‘డాక్టరు కాబోయి యాక్టరయ్యా’ననడం సినిమానటులకు నాలుక చివరుండే నానుడి. దీనికి కొద్ది దగ్గరలో డాక్టర్ కాబోయి కెమరామన్ అయినవాడు పి.జి.వింద. ఫిల్మాటోగ్రఫీలో పట్టాపొంది మధు అంబట్ వద్ద అసిస్టెంట్ కెమరామన్‌గా పనిచేశాడు. ఆ తర్వాత కొన్ని డాక్యుమెంటరీలు, యాడ్ ఫిలింలూ తీసి, ‘గ్రహణం’తో పరిశ్రమ కంట్లో పడ్డాడు. ‘నందనవనం 120 కి.మీ.’, ‘అనుమానాస్పదం’, ‘అష్టాచెమ్మా’, ‘వినాయకుడు’ లాంటి డజను చిత్రాలకు ఛాయాగ్రాహకుడిగా పనిచేశాడు. చ్రిల్డన్స్ ఫిలిమ్ ‘లోటస్ పాండ్’తో డైరెక్టరుగా మారాడు. తన అందమైన అనుభవాల రీలుని కెమరాకన్నులో సెట్ చేసి ‘హ్యాపీడేస్’ రూపంలో మనకు చూపబోతున్నాడిలా.
కౌమార, యవ్వన దశలతో పోలిస్తే నా మనసుపై గాఢమైన ముద్ర వేసింది మాత్రం బాల్యమే. అప్పటి అనుభవసారమే జీవితంలో సరైన దిశగా అడుగులు వేయడానికి దిక్సూచిలా పనిచేసింది. ఆ అందమైన బాల్యం తాలూకూ జ్ఞాపకాలన్నీ ఇప్పటికీ తడి తడిగా, తాజాగా పరిమళిస్తూనే ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా, నాగర్‌కర్నూల్‌కు సమీపంలో ఉన్న ‘పాలెం’ మా ఊరు. స్థానికంగా వెంకటేశ్వరుడి గుడి ఉండడంతో ‘దేవుని పాలెం’గా ప్రసిది.్ధ వ్యవసాయక కుటుంబం కావడంతో పాడిపంటలతో మమేకమై గడిచిన బాల్యం నాది. పొలం పనులతో పాటు, పితికిన పాలను ఇంటింటికి వెళ్లి పోసి వచ్చేవాణ్ణి. ఇన్ని పనులు చేస్తూ కూడా చదువులో క్లాస్ ఫస్ట్ అంటే మాటలు కాదు కదా. అంచేతే సెవెన్త్ పూర్తవగానే ఎ.పి. రెసిడెన్షియల్ సీటు దానంతకదే నన్ను వెదుక్కుంటూ వచ్చింది.
బాల వైద్యశిఖామణిగా…
నాన్న అప్పుడప్పుడు నాటు వైద్యం చేస్తుండేవాడు. తేలు కుట్టినా, గాలి సోకినా జనం ఆయన దగ్గరకు వచ్చి మంత్రం వేయించుకునేవాళ్లు. ఒకసారి నాన్న ఊర్లో లేనప్పుడు ఒకావిడ కడుపునెప్పితో బాధపడుతూ వచ్చింది. అప్పటికే సైన్స్ ప్రకారంగా ఉప్పు, చక్కెర కలిపిన నీటిని తాగిస్తే కొంత ఉపశమనం కల్గుతుందని కనిపెట్టాను. ఆవిడ ముందే కాస్త ఉప్పుని చేతిలోకి తీసుకుని నా కొచ్చిన భాస్కర శతకం శ్లోకాల్ని రెప్పలు అల్లాడించి చదువుతూ మంత్రించినట్టు ఫోజు కొట్టాను. ఆమె నిజంగానే మంత్రం చదువుతున్నానని అనుకుంది. శ్లోకం చదివేసి నీటిలో ఆ ఉప్పుని, చక్కెరను కలిపి తాగించాను. ఆవిడ కొద్దిసేపట్లోనే తేరుకుని ‘నీ కడుపు సల్లగుండా, తగ్గిందయ్యా’ అని దీవించి వెళ్లింది. అలా బాలవైద్య శిఖామణిగా వెలిగిపోయా. చేపల వేట కూడా యమ సరదాగా ఉండేది మొదట్లో. ఒకసారి బురద కుంటలో దిగి చేపనుకొని పాముని పట్టుకున్నాను. అంతే! ఆ దెబ్బతో మళ్లీ ఎప్పుడూ చేపల జోలికి వెళ్లే లేదు. మొహర్రం వచ్చినప్పుడు అలాయ్ మధ్యలో కాల్చడానికి తొట్టిగ్యాంగుతో కలిసి కర్రమొద్దుల్ని దొంగిలించి తెచ్చేవాణ్ణి. ఆ మర్రోజు ఆ ఇంటివాళ్లతో తిట్లు మామూలే.
