నాయిక ‘అవికాగోరే’

heroine avika gore (2) heroine avika gore

నటి, దర్శకురాలు ‘శ్రీప్రియ’

director sripriya

మహిళా దర్శకురాలు ‘శశికిరణ్’

director sasikiran

హాస్యనటుడు ‘ప్రవీణ్’

 

 

 

అంతర్వేదిలోనే ఆనందం 
 

ప్ర‘విన్‌’

‘కొత్తబంగారులోకం’ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమయ్యాడు. ‘ప్రేమకథాచిత్రమ్‌’తో పాపులర్‌ అయ్యాడు. ప్రస్తుతం తెలుగు హీరోల నమ్మకమైన నేస్తమైన అతడికి.. ‘సినిమా’నే సమస్తం! ఆ నటుడి పేరు ‘ప్రవీణ్‌’. హాస్యనటుడిగా నవ్వులు పూయించే ప్రవీణ్‌తో మాట్లాడితే బాల్యం… ఊరు.. హైదరాబాద్‌… ఇలా అనేక విషయాలు చెప్పుకొచ్చాడు.
నేను నటించిన తొలిచిత్రం ‘కొత్తబంగారులోకం‘ (2008 అక్టోబర్‌9 వ తేదీ విడుదలైంది). ఆ చిత్రం సూపర్‌హిట్‌ కావటంతో అవకాశాలొచ్చాయి. వాస్తవానికి ఈ సినిమాలో అవకాశం హీరో సునీల్‌ ద్వారా వచ్చింది. ‘ఒక ఊరిలో’ చిత్రం సమయంలో సునీల్‌గారితో నాకు పరిచయమైంది. అప్పుడప్పుడూ గోదావరి జిల్లాలకి ఆయన షూటింగ్స్‌కి వచ్చినపుడు ముందే చెప్పేవారు. నేను వెళ్లి ఆయన్ని కలిసేవాణ్ణి. ఓ సారి ‘పరుగు’ షూటింగ్‌ మా ఊరి దగ్గరలో జరుగుతోంటే.. అక్కడికెళ్లాను. ‘అందరూ కొత్తవాళ్లతో ఓ సినిమా చేస్తున్నాం. మీ ఫ్రెండు నటిస్తాడా?’ అని నిర్మాత దిల్‌రాజు సునీల్‌గారిని అడిగారు. ఆయన నా వైపు చూస్తే నేను ‘సరే’నన్నా. (అప్పటికే హైదరాబాద్‌కి వచ్చి పార్ట్‌టైమ్‌ ఉద్యోగం చేసుకుంటూ సినిమా ట్రయల్స్‌ వేశా. ఎమ్‌.కామ్‌ చదివా. చివరికి అవకాశాలు రాలేదని తిరిగి మా ఊరెళ్లా). నా జీవితాన్ని ఒక గాడిలో పెట్టిన సునీల్‌ అన్నయ్య.. నా తోడబుట్టిన అన్నయ్య కన్నా ఎక్కువ.
‘ప్రేమకథాచిత్రమ్‌’ చిత్రం నా జీవితాన్ని మలుపు తిప్పింది. దాదాపు అందరి హీరోలతో కలిసి నటించా. ప్రస్తుతం.. శర్వానంద్‌, నరేష్‌ల పక్కన స్నేహితుడిగా నటిస్తున్నా. కమెడియన్‌ శ్రీనివాసరెడ్డి ‘భాగ్యనగరవీధులలో గమ్మత్తు.’ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. అందులో నేనూ ఓ మంచి పాత్ర చేశా.

అక్కడి ఆనందమే వేరు
తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్వేది మా ఊరు. అక్కడి శ్రీ లక్ష్మీనరసింహ దేవాలయం ప్రఖ్యాతిగాంచింది. మా అమ్మపేరు రత్నం, గృహిణి. నాకో తమ్ముడున్నాడు. చిన్నపుడే మా నాన్న పోయారు. ఆ తర్వాత కొన్నాళ్లు హైదరాబాద్‌లోని మా మామయ్య వాళ్లింట్లో ఉన్నా. నాకు ఆ వాతావరణం నచ్చలేదు. మళ్లీ ఊరెళ్లి డిగ్రీ వరకూ చదివా. ఎక్కడికెళ్లినా నా చుట్టూ బ్యాచ్‌ తయారవుతుంది. దాదాపు పరిచయమైన ప్రతి మనిషి నాకు దూరమైంది లేదు. అంతర్వేదిలో మా నానమ్మ, బంధువులుంటారు. మా నాన్నమ్మంటే నాకు ప్రాణం. అంత బాగా నన్ను పెంచింది. ఇపుడు తన ఆరోగ్యం బాలేకపోవటంతో పదిహేనురోజులకో లేదా నెలకోసారైనా మా నానమ్మ దగ్గరికెళ్తా. ఆమె బాగోగులు చూసుకుంటా. ఊరెళ్లినప్పుడు కచ్చితంగా స్నేహితుల్ని కలుస్తా. మా సొంతూరులోని ఆనందం మరెక్కడా నాకు దొరకదు.

