి. వీటిలో ‘పుష్పలత నవ్వింది’ కథ ఐదు భాషల్లోకి అనువాదమైంది. అప్పుడే నేనూ రచనయితనేననే నమ్మకం వచ్చింది. అప్పట్లో హైదరాబాద్‌లో ‘చతురులు’ పేరుతో స్టాండప్‌ కామెడీ షోలు నిర్వహిస్తున్న వాళ్లతో కలిసి నేనే స్క్రిప్టు రాసి ప్రదర్శనలివ్వడం ప్రారంభించాను. వాటిని చూసిన దర్శకులు ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, ప్రదీప్‌ అద్వైత్‌ల ద్వారా ప్రశాంత్‌ వర్మ పరిచయమయ్యాడు. అలా ఆయన తీసిన ‘అ!’ సినిమాకి పనిచేశాను. ఆ సినిమాకి మంచి పేరొచ్చాక నాకు దర్శకుడిగానూ మారాలనిపించింది. 2016లో కేంద్ర స్వచ్ఛభారత మిషన్‌ షార్ట్‌ఫిల్మ్‌ల పోటీ పెడితే గంటలో స్క్రిప్టు తయారుచేసి ‘చెంబుకు మూడింది…’ అనే చిత్రం తీసి పంపాను. దానికి జాతీయస్థాయిలో రెండో బహుమతి వచ్చింది! ఆ తర్వాత గత వందేళ్లుగా తెలుగు సాహిత్యంలో వచ్చిన అమూల్యమైన కథల్ని తెరకెక్కించాలనిపించింది. అందుకు శ్రీకారంగా మహ్మద్‌ ఖదీర్‌బాబు రాసిన ఓ కథని ‘ప్రణతి’ అని షార్ట్‌ఫిల్మ్‌గా తీశాను. దాన్ని చూశాకే తమ్మారెడ్డి భరద్వాజ్‌ పిలిచి సినిమా కథలున్నాయా అని అడిగితే… ‘పలాస 1978’ సినిమా కథ ప్లాట్‌ చెప్పాను. నేను మా ఊర్లో చూసిన జానపద కళాకారుల జీవితమే దాని నేపథ్యం. భరద్వాజ్‌ ద్వారా ధ్యాన్‌ అట్లూరి సినిమా నిర్మించడానికి ముందుకొచ్చారు. నాకు బెంగాలీ, మలయాళం, తమిళ సినిమాల స్టైల్‌ ఇష్టం కాబట్టి… నా సినిమాలో స్మాల్‌ టౌన్‌ వాతావరణాన్ని చూపిస్తూ వాస్తవికతకి పెద్దపీట వేయాలనుకున్నాను. ఆన్‌లైన్‌లో డైరెక్షన్‌, ఎడిటింగ్‌ మెలకువలపైన శిక్షణ తీసుకుంటూనే ఈ సినిమా తీశాను! నా ఆలోచనల్ని తెరకెక్కించే సాంకేతిక నిపుణులూ దొరకడంతో పెద్దగా ఇబ్బంది పడలేదు నేను.


అల్లు అరవింద్‌ పిలుపు…

‘పలాస 1978’ సినిమా మార్చి మొదట¨వారంలో విడుదలైంది. సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో ప్రేక్షకులు థియేటర్‌లకి రావడం మొదలుపెట్టారు. చిత్రం లాభాలు తెస్తోందని అనుకుంటూ ఉండగానే  కరోనా లాక్‌డౌన్‌ మొదలైంది. దాంతో అమెజాన్‌ ప్రైమ్‌లో దాన్ని విడుదల చేశాం. ఈ సినిమాని చూసిన అల్లు అరవింద్‌ నన్ను పిలిచి చెక్‌ చేతిలోపెట్టి ‘గీతా ఆర్ట్స్‌ తర్వాతి సినిమా నువ్వే చేస్తున్నావ్‌!’ అని సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ఆ సంస్థ తరపున ఓ ప్రముఖ హీరోతో సినిమా చేయబోతున్నాం. కరోనా లాక్‌డౌన్‌ తర్వాత ప్రకటన వస్తుంది! సినిమా పనులతోపాటూ నా నవదీప్‌ హాలిడేస్‌ సంస్థనీ నడుపుతున్నాను. ఏ కొత్త పనైనా సరే అందుకు తగ్గట్టు నన్ను నేను మలచుకోవడం, ఏ పనిచేసినా చేస్తున్నంత సేపూ అదొక్కటే ధ్యాసగా ఉండటం నాకున్న బలాలు. హోటల్లో ప్లేట్లు కడగటంతో జీవితం మొదలుపెట్టిన నేను దర్శకుడిగా మారానంటే ఈ రెండు గుణాలే ప్రధాన కారణమని భావిస్తున్నాను!