అడ్వంచర్ బుర్రలే…
బీచుపల్లి ఎ.పి. రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలో చదివేరోజుల్లో నేను చేసిందంతా అడ్వంచరే. మా హాస్టల్ పక్కనే కృష్ణానది ప్రవహించేది. చుట్టూతా చిట్టడివి. అడవి మధ్యలో కలువల కొలనుండేది (నా ‘లోటస్ పాండ్’ సినిమాకు ప్రేరణ). వనవాసంలో తిరిగే రామ, లక్ష్మణ, ఆంజనేయుల్లా మాకు మేమే ఊహించుకుని ధనుర్బాణాలతో సంచరించేవాళ్లం. వెదురు బద్దలతో ధనుస్సు, బాణాలూ తయారుచేసుకునేవాళ్లం. ఒకసారి గురిచూసి నా (రామ) బాణంతో ఒక పావురాన్ని కింద పడగొట్ట్టేశాను. తర్వాత దాని బాధ చూసి చాలా జాలేసింది. పావురాన్ని హాస్టల్‌కి తీసుకొచ్చి ప్రథమ చికిత్స చేశాం. దాన్ని మా దగ్గరే ఉంచుకుని రోజూ గింజలు వేస్తూ, నీరు తాగిస్తూ అది కోలుకునేలా చేశాం.
స్టడీ అవర్స్‌లో ఎవడైనా చదువుతూ చదువుతూ కునికాడంటే చాలు వాడికి నా దగ్గరున్న రంగుల్తో మీసాలు పెట్టేవాణ్ణి. మీసాలు ఎవడికైతే ఉన్నాయో వాడు పడుకున్నట్టు లెక్క. మీసాలరాయుళ్లను చూడగానే టీచర్ బెత్తానికి పని చెప్పేవాడు.
ఎంకిపెళ్లి సుబ్బి చావుకు…
పాపార్జునరావు అనే ఆయన మా డ్రాయింగ్ టీచర్. తనకు ఫోటోగ్రఫీ హాబీ. స్కూల్లోనే ఒక డార్క్‌రూం కూడా ఏర్పాటు చేసుకున్నాడు. రకరకాల పక్షులను, ఉడతలను, పూలను, మేఘాలను, కృష్ణానదిని … కంటికి ఏవి కనిపించినా వదలకుండా తన కెమెరాలో బంధించేవాడు. ఒకసారి రెండు పొటేళ్లు గాల్లో ఎగురుతూ ఢీ కొట్టుకునే ఫోటో తీయాలని నిశ్చయించుకుని, పొట్టేళ్లని వెతికి తెమ్మని మాకు పురమాయించాడు. ఇద్దరం వెళ్లి అతి కష్టం మీద ఒక గొర్రెల మందలో జొరబడి పొట్టేళ్ల కొమ్ముల్ని గట్టిగా పట్టుకుని ఈడ్చుకొచ్చాం. తెచ్చాం సరే, అవి రెండూ గాల్లోకి ఎగిరి ఒకదానికొకటి ఢీ కొట్టుకోడం ఎలా? ఎట్లయినా వాటిని గాల్లోకి ఎగిరించి ఢీ కొట్టించాలనే పట్టుదల మాది.
