తెలుగు సినీరంగ ప్రథమార్థం – నిరాశాజనకం
తెలుగు సినిమా రంగానికి కాలం ఇంకా కలిసిరాలేదు. ఆంగ్ల సంవత్సరాది వచ్చి ఆరు మాసాలు గడిచిపోయినా పర్ఫెక్ట్ హిట్స్ పెద్దగా పడలేదు. ఒకటీ అరా విజయాలతో ఆరు నెలల కాలం అలా అలా గడిచిపోయింది. నిజం చెప్పాలంటే ఈ యేడాది ప్రదమార్ధంలో వికసించిన సినీ కుసుమాల కంటే నేలరాలిపోయిన పువ్వులే ఎక్కువ. టాలీవుడ్ చరిత్రనే తిరగరాస్తాయని, పాత రికార్డుల్ని బద్దలు కొడతాయని భావించిన సినిమాలు కూడా బాక్సా ఫీస్ బరిలో చతికిలపడ్డాయి. హిట్ కాంబినేషన్లు, దర్శకుల సీనియారిటీ, నటీనటుల కష్టాలు ఇవేవి సగటు ప్రేక్షకుడికి పట్టలేదు. సినిమా బాగుందా లేదా అన్నది ఒకటి గీటురాయిగా ప్రేక్షకులు భావించారు. నచ్చిన సినిమాలకు నజరానా అందించారు.
ఈ యేడాది తొలి ఆరు నెలల్లో విదుదలైన సినిమాల విషయానికి వస్తే తెలుగులో స్ట్రయిట్ చిత్రాలు మొత్తం యాభై విడుదుల అయ్యాయి. జనవరిలో 10, ఫిబ్రవరిలో 8, మార్చిలో 11, ఏప్రిల్‌లో 8, మేలో 6, జూన్‌లో 7 చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. విచిత్రం ఏమంటే దాదాపు అనువాద చిత్రాలు ఇదే సంఖ్యలో విడుదల అయ్యాయి. స్ట్రయిట్ చిత్రాల విజయం అనువాద చిత్రాలు పొందక పోయినా వాటికి ఈ ఆరు మాసాలలో తగిన ప్రాధాన్యం లభించింది. ఈ ఆరు నెలల్లో ఇంగ్లీష్ నుండి 23, తమిళ్ నుండి 15, కన్నడ నుండి 6, హిందీ నుండి 4, మలయాళం నుండి 2 సినిమాలు తెలుగులోకి అనువాదమయ్యాయి.

బరిలో నిలబడలేకపోయిన సంక్రాతి సినిమాలు!
తెలుగు సినిమా రంగానికి సంక్రాతి పండగ పెద్ద సీజన్. అల్లుళ్ళందరూ అత్తవారింటికి చేరుకునే ఈ సమయంలో సినిమాలకు విపరీతమైన ఆదరణ ఉంటుందని అందరూ నమ్ముతారు. సంక్రాంతి సీజన్‌ను సొమ్ము చేసుకోవాలని నిర్మాతలు ఆరాటపడతారు. అయితే ఈ యేడాది సంక్రాంతికి వచ్చిన’ పరమవీరచక్ర’ సినిమా సగటు ప్రేక్షకుడినే కాదు, బాలక్రిష్ణ అభిమానులను సైతం నిరాశకు గురి చేసింది. బాలకృష్ణ అభినయం ఆకట్టుకున్నా, కథాబలం లేకపోవడంతో ఈ అగ్ర కథానాయాకుని చిత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. దాసరి అభిమానులను నిరిత్సాహపరిచింది. ఇక అదే సీజన్లో వచ్చిన ‘ అనగనగా ఓ థీరుడు’ దీ అదే పరిస్థితి. ఎన్నో అంచనాలతో తెరకెక్కిన ఈ సినిమా పరాజయం బాటనే పట్టింది. రవితేజ ‘మిరపకాయ్’ ఓపెనింగ్స్ పర్వాలేదనిపించాయి. ఇక సుమంత్ ‘గోల్కొండ హైస్కూళ్ మంచి చిత్రమనే పేరు తెచ్చుకుంది తప్పితే నిర్మాతలకు కాసుల్ని అందించలేదు.
చిన్న చిత్రాలకే పెద్ద పీట!
