గుట్టు బయటపెడతా
ఎంపీ, ఎమ్మెల్యే, డీజీ, డీఎస్పీ, సీఐ వేధించారు
నాతో లేనిపోనివి చెప్పించి రికార్డు చేశారు
ఎంపీ నాతో పలుమార్లు అసభ్యంగా మాట్లాడారు
ఎమ్మెల్యే నా కుటుంబ సభ్యులను వేధించారు
ఏసీపీ శంకర్‌రెడ్డి నా పాలిట యముడు
లక్ష్మీ పార్వతి విలన్లా, రాక్షసిలా బెదిరించింది
ఎంత దూరమైనా వెళ్తా.. అందరినీ బయటపెడతా
‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’లో తారా చౌదరి

హైదరాబాద్, జూలై 8 : రావెళ్ల రాజేశ్వరి.. అలియాస్ తారా చౌదరి. సినిమాల్లో నటించాలని హైదరాబాద్‌కు వచ్చి, కొందరి చేతుల్లో మోసపోయింది. చివరకు సెక్స్‌రాకెట్ నిర్వాహకురాలిగా ఆమె బోనెక్కితే, సూత్రధారులు, లబ్ధిదారులు మాత్రం చల్లగా జారుకున్నారు. ఆ తేలుకుట్టిన దొంగల భరతం పట్టడానికే ఏబీఎన్ స్టూడియోకు వచ్చానంటున్న తారాచౌదరితో.. ‘ఓపెన్‌హార్ట్ విత్ ఆర్కే’ విశేషాలు.
నమస్కారం తారాచౌదరిగారూ. అసలు తారా చౌదరి అనే పేరు ఎలా వచ్చింది?
2005లో సినీపరిశ్రమ కోసం హైదరాబాద్ వచ్చాను. అప్పుడు పరిశ్రమలో చౌదరీల డామినేషన్ ఉందని విన్నాను. కొందరు దర్శకులు, నిర్మాతలను కలిశాను. వాళ్లు సరదాగా తార-సితార అనేవారు. అలా నాకు తార అనే పేరు స్థిరపడిపోయింది.
ఇప్పుడు రాష్ట్రంలో తారాచౌదరి అంటే తెలియనివాళ్లు లేరు. ఏమనిపిస్తోంది?
నన్ను కావాలని ఇరికించారు. నాకు సినిమాలు, రాజకీయాలు, సమాజసేవ అంటే ఇష్టం. తర్వాత ఇక్కడకొచ్చాక పరిస్థితులు చూసి నటన మానుకుందాం అనుకున్నాక ఒక కోఆర్డినేటర్ వచ్చి చిన్నికృష్ణ వద్దకు తీసుకెళ్లారు. అది ప్లాన్ అని తర్వాత తెలిసింది. 2007లో చిన్నికృష్ణతో నాకు గొడవలయ్యాయి. అందుకు సూత్రధారి ఏసీపీ శంకర్‌రెడ్డి అని ముందు తెలీదు. తర్వాత తెలిసింది. చిన్నికృష్ణకు నలుగురైదుగురు భార్యలున్నారు.
శంకర్‌రెడ్డితో మీకు ఎలా పరిచయం?
మొదట్లో నేను మాదాపూర్‌లో ఉండేదాన్ని. అప్పుడు ఇంట్లో దొంగలు పడ్డారు. వాళ్లను మాదాపూర్ పోలీసులు పట్టుకుని, నా వస్తువులు నాకు రికవరీ చేసిచ్చారు. తర్వాత శంకర్‌రెడ్డి (అప్పటికి సీఐ) నాకు ఫోన్ చేసి ‘నువ్వు ఆర్టిస్ట్ అంట గదా, చాన్సులిప్పిస్తా’ అంటూ వల్గర్‌గా మాట్లాడేవాడు. దాంతో నేను ఉన్నతాధికారికి చెబుదామని బంజారాహిల్స్ పీఎస్‌కు ఫోన్ చేస్తే, ఈ శంకర్‌రెడ్డే కలగజేసుకుని నా ఇంటికి పోలీసులను పంపాడు. (అప్పుడే నామీద బ్రోతల్ కేసు పెట్టారు.) దాంతో నేను ఫైరయ్యాను.