ముసాబు వాన
గోదావరితో అనుబంధం, స్నేహితులతో ఆడిన ఆటలతో పాటు మరెన్నో జ్ఞాపకాలు నా బాల్యంలో ఉన్నాయి. నా చిన్నతనంలో వర్షం వారంపాటు ఆగకుండా పడుతూ ఉండేది. దాన్ని ‘ముసాబు’ అనేవారు. మెల్లగా వానపడుతుండేది.  బయటికి వెళ్లేవారు కాదెవ్వరూ. గొడ్ల చావిడిలో, మా వీధి అరుగుమీద కబుర్లు చెప్పుకొనేవారు. ఇళ్లల్లోనే ఆటలాడుకునేవాళ్లం. కరెంటు ఉండేదికాదు. రాత్రి ఆరుగంటలకే భోజనం చేసి నిద్రపోయేవాళ్లంతా. మా ఊళ్లల్లోకి నవంబరు నుంచి సంక్రాంతివరకూ జంగందొరలనే గిరిజనులు వచ్చేవారు. ప్రతి ఇంటి దగ్గర పులి వేషం కట్టేవారు. మా ఊరిలో ఇపుడా ‘ముసాబు’ వాన పడట్లేదు. ఇంటింటికి వచ్చి అలరించే ఆ జంగం దొరలు కానరాలేదు. మా ఊరిలో భూముల ధర పెరిగి ఎకరా మూడుకోట్లు అవుతూనే.. ఇక మా పల్లె.. ‘పల్లెదనం’ కోల్పోతుందేమోనని బాధపడ్డా.

పెంకుటిల్లును కాపాడుతున్నా
మా తాతయ్య కట్టించిన 110 సంవత్సరాల క్రితం పెంకుటిల్లును ఇప్పటికీ కాపాడుకుంటున్నా. రెండేళ్లకోసారి పెంకులు పోతే, వాటిని వేసేవాళ్లు దొరకటం లేదు. అదీ పల్లెల పరిస్థితి. ఇప్పటికీ గోదావరి జిల్లాలో నిల్చిన గొప్పదనం ఏంటంటే.. ఇంటికి వచ్చిన అతిథులకు రకరకాల చేపలు వండిపెడతారు. అతిథులు బాగా తిని బ్రేవ్‌ అంటే వాళ్లకు సంతోషం.

పుస్తకాలు చదువుతా
చందమామ, బాలమిత్రతో పాటు ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి దినపత్రికల్లో వచ్చే కథలు చదివేవాణ్ణి. మధుబాబు రాసిన ‘షాడో’ నవల, యండమూరి వ్యక్తిత్వవికాస పుస్తకాలు చదివా. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ‘అఆ’ చిత్రంలో చేసేప్పుడు ఆయన పుస్తకాలు చదవమనేవారు. ఇటీవలే దాశరథి రంగాచార్యులుగారు రాసిన ‘చిల్లర దేవుళ్లు’ చదివా. బాపుగారి కోతికొమ్మచ్చి, ఇంకోతికొమ్మచ్చి చదివి.. ప్రస్తుతం ముక్కోతికొమ్మచ్చి పుస్తకం చదువుతున్నా. ఇటీవల పెద్దవంశీగార్ని కలిసినపుడు కొడవటిగంటి కుటుంబరావుతో పాటు మరికొంత మంది రచయితల పుస్తకాలు చదవమని సలహాఇచ్చారు. ఫోన్‌, టీవీలు చూడటం తగ్గించి భవిష్యత్తులో మరిన్ని పుస్తకాలు చదవాలి.