ఆలోచించి చించి వాటి తోకల్లేపి ముల్లు గుచ్చాం. మా సారువాడు అవి ఎప్పుడు గాల్లోకి లేచి ఢీ కొట్టుకుంటాయా అని ఊపిరి బిగబట్టి కెమెరాతో రెడీగా ఉన్నాడు. అవేమో ముల్లు దిగగానే బాధతో ‘మే’ అంటూ కొద్దిగా కదులుతున్నాయి తప్పించి గాల్లోకి ఎగరడం లేదు. మొదట్లో పిల్లకాయల ఆటలనుకుని సహకరించాయి గాని, తోకలేపి ముల్లు గుచ్చేసరికి గుర్రుమన్నాయ్. ‘ఎక్కడ కుమ్మితే దిమ్మతిరిగి మనుషుల మైండ్ బ్లాక్ అవుద్దో’ వాటికి బాగా తెలిసినట్టుంది. గురిచూసి గుప్పించి ఫెడేల్మనిపించి ఆ పట్టపగలే మా ఇద్దరికీ చుక్కలు చూపించి రెప్పపాటులో మాయమయ్యాయి. ఇంకేముం ది? సీన్ కట్ చేస్తే – కెవ్వుకేక!
డాక్టరు కావాలనుకున్నా
నిజానికి పొట్టేళ్ల దెబ్బకు ఫోటోగ్రఫీపై ఏవగింపు కలగాలి కానీ రివర్స్‌గా కెమెరాపై మోజు పెరిగింది నాలో. చిత్రలేఖనానికీ, శిల్పకళకీ, ఫోటోగ్రఫీకీ అంతర్లీనంగా ఏదో అవినాభావసంబంధం ఉందనిపించేది. మా స్కూల్లో తెప్పించే హిందూ పేపర్‌లో ఎం.ఎఫ్. హుస్సేన్, జెమినీరాయ్, అర్పితా రాయ్ లాంటి చిత్రకారుల గురించి చదువుతున్నప్పుడు మాత్రం జీవితంలో ఏదో సాధించాలనే పట్టుదల అంతర్లీనంగా బలపడుతూ ఉండేది. పాలెం వెళ్లినప్పుడల్లా నా మిత్రుడు రాధాకృష్ణన్ (ఆనంద్, గోదావరి చిత్రాల మ్యూజిక్ ఫేం) కలిసేవాడు. ఇద్దరం ఒక ప్లేగ్రౌండులో కూర్చుని అప్పటివరకూ విడివిడిగా మేం కన్న కలలన్నీ ఒకదగ్గర పోగేసి చర్చించుకునేవాళ్లం.మా మాటలు వినే మిగతా ఫ్రెండ్స్ మాకేదో పిచ్చి పట్టిందని ఎగతాళిగా నవ్వుకునేవాళ్లు. ఇంటర్మీడియట్ పాలెంలోనే చదివి డాక్టర్ అయిపోవాలని ఎం.సెట్. కూడా రాశాను. మెడిసిన్‌లో సీటు రాకపోవడంతో కర్నూల్ వెళ్లి సిల్వర్‌జూబ్లీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలో చేరిపోయా. అక్కడ సినిమాలకు కొదవలేదు. సమయం దొరికితే చెక్కేసేవాళ్లం. ఒకసారి రెండో ఆట చూసి వచ్చి హాస్టల్ గేటు దూకబోతుంటే మా ప్రిన్స్‌పాల్ కాచుకుని ఉన్నాడు. నా లక్కేంటంటే ఆ మర్రోజే వాళ్ల అమ్మాయి పెళ్లి కాబట్టి రెండు చీవాట్లతో సరిపెట్టి వదిలేయడం.