అసలు చిన్నికృష్ణతో లింక్ ఎలా వచ్చింది?
శంకర్‌రెడ్డి నామీద కేసు పెట్టాక, 2007లో చిన్నికృష్ణ సినిమా స్టార్ట్ చేస్తున్నాడని ఒక సినీ కోఆర్డినేటర్ నా దగ్గరకొచ్చాడు. సెకండ్ హీరోయిన్ కేరెక్టర్ ఇస్తామన్నారు. అక్కడే శంకర్‌రెడ్డిని చూశాను. చిన్నీని ప్రశ్నిస్తే మంచి ఫ్రెండని చెప్పాడు. తర్వాత ఇద్దరూ కలిసి రూంలో కూర్చుని నన్ను పిలిచారు. ‘అప్పుడు నేను చెప్పినట్లు వినలేదు, కేసు పెట్టాను. ఇప్పుడు విను, సినిమాచాన్స్ వస్తుంది.. పైకొస్తావు’ అన్నాడు. కొన్నాళ్లకు.. తాము చెప్పినట్లు వినకపోతే చంపేస్తామని నన్ను బెదిరించారు. చిన్నికృష్ణ కూడా వల్గర్‌గా మాట్లాడేవారు. సినిమా వేషాల కోసం వచ్చినవారిని నాయకుల వద్దకు పంపేవారు. దీని గురించి రామానాయుడు గారితో చెప్పాను. నచ్చకపోతే బయటకు వెళ్లిపో అన్నారు.
అప్పటివరకు ఎవరితోనూ మీకు శారీరక సంబంధాలు ఏర్పడలేదా?
అసలు మా కుటుంబం అలాంటిది కాదు. అతని భార్య చనిపోయిందని గోడమీద ఫొటో చూపించాడు. నన్ను లోబరుచుకోడానికి ప్రయత్నించాడు. కూల్‌డ్రింక్‌లో ఏదో కలిపి ఇచ్చాడు. అది తాగి, వాంతులై పడిపోయాను. తర్వాతిరోజు పొద్దున్న నాకు మెలకువ వచ్చింది. పనిమనిషిని అడిగితే.. చిన్నికృష్ణ, శంకర్‌రెడ్డి కలిసి ఏదో కెమెరానో సెల్ఫోనో పట్టుకుని రూంలోకి వచ్చారంది. తర్వాత నేను కస్టడీకి వెళ్లినప్పుడు ‘చిన్నికృష్ణ ఇంట్లో నీ ఫొటోలివిగో’ అని శంకర్‌రెడ్డి చూపిస్తే షాకయ్యాను.
మీరు సెక్స్‌రాకెట్ నిర్వహిస్తున్నారని, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఐపీఎస్‌లు మీ కస్టమర్లని.. వాళ్ల సంభాషణలు, అవీ ఇవీ మీరు వీడియో తీసి బెదిరించారని పోలీసులు చేసిన ప్రధాన ఆరోపణ. అది వాస్తవమా.. కాదా?
పచ్చి అబద్ధం. నాకు సినిమాలు, రాజకీయాలంటే ఇష్టం. దాంతో నేను హైదరాబాద్ వచ్చి, రెండు మూడు సినిమాలు చేశాను. నాకు అచ్చిరాదనిపించి శ్రీ తార ఆర్ట్స్ అని ఓ బ్యానర్ రిజిస్టర్ చేసుకున్నాను. దాని మీద చిన్న సినిమా అయినా తీయాలని అనుకున్నాను. నా దగ్గర చిన్న ఎమౌంట్ ఉన్నా ఎవరికైనా సాయం కావాలంటే చేస్తుంటాను.
అంటే, పోలీసులు చెప్పింది వాస్తవం కాదా?