చిన్నప్పుడు హైదరాబాద్‌లో ఉన్న రెండేళ్లలో నాకు తెలంగాణ యాస బాగా అబ్బింది. నాకెందుకో యాసలంటే ఇష్టం. కోస్తాతో పాటు తెలంగాణ, రాయలసీమ మాండలికాల్ని పరిశీలిస్తుంటా. 


నేను ఇండస్ట్రీకొచ్చి పదేళ్లయ్యింది. 120 చిత్రాల్లో నటించా. ‘అఆ’లోని పాలేరు పాత్ర.. రౌడీఫెలో, పటాస్‌ చిత్రాల్లోని నెగటివ్‌ టచ్‌ పాత్రలంటే నాకిష్టం. పూర్తి స్థాయి విలన్‌ పాత్రలో నటించి మెప్పించాలనే ఉంది. 


శ్రీనివాస్‌ రెడ్డి, ధనరాజ్‌, సప్తగిరి, నేను, రాజేష్‌, వేణు.. ఇలా పన్నెండుమందితో కలిసి ఓ వాట్సప్‌ గ్రూప్‌ క్రియేట్‌ చేశాం. ఈ గ్రూప్‌ పేరు ‘ఫ్లయింగ్‌ కలర్స్‌’. ప్రతినెల రెండో శనివారం సాయంత్రం ఎవరోకరి ఇంట్లో కలుస్తాం. ప్రతినెలా ఒకరు బాధ్యత తీసుకుంటారు.  అందరం కలిసి అనారోగ్యంగా ఉండే నటులకు, ఆర్టిస్టుల పెళ్లిళ్లకు సాయం చేస్తుంటాం.

cmedian praveen

 

దర్శకుడు ‘అవసరాల శ్రీనివాస్’

direc avasarala srinivas 1 direc avasarala srinivas 2 direc avasarala 1 direc avasarala 2

 

 

పనికిరావు అన్నవాళ్ల సంతకాలు తీసుకున్నా!

నటుడిగా ప్రేక్షకులతో అష్టాచెమ్మా అడించినా … దర్శకుడిగా ఊహల గుసగుసలకు రూపం ఇచ్చినా… అతనిదో ప్రత్యేక శైలి… నటుడిగానే కాకుండా రచన, దర్శకత్వంలోనూ తెలుగు సినిమాపై తనదైన ముద్ర వేయాలని తపిస్తున్న అవసరాల శ్రీనివాస్‌ కాలిఫోర్నియా వర్సిటీలో సినిమా రచనపై అక్షరాలు దిద్దాడు… హాయ్‌ అంటూ పలకరిస్తే సినిమా, దర్శకత్వం, పాత్రలు, స్వభావాలు… ఇలా పలు విషయాలపై తన మనోభావాలు పంచుకున్నాడు.

* ఇంజినీరింగ్‌ కోసం అమెరికా వెళ్లిన మీరు.. సినిమాల్లోకి ఎలా వెళ్లారు?
నాన్న బ్యాంకర్‌. అసలు ఊరు కాకినాడ అయినా పెరిగిందంతా హైదరాబాద్‌లోనే. నాకు సినిమాలపై ఆసక్తి. కానీ ఆ విషయం మా అమ్మకు కూడా తెలియదు. మాస్టర్స్‌ కోసం అమెరికా వెళ్లాక అన్నపూర్ణ స్టూడియో నంబర్‌ సంపాదించి విశ్వనాథ్‌గారికి, కృష్ణవంశీగారికి ల్యాండ్‌లైన్లకి ఫోన్‌ చేసి నాకు సినిమాలంటే ఆసక్తి అని చెప్పేవాడిని. అప్పుడే నాకు అమెరికాలో స్థిరపడ్డ బాలరాజశేఖరుని గారితో పరిచయం అయ్యింది. మొదటిసారి ఆయన దగ్గరే అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశాను. ప్రొడక్షన్‌ పనులన్నీ దగ్గరుండి చూసుకునేవాడిని. ఓ పక్కన చదువుకుంటూనే న్యూయార్క్‌ నుంచి న్యూజెర్సీ వెళ్లి యూనివర్సిటీలో సినిమా కోర్సు చేశాను. ఆ సమయంలోనే బ్లైండ్‌ యాంబిషన్‌ సినిమాకి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశాను.

