గాయని ఎస్.పి. జానకి

జానకి గొంతు ఓ గంగా ప్రవాహం.వయసుతో నిమిత్తం లేని ఆమె స్వరం ఓ కోయిలగానం. ఆమె పలుకు ఓ ప్రకృతి పులకింపు.
రూపంలొ 74 ఏళ్ళు కనిపిస్తాయేమోగానీ,ఆమె స్వరం మాత్రం 54ఏళ్ళుగా నిరంతరం వింటున్నా చైత్రమాసపు కోయిలగానం ఆమె స్వరం.సాధన సంగీతానికి ఆయువు పట్టయితే ఎస్ .జానకి ఆ సాధనకే ఓ ఉదాహరణ.

కోకిల స్వరంతో దక్షిణాది శ్రోతలను ఆకట్టుకున్న లెజండ్రీ నేపథ్య గాయని ఎస్.జానకి. తెలుగు, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషలతో పాటు అనేక భారతీయ భాషలలో తన కమ్మని స్వరంతో గేయాలను ఆలపించిన ఎస్. జానకికి నేడే పుట్టిన రోజు. గాయనిగా, సంగీత దర్శకురాలిగా 30వేల పాటలకు పైగా ఆలపించి సరికొత్త రికార్డు సృష్టించారు.

శ్రీకృష్ణుడు, సాయిబాబా భక్తులారైన జానకి.. మీరాపై అనేక భక్తిగీతాల క్యాసెట్లను విడుదల చేసింది. అలనాటి గాయకుడు ఘంటసాల పాటలకు గాయనిగా స్వరాన్నిచ్చి.. నేటి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం వరకు మధురమైన స్వరంతో సంగీత సముద్రంలో కడిగిన ముత్యంలా మెరుస్తున్న జానకి.. గుంటూరు జిల్లాల్లో పుట్టారు.

నాదస్వరం విద్వాన్ శ్రీ పైడిస్వామి వద్ద సంగీతం నేర్చుకున్న జానకి తన 19వ ఏటనే గాయనిగా అవతారమెత్తారు. మామయ్య సలహా మేరకు చెన్నైలోని ఏవీయం స్టూడియోలో పాడటం ఆరంభించిన జానకి.. తెలుగులో హిట్ అయిన ఎన్నో చిత్రాలకు పాటలు పాడారు. 1957వ సంవత్సరంలో తన కెరీర్‌ను ప్రారంభించిన జానకి.. తమిళం, తెలుగు సినిమాల కోసం తానే స్వయంగా పాటలు రాశారు.

ఆమె తొలిసారిగా నేపథ్యగానం చేసింది ‘విధియిన్ విళైయాట్టు’ అనే తమిళ చిత్రానికి. టి.చలపతిరావు సంగీతంలో ఓ శోకగీతంతో తన కెరియర్ ప్రారంభించారు.

రెండోసారి నేపథ్యగానం చేసిన సినిమా ‘ఎం.ఎల్.ఎ.’ అందులో ఘంటశాల గారితో కలిసి గానం చేసిన ఆ పాట కూడా శోక గీతమే ‘నీ యాసా ఆడియాసా, చేజారే మణిపూసా…

హిందీ, సిన్హాలే, బెంగాలి, ఒరియా, ఇంగ్లీష్, సంస్కృతం, తుళు, సౌరాష్ట్ర, జపనీస్, జర్మన్ భాషలు తెలిసిన జానకి, ఘంటసాల, డాక్టర్ రాజ్‌కుమార్, వాణి జయరాం, కె.జె. జేసుదాస్, ఎల్.ఆర్. ఈశ్వరి, పి. జయ చంద్రన్, పి.లీలా, కె.ఎస్. చిత్ర, సుజాత, జెన్సీ, పి.బి. శ్రీనివాస్, ఇళయరాజా, ఎస్.బి. బాలసుబ్రహ్మణ్యం వంటి పలువురు ప్రముఖ గాయకులతో పనిచేశారు.

“సప్తపది ” చిత్రం అనగానే ఎస్.జానకి..గళంలో వైవిధ్యభరితమైన పాటలు.. గుర్తొస్తాయి. జానకమ్మని.. విశ్వనాథ్ గారు…. ఎంతో ప్రశంసించారట. సినిమా పాటకి..ఎస్.జానకి.గళం.. “కామధేనువు” లాంటిదని.. ఏం కావాలంటే ఆ భావం ఒలికిన్చగల.. అత్యున్నత గాయని అన్న ప్రశంస తో..పాటు.. విశ్వనాథ్ గారు దర్శకత్వం వహించిన..ప్రతి చిత్రంలోనూ.. ఆమెతో.. పాటకి..పట్టం కట్టించారు.

ఎస్.జానకి అంటే సంగీత జానకిగా మారిన వైనం చూస్తే ఆమె తొలిసారిగా 1957లో ఓ తమిళ చిత్రానికి తొలిపాట పాడిన సంవత్సరమే 6భాషల్లొ 100పాటలకు పైగా పాడినా, ఆమె జీవితకాలంలో 15 భాషల్లో 15వేల పాటలు పాడినా,సినీపరిశ్రమలో 6తరాల కథానాయికలకు తన స్వరాన్ని అందించినా,”భారత కోయిల “గా బిరుదు సాధించినా,ఈమె ప్రయాణంలో ఎన్నో రాష్ట్రీయ,జాతీయ అవార్డులను కైవశం చేసుకొన్నా,ఇసుమంతైనా కూడా విరామమెరుగక నేటికీ సంగీత ప్రపంచంలో ఓ విధ్యార్ధియై వినయం ప్రదర్శిస్తూ సాధనను కొనసాగించడమే ఎస్.జానకి విజయానికి కారణం.అందుకే ఆమె జీవితం నేటియువ సంగీత కళాకారులకు ఎంతో ఆదర్శం.