వాళ్లు చెప్పింది, చేసిందంతా ఫ్రాడ్. శంకర్‌రెడ్డి నా పాలిట యముడిలా దాపురించాడు. లక్ష్మి అనే ఓ అమ్మాయిని పురమాయించాడు. ఓ రోజు ఆ అమ్మాయి ముఖానికి గుడ్డ కట్టుకుని టీవీలో ఏదో చెబుతోంది. దాంతో బంజారాహిల్స్ పీఎస్‌కి వెళ్లాను. అక్కడ కానిస్టేబుళ్లు, సీఐలు నా దగ్గరున్న మూడు సెల్ఫోన్లు లాక్కున్నారు. అందులో నా సినిమా ఫ్రెండ్లు, నాకు పరిచయమైన కొందరు నాయకుల నెంబర్లు ఉన్నాయి. వాళ్లను బ్లాక్మెయిల్ చేయాలని అనుకున్నారు. నా ఫోన్లో ఓ చానల్ రిపోర్టర్ మురళి నెంబర్ ఉంది. ఆయన మొదట్లో అతి మంచితనం ప్రదర్శించి, లైవ్ ఇప్పించి, ఇంటర్వ్యూలు తీసుకున్నారు. తర్వాత చుట్టుపక్కల అందరినీ కట్‌చేసి, నన్ను బ్లేమ్ చేయడానికి సోలోగా ఉన్నవి ప్లేచేశారు. పోలీసులు, మురళీ కుమ్మక్కయ్యారు. మురళి అప్పుడప్పుడు నాకు ఎస్ఎంఎస్లు పెట్టేవాడు, కాల్స్ చేసేవాడు. వల్గర్‌గా మాట్లాడేవాడు.
మరి అమ్మాయి సంగతేంటి?
ఆ అమ్మాయి ఎవరో కూడా తెలియదు. మార్చి 1 నుంచి 15 వరకు బంధించారని చెప్పింది. ఆ టైంలో నేను తిరుపతిలో ఉన్నాను. నాయకులెవరినీ బ్లాక్మెయిల్ చేయలేదు. వాళ్లే నాకు ఫోన్లుచేసి అనేక రకాలుగా అసభ్యంగా మాట్లాడారు. మీడియాకు కాల్ రికార్డులు చూపించాను. వాళ్లలో ఎమ్మెల్యే, ఎంపీ, డీజీ, ఎస్పీ, అంతా ఉన్నారు.
ఆ ఎంపీ ఎవరు.. రాయపాటి సాంబశివరావా?
ఆయన రాయపాటా.. ఎవరా అన్నది నేను మొన్న మీడియా చానళ్లన్నింటికీ కాల్‌డేటా చూపించాను. నాతో ఆయనకి పరిచయాలు లేకపోతే, ఆయన గెస్ట్‌హౌస్ నుంచి, ఆయన ఇంటి నుంచి, ఆయన ఢిల్లీ ఆఫీసుల నుంచి, ఆయన పీఏ నుంచి, ఆయన పర్సనల్ మొబైల్ నుంచి.. కాల్స్ ఎలా వస్తాయి? ఎప్పుడెప్పుడు వచ్చాయో బయటపెడతా.
అసలు ఏం జరిగిందో చెప్పండి?
2008లో నేను తిరుపతి వెళ్లాలని లెటర్ కోసం ఆయన్ని కలిశాను. తర్వాత ఆ పరిచయంతో.. నాకు మసాజ్‌లు అంటే ఇష్టం, అమ్మాయిలను పంపు అన్నారు. తెలిసినవాళ్ల నెంబర్లు తీసుకుని.. ఆయనకి మసాజ్ కావాలట, మీరు చేస్తారా అని అడిగాను. వాళ్లు చేస్తామన్నారు. అలా చేసినవాళ్లు నా దగ్గరకొచ్చి రెండు రకాలుగా చెప్పారు. ఒకళ్లు, ‘మీరు మసాజ్ అన్నారు, ఆయన ఏదో వల్గర్‌గా ప్రవర్తించారు.. మేం తప్పించుకుని వచ్చాం’ అన్నారు. మరికొందరు.. ‘మీరు మంచి సార్‌ని పరిచయం చేశారు.. మేం ఒకదానికి వెళ్తే, ఆయన మరోలా ఎక్కువ డబ్బు ఇచ్చారు’ అన్నారు. ఎవరిష్టం వాళ్లది.
కన్నా లక్ష్మీనారాయణను అప్రతిష్టపాలు చేయడానికి మీకు డబ్బులిచ్చారని కూడా చెప్పారు కదా? ఏం చేయమన్నారు?