‘ముక్కాంబే’ సృష్టికర్తనయ్యాను
డిగ్రీ రెండో సంవత్సరంలో ఉన్నప్పుడు జూనియర్స్‌ని ర్యాగింగ్ చేసేవాణ్ణి. పాలిటిక్స్ ఇష్టమని చెప్పిన ఒక బకరాని పట్టుకుని అప్పటి ప్రధానమంత్రి ఎవరని అడిగా. ‘రాజీవ్‌గాంధి’ అని చెప్పేడు. ఆయన ప్రధాని కావడానికి కారకుడైన (నేను సృష్టించిన) ముక్కాంబే గురించి తెలుసా అని అడిగా. తెల్లమొహం వేసి తెలీదన్నాడు. ముక్కాంబే వల్లే ఆయన ప్రధాని అయ్యాడని కల్పించి ఒక వ్యాసం తయారుచేసి జనవరి 26న స్టేజీపైన చదవమన్నాను. వాడు మేం చెప్పినట్టు మైకు దగ్గరకు వెళ్లి సీరియస్‌గా చదవడం .. ప్రేక్షకులంతా ఈ ముక్కాంబే ఎవరని విస్త్తుబోయి ముక్కుమీద వేలేసుకుని బిత్తరపోవడం గుర్తొస్తే ఇప్పటికీ నవ్వాపుకోలేను.
డిగ్రీ అయ్యాక సరాసరి హైద్రాబాద్ వచ్చేసి జెఎన్‌టియు ఫిలిం ఆటోగ్రఫీ కోర్సులో చేరిపోయాను. చివరి సంవత్సరంలో ప్రముఖ ఛాయాగ్రాహకుడు మధు అంబట్ వద్ద అసిస్టెంట్ ఫోటోగ్రాఫర్‌గా (‘లజ్జ’ హిందీ సినిమాకి) అవకాశం రావడం, తర్వాత నా మిత్రుడు అల్‌తాఫ్ ద్వారా మోహనకృష్ణ ఇంద్రగంటి పరిచయం, ‘గ్రహణం’ సినిమాకి తొలిసారిగా కెమెరామన్‌గా చేయడం … ఆ మధ్య చ్రిల్డన్ ఫిలిం ‘లోటస్ పాండ్’తో దర్శకుడిగా మారడం … ఏం చేసినా అన్నీ తెరవెనకే ఉండి చేశాను. ఇప్పుడు నా ‘హ్యాపీ డేస్’ పంచుకోడానికి మాత్రం ఇలా మీ ముందుకు వచ్చాను.
అది ‘దుర్యోధన వస్త్రాపహరణ’
సమయం దొరికినప్పుడల్లా వీధినాటకాలు వేస్తుండేవాడు నాన్న. ఇంటి చుట్టూ ఉన్న పిల్లల్ని కూడగట్టి రాత్రి చూసిన ఆ నాటకాన్నే మా ఇంటి వరండాలో ఆడించేవాణ్ణి నేను. అలా ఏడేళ్ల వయసులోనే బాల డైరెక్టరునయ్యా. పాత బట్టలు చించి పంచెలు, రేకు పలకలను వంచి కిరీటాలు చేసేవాణ్ణి. శృంగార్ తిలకాన్ని లిప్‌స్టిక్‌లా పెదాలకు రాసుకునేవాళ్లం. హార్మోనియం ఒక్కటే తక్కువగానీ అచ్చం రాత్రి మా పెద్దలు వేసిన నాటకానికి ఏమాత్రం తీసిపోయేది కాదు.
ఒకరోజు ‘ద్రౌపదీ వస్త్రాపహరణ’ వేయిస్తున్నాను. ద్రౌపది వేషం వేయడానికి ఏ అమ్మాయీ ఒప్పుకోదు కాబట్టి మా వరండాలో ఉన్న ఒక స్తంభాన్నే ద్రౌపదిగా అనుకొని, దానికే చీరలు చుట్టి లాగుతున్నట్లు యాక్షన్ చేస్తున్నాడు బాల దుశ్శాసనుడు. దుర్యోధనుడి వేషంలో ఉన్న పురుషోత్తం అనేవాడు ద్రౌపది (స్తంభం)ని చూస్తూ ‘హ్హ హ్హ హ్హ’ అని వికటాటహాసం చేస్తున్నాడు. ఇంతలో వాళ్ల అన్నయ్య బెత్తంతో రావడం, వీడు భయపడి చెంగున గెంతడం, ఆ కంగారులో పంచె జారి దిసమొలతో పరిగెత్తడం … క్షణాల్లో జరిగిపోయి ‘దుర్యోధన వస్త్రాపహరణ’ ప్రహసనంగా ముగిసింది.