జనవరి మూడో వారంలో వచ్చిన ‘అలా మొదలైంది ‘ చిన్న సినిమాల నిర్మాతలకు కొత్త ఊపిరి పోసింది. నాని, నిత్యా మీనన్ జంటగా నందినీరెడ్డి దర్శకత్వంలో దామోదర్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా చక్కని విజయాన్ని సొంతం చేసుకుని, చిన్న సినిమా ఇంకా బతికే వుందని నిరూపించింది. ఇక ఆ వెనుకే వచ్చిన గోపీచంద్ ‘వాంటెడ్’, బ్రహ్మానందం కుమారుడు గౌతం నటించిన ‘వారెవా’ పరాజయం పాలైనాయి. తెలంగాణా ఉద్యమ నేపథ్యంలో వచ్చిన ‘జై బోలో తెలంగాణా నిజాయితీ గల ప్రయత్నంగా పేరు తెచ్చుకున్నా ఆశించిన స్థాయిలో తెలంగాణా జిల్లాల్లోనూ ఆడలేదు. ఇక మరో అగ్ర కథానాయకుడు నాగార్జున నటించిన ‘గగనం’ ఆలోచనాత్మక చిత్రమనే కితాబును పొందింది తప్పితే నిర్మాతలకు విజయం అందని ద్రాక్ష అయింది. ‘వస్తాడు నా రాజు ‘తో విష్ణు, ‘కథా స్క్రీన్‌ప్లే దర్శకత్వం: అప్పల్రాజు ‘ తో సునీల్ ఖిన్నులయ్యారు. చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయాన్ని మరో సినిమా ‘ ప్రేమ కావాలి ‘ ఫర్వాలేదు అనే టాక్‌తో సినిమా విడుదలై, ఆ తరువాత అంచలంచెలుగా ప్రేక్షకాదరణ పొంది చక్కని సక్సెస్సును సొంతం చేసుకుంది. ఇక వరుణ్ సందేశ్ ‘కుదిరితే కప్పు కాఫీ’, రాజేంద్ర ప్రసాద్ ‘ భలే మొగుడు-భలే పెళ్ళాం’ కూడా నిరశకు గురి చేశాయి.
ప్రయోజనాత్మక, ప్రయోగాత్మక చిత్రాల పరాజయం!
పెద్దా చిన్నా తేడా లేకుండా ప్రయోజనాత్మక, ప్రయోగాత్మక చిత్రాలకు ప్రేక్షకులనుండి మొండి చేయి ఎదురయింది. ఎన్నారై దర్శక, నిర్మాతలు రూపొందించిన ‘ఎల్బిడబ్ల్యు ‘ బాగానే వుందనే పేరు తెచ్చుకున్నా, థియేటర్లకు జనాన్ని తీసుకు రావడంలో విఫలమైంది. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న అంశాల్ని దృష్టిలో పెట్టుకుని తీసిన్ ‘నిత్య పెళ్ళికొడుకు’, ‘నిశ్శబ్ద విప్లవం’, ‘చట్టం’ చిత్రాలను ప్రేక్షకులు హర్షించలేదు. ఐదు రోజుల్లో సినిమా తీసేస్తానన్న రాం గొపాల్వర్మ ‘దొంగల ముఠా” మేకింగ్ చేయగలిగారు కానీ ప్రేక్షకుల్ని మరో ఐదు రోజులయినా మెస్మరైజ్ చేయలేక పోయారు. కాస్త భిన్నంగా తెరకెక్కిన ‘తిమ్మరాజు’, ‘కారాలు మిరియాలు’,’రాజ్’, ప్రయోజనాత్మక చిత్రంగా పేరు తెచ్చుకున్న ”గంగ పుత్రులు ‘ సైతం పరాజయం పాలైనాయి.
పెద్ద చిత్రాలదీ పక్కదారే!
విజయానిది రహదారి అయితే పరాజయానిది పక్కదారే! భారీ అంచనాలతో తెరకెక్కిన అగ్ర హీరోల చిత్రాలన్నీ ఈ సీజన్లో వరుసగా పక్కదారి పట్టాయి. ఎన్టీఅర్, మెహర్ రమేశ్‌ల కాంబినేషన్లో వచ్చిన ‘శక్తి’, పవన్ కళ్యాణ్, త్రివిక్రం కలసి వాయించిన ‘తీన్మార్’, రానా హీరోగా పూరీ రూపొందించిన ‘నేను నా రాక్షసి’ చిత్రాలు అలరించలేదు. మూడు భాషల్లో గీతాకృష్ణ తీసిన ‘కాఫీ బార్’ది, శివాజీ నటించిన ‘లోకమే కొత్తగా’ చిత్రానిదీ అదే పరిస్థితి.