కన్నా లక్ష్మీనారాయణ నాకు తెలీదు, అమ్మాయిలను అడ్డుపెట్టుకుని ఆయనమీద బురద చల్లాల్సిన అవసరం నాకు లేదని చెబితే సరేనన్నారు. ఆ ఎంపీ సోదరుడి కుమారుడు రాత్రి పూట మూడు నాలుగు గంటలు మాట్లాడేవాడు. మీరంటే ఇష్టం, మంచి ఫ్రెండ్‌లా ఉందామని అనేవాడు. చివరకు లవ్ చేస్తున్నానన్నాడు. నేను దాన్ని పట్టించుకోలేదు. తర్వాత ఎంపీ అసభ్యకరంగా మాట్లాడేవారు. అమ్మాయిలను పంపుతున్నావా లేదా.. నువ్వు గెస్ట్‌హౌస్‌కి వచ్చేసెయ్యి అనేవారు. తర్వాతి కాలంలో నాకు మూడ్ వచ్చేసింది అమ్మాయిని పంపించు అన్నప్పుడు.. రికార్డ్ చేశాను.
సమాజం దృష్టిలో మీరు వ్యభిచార వృత్తి నిర్వాహకురాలే కదా?
వ్యభిచార వృత్తి నిర్వాహకురాలినని నన్ను కోర్టు నిర్ధారించలేదు. నిజానికి వ్యభిచారులు వాళ్లు. శంకర్‌రెడ్డి.. వీళ్లంతా బ్రోకర్లు.
మీ దృష్టిలో ఆ వ్యభిచారులు ఎవరు?
ఒకరు రిటైర్డ్ డీజీ. ఆయన పేరు భాస్కరయ్య. నాతో అసభ్యంగా మాట్లాడి, ఏమే.. ఏంటే అన్నారు. అవన్నీ రికార్డుచేశాను. అవన్నీ పోలీసులు తీసుకుని వాళ్లదగ్గర డబ్బులు గుంజుకుని నన్ను బ్లాక్మెయిల్ చేశారు. ఈ ఐజీ గానీ, కర్నూలు డీఎస్పీగానీ, ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యే గానీ…
ఈ డీఎస్పీ, ఎమ్మెల్యే.. వీళ్లంతా ఎవరు?
కర్నూలు డీఎస్పీ మనోహరరావును భాస్కరయ్య పరిచయం చేశారు. ఎమ్మెల్యే ఆదిలాబాద్ జిల్లా ఆయన.
వీళ్లందరికి సంబంధించిన ఆడియోటేప్లు పోలీసులు తీసుకున్నారా?
డీజీపీ గారు గానీ, హోం మంత్రి గానీ, కమిషనర్‌గానీ నేను రక్షణ అడిగినప్పుడు స్పందించలేదు. కారణమేంటి? ఎవరో అమ్మాయి వైజాగ్ నుంచి వచ్చానని, ఆమెను నేను బంధించానని చెబితే ఒక గంగాభవాని గారు, ఒక నన్నపనేని రాజకుమారి గారు, ఒక సంధ్య గారు.. వీళ్లంతా ఆ అమ్మాయి బిత్తరచూపులు చూస్తోందని, వాస్తవాలు చెప్పట్లేదని గమనించకుండానే ఆ అమ్మాయికి న్యాయం చేయాలని అడిగారు.
లాకప్‌లో శంకర్‌రెడ్డి మీ చీర లాగడానికి ప్రయత్నించాడన్నారు. నిజమేనా?