* సినిమా రంగానికి ఏమవ్వాలనుకుని వచ్చారు? రచయిత, డైరెక్టర్‌… నటన… అసలు వీటిలో ఏది మీకిష్టం?
నాకు దర్శకత్వం అంటే మొదటి నుంచీ ఇష్టం. కాలిఫోర్నియా యూనివర్సిటీలో కోర్సు చేస్తున్నప్పుడు అష్టాచెమ్మా సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఆ సినిమా చేస్తున్న సమయంలో స్వాతి, నాని, నేను… అందరం ఓ పిచ్చితో పనిచేసేవాళ్లం. ఉదయం ఆరున్నరకే అందరూ షూటింగ్‌ స్పాట్‌కి వచ్చేవాళ్లం.  24 గంటలూ సినిమా గురించిన ధ్యాసే.

* ఆ సినిమాలో మీ నటనకు చాలా మార్కులు పడ్డాయి…?
అవునండీ… ఆ సినిమాలో నా పాత్ర ఉత్తమ సహాయ నటుడు విభాగంలో ఫిల్మ్‌ఫేర్‌కు నామినేట్‌ అయింది. అవార్డు వస్తుందని అనుకున్నా కానీ… అదే సంవత్సరం గమ్యం సినిమాలో అల్లరి నరేష్‌కి వచ్చింది. అది 100 శాతం న్యాయం కూడా.

* ఈ మధ్య బయోపిక్స్‌లో డి.వి నరసరాజులా, ఎల్‌వీ ప్రసాద్‌గారిలా గొప్ప వ్యక్తుల పాత్రలు చేసి మెప్పించారు కదా? వాళ్ల ప్రభావం ఏదైనా మీపై ఉందా?
ఈ రెండు పాత్రల్లో ఒకటి యాదృచ్ఛికంగా చేసింది. మరొకటి… ముందు నుంచీ ఆ పాత్ర గురించి తెలుసుకుని చాలా ఇష్టంగా చేసింది. డీవీ నరసరాజుగారి పాత్ర మొదటిది. ఇక ఎల్‌వీ ప్రసాద్‌గారి పాత్ర కోసం నేను ఎక్కువే శ్రమపడ్డాను. ఆయన వీడియోలు చూసి, హావభావాలపై బాగా దృష్టి పెట్టా. ఆయన గొంతు సన్నగా ఉంటుంది. మాటల్లో కొంటెదనం ఉంటుంది. అవన్నీ పరిశీలించి.. గమనించి ఆ పాత్రలో లీనమై చేశాను. దాంతో ఆ పాత్ర బాగా కుదిరింది. చాలామంది నీ పాత్ర బాగుందంటూ ప్రశంసలూ కురిపించారు.

* మిమ్మల్ని అందరూ ఆధునికతరం జంధ్యాల అంటారు. మీకెలా అనిపిస్తుంది. తెలుగు మీద అంత పట్టెలా సాధించారు?
మీరంతా అనుకున్నట్టు నాకు తెలుగు మరీ అంతబాగా రాదు. అప్పుడప్పుడు కొన్ని తప్పులు కూడా వస్తుంటాయి. మీ సినిమాలో కూడా ఇలా అక్షర దోషాలా అనో, ఉచ్చారణ దోషాలా అనో అంటే వెంటనే సరిదిద్దుకుంటూ ఉంటాను. ఇక జంధ్యాల గారితో పోలిక అంటారా… అంతటి వ్యక్తితో పోల్చడం సంతోషించదగ్గ విషయమే అయినా పోలిక అనే దాన్ని నేను స్వాగతించను.

* మీ స్టైల్‌కి తగిన పాత్రలు నేటి సినిమాల్లో దొరుకుతున్నాయా?
ఈ సంవత్సరం నుంచి ఆ దిశగా అడుగులు వేయాలని ఉంది. గతంలో పెద్దగా దృష్టిపెట్టలేదు. వచ్చినదాంట్లో నచ్చిన దాన్ని చెయ్యడం తప్ప మరేదైనా కొత్తగా చేయాలని అనుకోలేదు. ఇక నుంచి నా మార్క్‌ ఉన్న పాత్రలకోసం పనిచేస్తాను.