Comedian Chandra

comedian chandra 1 comedian chandra 2

Artist Dubbing janaki

artist dabbing janaki 1 artist dabbing janaki 2

Artist Navabharat balaji

artist navabharat balaji 1 artist navabharat balaji 2

Lockdown Stories

no shooting 60 years teravalante eetheatre news 1a310784_12-crop--178978lock down lolli177b1ebd-426a-4e55-9aaf-b2e2e2f3969b 57358b26_02-crop--8a18403e419bd1_162965_1 32362c53-ba63-43f4-9570-8346fd67e8a84518aff7_08-crop--7cc814 4518aff7_08-crop--72ac8e55577910_08-crop--d11a03d04dd603_08-crop--ce539d59b715a6_08-crop--d1a1c6 heros remunaretion 76fd0763-115f-4c45-89eb-9e46ae91c4fc 62e6f2bf-01b9-4105-a6c5-86af5cebe3bf 93610b81-8b07-4113-a372-4dc70b6dd7e1 e2265325-2e02-495f-9788-1e854ac80d54 1341d873-5c3d-4b8f-9914-b2b644614cfa 1008ca06_08-crop--a3b3f6hollywood article pvr

 

 

b0302c47_08-crop--ab2d6c

 

4e8019aa-0594-4b22-87a3-495eafe88765 6f8ba5c0-3284-4db6-b088-3a7a7d171c3a 561fbd12-9307-4860-ae90-f8452bf14c4a 895e8896-358e-4329-beb7-1523c2a7217c 8449e2fb-122f-4020-9dcb-8a8fc398df0d 29987bf9-2576-4c25-b276-7328befec902 94019b7a-614b-4e64-a1a5-b00c862d153f c5ede48c_154411_1 c9187981-9eed-46f5-859d-27865767de5f cc822722-dd52-492c-8d5b-8de4e8ee9969 d5fe665c-d542-4aa1-906d-b1826b862d62 f3e021fd-db31-4a22-90bd-e03663a30da2 fbfbd72f_08-crop--c56b57 hero gopichand 271c9e42-5798-4c54-beca-eef7978d5544

Heroine Aliabhat

8922745f-f1fb-4eae-80e0-8d3e9a1cc44f

 

 

వారం రోజులు బెంచీలు తుడవమన్నారు! 

ఆలియాభట్‌… సినిమా రంగంలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న అందాల నాయిక. త్వరలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తో తెలుగులోనూ తెరంగేట్రం చేయబోతున్న ఈ బాలీవుడ్‌ భామ ఇష్టాయిష్టాలేంటంటే…


మరచిపోలేని జ్ఞాపకం

నేను జమ్నాబాయ్‌ నర్సీ స్కూల్లో చదువుకున్నా. ఏ క్లాస్‌లో ఉన్నప్పుడో గుర్తులేదు కానీ… చిన్నప్పుడు రోజూ స్కూలుకెళ్లి బాత్రూంలో నిద్రపోయేదాన్ని. ఓ రోజు టీచరు చూసి.. వారంరోజుల పాటు క్లాసులోని బెంచీలన్నింటినీ తుడవమని పనిష్మెంట్‌ ఇచ్చారు. ఆ సమయంలో అది చాలా ఇబ్బందికరంగా అనిపించింది కానీ… ఇప్పుడు తలచుకుంటే నవ్వొస్తుంది.