అవును.. శంకర్‌రెడ్డి కస్టడీ పేరుతో నన్ను తీసుకెళ్లి, నా చీర లాగేశాడు. లేడీ కానిస్టేబుళ్లు దేవి, కిరణ్‌కుమారి, ఎస్ఐ సీతారాములు దీనికి ప్రత్యక్ష సాక్షులు. స్టేషన్లో తన గదిలో బెడ్‌మీద శంకర్‌రెడ్డి కూర్చుని అసభ్యకరంగా నామీద చేతులేశారు. అదంతా సెల్ఫోన్లలో రికార్డు చేశారు. ఎన్కౌంటర్ చేస్తామని బెదిరించి నాతో బలవంతంగా వేరేలా చెప్పించి రికార్డు చేశారు. కస్టడీ ముగిశాక జడ్జీ వద్ద కూడా నేను ఏడుస్తూ ఇదే చెప్పాను. అంత చెప్పినా డీజీపీగారు ఎందుకు స్పందించలేదు? మిమ్మల్ని రకరకాలుగా ఉపయోగించుకున్న వాళ్లంతా బాగానే ఉన్నారు. మీరు మాత్రం లేడీ విలన్‌గా ముద్రపడిపోయారు. ఎందుకలా? నన్ను బలిపశువును చేసినవాళ్లందరూ వయసులోను, హోదాలోను పండిపోయినవాళ్లు. వాళ్లు తప్పులు చేయని నిజాయితీపరుల్లా బయటకు కనపడుతున్నారు. ప్రభుత్వం నిజాయితీగా స్పందిస్తే.. నన్ను ఇబ్బంది పెట్టినవాళ్లను జైళ్లకు పంపేది.
ఎమ్మెల్యే వేణుగోపాలాచారి విషయం ఏంటి?
గతంలో టీడీపీలో ఉండి ప్రస్తుతం టీఆర్ఎస్లోకి వెళ్లిన ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యే ఒకరున్నారు. ఆయన సీఐతో ఫోన్లు చేయించి మా కుటుంబసభ్యులను బెదిరించారు.
రిమాండ్‌లో తోటి ఖైదీలు ఎలా ఉండేవారు? పోలీసుల విషయమేంటి?
ఖైదీలు బాగానే ఉండేవారు. ఓ టీవీ చానల్ వాళ్లు, పోలీసులు కుమ్మక్కు అయ్యి లేనిపోనివి సృష్టించారు. నాకు నార్కోటెస్టులు చేసినా నిజం తెలుస్తుంది. అదే శంకర్‌రెడ్డికి, సుదర్శన్‌కి కూడా చేయాలని అడుగుతున్నా. నన్ను ఎంపీ ఇబ్బంది పెట్టినప్పుడు మాజీ సీఎం భార్యను ఆశ్రయించా. ఆమె ఎవరో కాదు.. లక్ష్మీపార్వతి ఆంటీ. నాకు న్యాయం చేస్తానని చెప్పి, ఆ ఎంపీతో దగ్గరి సంబంధం ఉన్న వ్యక్తిని పిలిపించింది. తర్వాత ఆయన నా తలమీద చెయ్యేసి, ఆ ఎంపీ అంతేనని.. వదిలెయ్యమని చెప్పారు. ఆమె నా దగ్గర ఉన్న సాక్ష్యాలు ఒక సెట్టు ఇవ్వమని చెబితే ఇచ్చాను. తర్వాతి రోజు ఫోన్ చేసి ‘వాళ్ల సంగతి నీకు తెలీదు, ఎత్తుకెళ్లి చంపేస్తారు’ అని విలన్లా, రాక్షసిలా బెదిరించింది.
ఈ రొచ్చులోంచి బయటికెళ్లి, హైదరాబాద్ వదిలేసి ప్రశాంతంగా బతకాలనుకుంటున్నారా?
నేనెందుకు హైదరాబాద్ నుంచి వెళ్లిపోవాలి.. ఇక్కడే ఉంటా. నేనేంటో రుజువు చేసుకుంటా. ఈ శంకర్‌రెడ్డి లాంటి వాళ్లను మాత్రం కఠినంగా శిక్షించాలని కోర్టులోను, హెచ్చార్సీలోను ఫిర్యాదుచేస్తా. ఎంత దూరమైనా వెళ్తా. పోలీసులు నా దగ్గర తీసుకున్నవి జిరాక్సులు మాత్రమే. ఒరిజినల్స్ అన్నీ నా మెయిల్ బాక్సులో ఉన్నాయి. వాళ్ల బండారాన్ని బయటపెట్టి దోషులుగా నిరూపిస్తా. నా కుటుంబాన్ని వేధించిన ఎమ్మెల్యే, అర్ధరాత్రి నాకు ఫోన్లు చేసిన ఎంపీ, డీఎస్పీ, డీజీ.. అందరినీ బయటపెడతా.