చింతచెట్టుకు వేలాడుతూ …
మాకో బట్టెద్దు (మచ్చలది) ఉండేది. ఒకరోజు దాన్ని బండికి కట్టి పొలం దగ్గరకి వెళ్తున్నాం. బండిలో నేనొక్కడ్నే … మా జీతగాడు బండి తోలుతున్నాడు. వాడు ఎప్పుడు చూసినా బైరాగిలా తత్వాలు పాడుకుంటూ వాడి లోకంలో వాడుండేవాడు. మా ఇంటినుండి పొలం దాదాపు 5 కిలోమీటర్ల దూరం. దారిపొడవునా అటూ ఇటూ చింత చెట్లు. కొడవళ్లలా చింతకాయలు వేలాడుతూ కనిపించగానే నా నోట్లో నీళ్లూరాయి. ఎలాగైనా వాటిని కోయాలని మునివేళ్లమీద నిల్చుని ఎగిరి (బండి వెళ్తూనే ఉందన్న ధ్యాస లేకుండా) ఒక కొమ్మను అందుకున్నాను. చింతకాయలు చేతికి చిక్కాయి కానీ రెప్పపాటులో బండి కదిలి ముందుకు వెళ్లిపోయింది. కొమ్మని పట్టుకునే గట్టిగా అరిచాను.
మా జీతగాడు మాత్రం తిరిగి చూడలేదు. వాడి తత్వాలు బండి దూరమయ్యేవరకూ వినిపిస్తూనే ఉన్నాయి. పాక్కుంటూ కొమ్మపైకి వెళ్లలేను – కిందకి దూకనూలేను … అదొక త్రిశంకు నరకం. ఏడుపు తన్నుకొస్తోంది … ఇంతలో అదే దారిలో కొందరు రావడం కనిపించింది. ఏం జరిగినా ప్రథమ చికిత్స చేసి మా ఇల్లు చేరుస్తారన్న ధీమాతో గెంతేశాను. వాళ్లు గబగబ పరిగెత్తుకొచ్చి ‘అయ్యో చెట్టెందుకు ఎక్కినవయ్యా’ అంటూ లేపారు. నడుం విరగలేదనుకోండి. నేను చెట్టుకొమ్మకు ఎలా వేలాడబడ్డానో వాళ్లకు కూడా అర్థం కాలేదు. వివరించేలోగా మా జీతగాడు నన్ను వెతుక్కుంటూ వెనక్కి రావడం కనిపించింది.
మానం కాపాడిన గంగమ్మ
ఒకరోజు ఈతకోసం ఊరిబయట ఉన్న మోటబావికి వెళ్లాం. అందరిదీ పదీ, పన్నెండేళ్ల వయసే. బట్టలు విప్పి దూరంగా ఒక చెట్టు కొమ్మపై విసిరేసి (లేకపోతే మా కోతినాయాళ్లు నిక్కర్లను దాచేస్తుంటారు) దిస మొలల్తో బావికి దగ్గరగా వస్తున్నాం. ఇంతలో మా క్లాసు మేట్ ఒకమ్మాయి ఈత నేర్చుకోడానికి వాళ్ల అన్నయ్యని తీసుకుని రావడం కనిపించింది. నా మిత్రబృందం కుంభమేళకు వచ్చిన సన్యాసుల్లా నిశ్చలంగా ఉన్నారుగానీ నాకు మాత్రం కంగారు పుట్టేసింది. ఆ అవతారంలో నన్ను చూసిందంటే ఇంకేమైనా ఉందా. మర్రోజు క్లాసులో ఆ పిల్ల మొహం ఎలా చూడగలను? ముందూ వెనక ఆలోచించకుండా అంత లోతైన బావిలోకి దఢేల్‌మని దూకేశాను. నా వీరోచిత విన్యాసాన్ని ఆ పిల్ల గొప్పగా చూసిందేమో కానీ, అసలు సంగతి ఇప్పటికీ తనకి తెలీదు. చచ్చినట్టు ఆ పిల్ల వెళ్లిపోయేదాకా నీటిలోనే ఉండి నా మానం కాపాడుకున్నాను.