వరుస పరాజయాల నడుమ కాస్తంత ఊపిరి పోసిన చిత్రాలు ‘మిస్టర్ పర్ఫెక్ట్’, ‘100% లవ్’.గత ఏడాది ‘డార్లింగ్’ చిత్రంతో విజయాన్ని చవిచూసిన ప్రభాస్ మరో సారి ‘మిస్టర్ పర్ఫెక్ట్’ తో మంచి మార్కులు కొట్టేసాడు. అదే రకమైన ఆనందాన్ని నాగ చైతన్య కూడా పొందాడు. ‘ఏం మాయ చేశావే’ సక్సెస్ తరువాత మరోసారి ‘100% లవ్’ రూపంలో విజయలక్ష్మి నాగ చైతన్యను వరించింది. దర్శకులు దశరథ్, సుకుమార్‌లలో ఈ విజయం కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ ఏడాది ప్రారంభంలో నరేశ్ నటించిన ‘అహనా పెళ్ళంట’ విడుదలై ఫర్వాలేదనిపించింది. ఇక మే నెలలో వచ్చిన ‘సీమటపాకాయ్’ కమర్షియల్గానూ సక్సెస్ సాధించింది. నరేశ్ ఇమేజ్‌కు బలం చేకూర్చింది. ఇక బాక్సాఫీస్ దగ్గర రవితేజ ‘వీరం’గం సృస్టిస్తాడని భావించిన వారికి నిరాశ ఎదురైంది. ‘ఆపరేషన్ దుర్యోధన’తో అలరించిన శ్రీకాంత్, పోసానిల జంట ‘దుశ్శాసన’ విషయంలో ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేయలేకపోయింది. ఛార్మికి ‘మంగళ’ మాత్రమే కాదు ‘నగరం నిద్రపోతున్న వేళ’ సినిమా సైతం నిరాశ మిగిల్చింది. ఇక గీతా ఆర్ట్స్ బ్యానర్లో వచ్చిన ‘బద్రినాథ్’ ‘మగధీర’ చిత్రాన్ని అన్ని రకాలుగా అధిగమించేస్తుందేమోననే భ్రమను విడుదలకు ముందు కలిగించినా అది అసాధ్యమని తేలిపోయింది. భారీ ఓపెనింగ్స్‌ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఆ స్థాయిలో పాజిటివ్ టాక్‌ను తెచ్చుకోలేకపోయింది. సీనియర్ యాడ్ ఫిల్మ్ మేకర్ జయేంద్ర దర్శకత్వం వహించిన తొలి ఫీచర్ ఫిల్మ్ ‘180’ని విజువల్ ఫీస్ట్ అనగలం తప్పితే, గుడ్ ఫిల్మ్ అనలేం.

విడుదలలో పోటీపడిన అనువాద చిత్రాలు!
స్ట్రయిట్ తెలుగు సినిమాలు ఈ ఆరు నెలల్లో 50 విడుదలయితే, అనువాద చిత్రాలూ అదే సంఖ్యలో విడుదలై తామూ తీసిపోమని నిరుపించాయి. ఇందులో 23 చిత్రాలు ఆంగ్లం నుండి అనువాదం కాగా, తమిళం నుండి 15, కన్నడం నుండి 6,హిందీ నుండి 4, మలయాళం నుండి 2 సినిమాలు తెలుగులోకి వచ్చాయి. అయితే ప్రముఖ దర్శకుడు గౌతం వాసుదేవ మీనన్ తీసిన ‘ఎర్ర గులాబీలు’ ప్రయోగాత్మక చిత్రంగా మిగిలిపోయింది. అనువాద చిత్ర నిర్మాతలలో కాస్త ఉత్సాహాన్ని నింపింది కేవలం ‘రంగం’ సినిమా మాత్రమే. ప్రముఖ నిర్మాత ఆర్.బి.చౌదరి కుమారుడు జీవా నటించిన ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఫొటో జర్నలిస్ట్‌గా జీవా అద్భుతంగా నటించాడు.దర్శకుడు కె.వి.ఆనంద్ టేకింగ్ కూడా అందర్నీ అలరించింది. అలానే సహజత్వానికి దగ్గరగా సినిమాలు తీసే బాల ‘వాడు-వీడు’తో మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఈ సినిమాతో విశాల్‌కు నటుడిగా మంచి పేరు వచ్చింది. ఈ ఆరు నెలల్లో అనువాద చిత్రాలలో ఈ రెండు సినిమాలను తప్పితే చెప్పుకోడానికి మరే సినిమా లేదు.
మొత్తం మీద ఈ ఆరు నెలల్లో ‘అలా మొదలైంది’ ‘ప్రేమ కావాలి’ ‘మిస్టర్ పర్ఫెక్ట్’ ‘100% లవ్’ ‘సీమటపాకాయ్’ చిత్రాలు విజయం సాధిస్తే, రెండు మూడు సినిమాలు మాత్రం ఫర్వాలేదనిపించాయి. ఇక చిత్రసీమ ఆశలన్నీ ద్వితీయార్థం పైనే…….