ఎలుకలు పట్టడానికి వెళ్ళా..!
ఆ మధ్య ‘ఒరేయ్ బామ్మర్ది’లో సిద్ధార్థ్ పక్కన మెరిసి… తాజాగా ‘జైభీమ్’లో చిన్నతల్లిగా నటించి… ఒక్కసారిగా అందరి చూపూ తనవైపు తిప్పుకుంది లిజోమోళ్‌జోస్. చిన్నతల్లిగా ప్రేక్షకుల చేత కూడా కన్నీళ్లు పెట్టించిన ఈ మలయాళ కుట్టి తన మనసులోని ముచ్చట్లను చెబుతోందిలా..
సినిమాల్లోకి ఎలా అంటే..
మా స్వస్థలం కేరళలోని ఇడుక్కి. మాది చాలా చిన్న కుటుంబం. నాన్న రాజీవ్‌కు సొంత వ్యాపారం ఉంది. అమ్మ లీసమ్మ అటవీశాఖలో ఉద్యోగి. చెల్లి పేరు లియా. చిన్నప్పటినుంచీ కాలేజీ లెక్చరర్‌గా స్థిరపడాలనుకున్నా. అందుకే డిగ్రీ అయ్యాక పాండిచ్చేరీ యూనివర్సిటీ నుంచి లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్‌లో పీజీ చేశా. ఆ తరువాత పీహెచ్‌డీ చేయాలనేది నా కోరిక. అయితే ఓ రోజు మా ఫ్రెండ్స్ వాట్సాప్‌గ్రూప్‌లో ఒక సినిమా అవకాశం ఉందనీ, ఆసక్తి ఉన్నవాళ్లు ఫొటోలు పంపించమనీ ఓ మెసేజ్ వచ్చింది. అది చూసి ప్రయత్నిద్దామని ఫొటోలు పంపించడంతో ‘మహేషింటే ప్రతికారం’లో అవకాశం వచ్చింది. ఆ తరువాత మరికొన్ని అవకాశాలు వచ్చాయి. సినిమాల్ని కేవలం సరదాగా చేయాలనుకున్నా కాబట్టి ఇంట్లోవాళ్లూ ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు.
ఇప్పటివరకూ నేను చేసిన సినిమాలతో పోలిస్తే జై భీమ్ కోసం కాస్త డైటింగ్ చేయాల్సి వచ్చింది. అదేవిధంగా ఆ గిరిజన తెగ అలవాట్లూ, మాట్లాడే విధానం… వంటివన్నీ తెలుసుకునేందుకు కొన్నిరోజులు వాళ్లతో గడిపాను కూడా. పాముకాటుకు వాళ్లు వేసే ఔషధాల గురించీ పూర్తిగా తెలుసుకున్నా. వాళ్లతో కలిసి ఎలుకలు పట్టేందుకూ వెళ్లేదాన్ని. ఓసారి ఎలుకమాంసం కూడా రుచిచూశా. ఇక, సూర్య గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమా మొత్తం పూర్తయ్యేవరకూ ఆయన అందించిన సహకారం అంతాఇంతా కాదు. ఓసారి మదురైలో షూటింగ్ ఉండటంతో అందరం వెళ్తున్నాం. ఆయన సడెన్‌గా ‘ఇక్కడ జిగర్‌ఠండా దొరుకుంది. ఎప్పుడైనా తాగావా’ అని అడిగారు. లేదని చెప్పడంతో టీం మొత్తానికి ఆ పానీయాన్ని ఇప్పించారు. ఇలాంటి జ్ఞాపకాలెన్నో నా సొంతమైనందుకు చాలా ఆనందంగా ఉంది.
శిక్షణ ఇచ్చాకే… షూటింగ్!
అక్కడ ఇంగ్లిష్ కోసమే చేరా…
పాండిచ్చేరి యూనివర్సిటీలో వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు చదువుకుంటారు. వాళ్లతో ఇంగ్లిష్‌లోనే మాట్లాడగలం. అలా మాట్లాడటం వల్ల నాకు కూడా ఇంగ్లిష్‌పైన పట్టు వస్తుంది కాబట్టే అక్కడ చేరా.
ముగ్గురం ఒకే బైక్‌పైన…
నచ్చే ఆహారం: మాంసాహారం. నాకు వంట కూడా వచ్చు. నేను కంద చికెన్ కర్రీని అద్భుతంగా చేస్తా.
ఇష్టపడే నటులు: మోహన్‌లాల్ నటనంటే ఇష్టం. అయితే ఆమిర్‌ఖాన్‌కు వీరాభిమానిని.
తీరిక దొరికితే: ప్రయాణాలు చేస్తా. లేదా నచ్చిన పాట పెట్టుకుని హాయిగా డాన్స్ చేస్తా.