పెరుగు ఉండాల్సిందే

చేపలు, రాగి చిప్స్‌, ఫ్రెంచ్‌ఫ్రైస్‌, రసగుల్లా, పెరుగన్నం, పెసరపప్పు హల్వా… ఇలా చాలా పదార్థాలు ఇష్టంగా లాగించేస్తా. ఏవి ఉన్నా లేకపోయినా భోజనంలో మాత్రం పెరుగు కచ్చితంగా ఉండాల్సిందే. అది లేకపోతే భోజనం పూర్తయినట్లు అనిపించదు.


ఇష్టపడే పెంపుడు జంతువు

మొదటినుంచీ నాకు పిల్లులంటే ఇష్టం. నేను పెంచుకునే పిల్లి పేరు ఎడ్వర్డ్‌. ఆ ఇష్టంతోనే పెటా నిర్వహించే అవగాహనా కార్యక్రమాల్లో పాల్గొన్నా.


నిద్రంటే…

నిద్రపోవడమంటే చెప్పలేనంత ఇష్టం. అవకాశం వస్తే.. దాదాపు పన్నెండు నుంచి పద్నాలుగు గంటలపాటు హాయిగా నిద్రపోతా. అయితే నాకు చీకటంటే భయం. అందుకే రాత్రుళ్లు కూడా నా బెడ్‌రూంలో లైటు వెలుగుతుంటుంది.


అలవాటు

మొదటినుంచీ నాకు డైరీ రాయడం అలవాటు. ఎంత రాత్రయినా సరే.. అలసటగా అనిపిస్తున్నా.. డైరీ రాసుకున్నాకే నిద్రపోతా.


ఇష్టమైన నటీనటులు

హీరోయిన్లలో కరీనా, కరిష్మా కపూర్లంటే ఇష్టం. హీరోల్లో షారుఖ్‌ఖాన్‌, తెలుగులో అయితే ప్రభాస్‌. బాహుబలి సినిమాలో ప్రభాస్‌ నటన ఎంతో నచ్చింది. అతడితో నటించే అవకాశం కోసం ఎదురు చూస్తున్నా.


తీరిక దొరికితే

స్నేహితులతో కలిసి హాయిగా సినిమాలు చూస్తా. ఈ మధ్య అప్పుడప్పుడూ వంటింట్లోకి దూరి ప్రయోగాలూ చేస్తున్నా.


కార్లంటే

ప్రస్తుతం నా దగ్గర అయిదు కార్లున్నాయి. ఆడీలోనే క్యూ5, క్యూ7లతోపాటూ ఏ6 మోడళ్లు ఉన్నాయి. అలాగే రేంజ్‌రోవర్‌ వోగ్‌, బీఎండబ్ల్యూ 7 సిరీస్‌ని కొనుక్కున్నా. వీటిల్లో నాకు నచ్చిన దాంట్లో వెళ్తుంటా.


ఇష్టపడే ప్రాంతాలు

మొదటినుంచీ నాకు ప్రకృతికి దగ్గరగా ఉండటమే నచ్చుతుంది. అలాంటి ప్రాంతాలనే వెతుక్కుంటా. మనదగ్గర హిమాచల్‌ప్రదేశ్‌, విదేశాల్లో అయితే… లండన్‌లో గడిపేందుకు ఇష్టపడతా. లండన్‌లోని హైడీపార్కులో హాయిగా జాగింగ్‌ చేయడం ఓ మజా.


బాగా నచ్చిన సినిమా

దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే. ఎన్నిసార్లు చూశానో గుర్తులేదు.

 

Hero Vijay devarakonda

472e65b1_156913_1 812cbdad-038e-48d4-99c2-94ab0577766f 6cf29651-3868-4c37-9b36-e775b16bf29c 14513b3e-5317-4d9f-bc8d-aeed7009b2a0 37902c42_12-crop--c09e5c 43e92956-146a-486a-951f-ccc340ca7072

writer Veligonda Srinivas

writer veligonda srinivas 1 writer veligonda srinivas 2 writer veligonda srinivas 1 writer veligonda srinivas 2