నాకు ఒకప్పుడు ఆస్థమా ఉండేది. రోజూ రెండు, మూడు గంటలకన్నా ఎక్కువ నిద్రపోయేవాడిని కాదు. దాని నుంచి మెడిటేషన్‌ వంటి ఆధ్యాత్మిక ప్రక్రియల ద్వారా బయటపడ్డాను. ఇప్పుడు చాలా బాగున్నాను. ఆధ్యాత్మిక గురువులైతే చాలా మంది నన్ను ప్రభావితం చేస్తుంటారు.

* ఇండస్ట్రీలో మీ స్నేహితుల గురించి చెప్పండి?
మోహనకృష్ణ, నాని, శౌర్య, నారా రోహిత్‌.. ఇలా నాతో పనిచేసిన అందరూ నాకు స్నేహితులే.

* ఇకపై సినిమాల్లో మానవ సంబంధాలనే ప్రధానంగా చూపించబోతున్నారా?
నాకు మనుషులని చదవడం అంటే చాలా ఇష్టం. ప్రతి వ్యక్తి 100శాతం పర్‌ఫెక్ట్‌గా ఉండలేడు. ఒక్కో వ్యక్తిలో ఒక్కోలోపం. ఆ లోపాలన్నా ఇష్టమే. అంతెందుకు నాకు సక్సెస్‌ స్టోరీలకన్నా ఫెయ్యిల్యూర్‌ కథనాలే ఇష్టం. ఏ ఇద్దరు మాట్లాడుకుంటున్నా ఆ సంభాషణలని కూడా ఆసక్తిగా వింటాను. నేను దర్శకుడిని కావాలని ప్రయత్నిస్తున్న రోజుల్లో నువ్వు చాలా సాఫ్ట్‌గా ఉంటావు. సినిమా దర్శకత్వం చేయగలవా… అని అడిగేవారు. నాకు అదంతా చాలా సరదాగా అనిపించేది. ఎందుకంటే నాకు సినిమా దర్శకుడికి కావాల్సిన అన్ని అర్హతలు, సామర్థ్యం ఉన్నాయని బలంగా నమ్మేవాడిని. అందుకే ఆ మాట అన్నవారితో ఒక పుస్తకంలో సంతకం చేయించుకుని తేదీ నమోదు చేసుకునేవాడిని.

* నటుడిగా పనిచేస్తున్నప్పుడు మీలోని రచయిత, దర్శకుడు బయటకు వచ్చే ప్రయత్నం చేస్తాడా?
అస్సలు రాడు. ఎందుకంటే దర్శకుడికి ఉండే ఒత్తిడి మాటల్లో చెప్పేది కాదు. ఒకే వ్యక్తి వరసగా ఐదారు విభాగాలు చూసుకోవాల్సి వచ్చిందనుకోండి అతని మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది కదా? దర్శకత్వంలో కూడా అంతకుమించి ఒత్తిడి ఉంటుంది. దర్శకుడి కింద ఐదారు డిపార్ట్‌మెంట్లు ఉంటాయి. ఒకరు ‘నేను రేపు ఐదింటికి రాలేను సార్‌… పదింటికి వస్తాను’ అంటారు. మరొకరు.. డబ్బులు ఇస్తే కానీ రానంటారు. మరోపక్క ప్రొడ్యూసర్‌ ‘ఆల్‌రెడీ నీ బడ్జెట్‌ అయిపోయింది’ అంటారు. కెమెరామ్యాన్‌ నాకు నచ్చినట్టుగా సెట్‌ వేయలేదంటారు. ఇలా ఒకటీరెండూ కాదు బోలెడు ఒత్తిళ్లు. మన సినిమా మనం చేయడానికే ఇంత ఒత్తిడి. అందుకే నటుడిగా మరొకరి సినిమాలో వేలుపెట్టే ప్రయత్నం చేయను. చాలా పీస్‌ఫుల్‌గా నా పనేంటో నేను చూసుకుని వస్తా.

 

 

 

‘సినీ పునర్జన్మలు’ పై విశ్లేషణాత్మక వ్యాసం

article cinee punarjanmalu 1 article cinee punarjanmalu 2 article cinee punarjanmalu 3

హాస్యనటుడు ప్రభాస్ ‘శీను’

prabhas srinu

నాయిక ‘సుధాచంద్రన్’

heroine sudhaachandran

దర్శకుడు ‘దేవాకట్టా’

direc devakatta 1 direc devakatta 2 direc devakatta 3 direc devakatta 4

మీనా

heroine meena