HEROINES

Heroine Iswarya Rajesh

IMG_9798 IMG_9799

Heroine Sraddhakapoor (saaho)

సల్మాన్‌కి నో చెప్పాను!
సాహో సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతో శ్రద్ధాసక్తులతో ఎదురుచూస్తున్నారు. వాళ్ల ఆసక్తి ప్రభాస్‌ మీద అయితే… శ్రద్ధ మాత్రం శ్రద్ధా కపూర్‌ పైనే. ఈ బాలీవుడ్‌ ముద్దుగుమ్మ తొలిసారి ఓ తెలుగు సినిమాలో కనిపించబోతోంది. అందం, అభినయంతో ఉత్తరాదిలో ఇప్పటికే తనకంటూ ఒక ఇమేజ్‌ని సంపాదించుకున్న నటి శ్రద్ధ. సాహోలో ఆమె పాత్ర పోలీసు అధికారి అమృతా నాయర్‌ గురించి తెలుసుకునేముందు… శ్రద్ధ నిజ జీవిత పాత్ర గురించి తన మాటల్లోనే తెలుసుకుందామా!

నాన్న శక్తి కపూర్‌… సినిమా ప్రేక్షకులకు సుపరిచితమైన పేరు. అమ్మ శివాంగి… నటి, గాయని. లతా మంగేష్కర్‌కి దగ్గరి బంధువు. నేనూ చిన్నపుడు సంప్రదాయ సంగీతంలో శిక్షణ తీసుకున్నాను. చిన్నప్పట్నుంచీ సినిమా డైలాగులు చెప్పడం, పాటలకు డ్యాన్సులు చేయడం అలవాటైపోయింది. నాన్నతోపాటు షూటింగ్‌లకూ వెళ్లేదాన్ని. కానీ యాక్టింగ్‌ అంటే ఇష్టమైనా కూడా ఇంట్లో ఎప్పుడూ ఆ విషయం చెప్పలేదు. అమితాబ్‌ బచ్చన్‌, శ్రీదేవి, వహీదా రెహ్మాన్‌ నటులుగా నాకెంతో స్ఫూర్తి.  ఇవన్నీ కూడా నా సినిమా కలకు కారణమయ్యాయి. ఎక్కడ వద్దంటారోనని వాళ్లతో నా సినిమా ఇష్టాన్ని చెప్పేదాన్ని కాదు. నాకు పదహారేళ్లపుడు మా స్కూల్‌ నాటకంలో నన్ను చూసిన సల్మాన్‌ఖాన్‌ సినిమా ఆఫర్‌ ఇచ్చారు. కానీ నాకు అప్పుడు చదువుకోవాలని ఉండటంతో కాదనుకున్నాను. అమెరికాలోని బోస్టన్‌ యూనివర్సిటీలో సైకాలజీ చదవడానికి వెళ్లాను. ఫస్టియర్‌ పూర్తిచేసి వేసవి సెలవులకు ఇంటికి వచ్చాను. ఆ టైమ్‌లో ఫేస్‌బుక్‌లో నా ఫొటోలు చూసిన నిర్మాత అంబికా హిందుజా ‘తీన్‌ పత్తీ’లో చేస్తావా అని అడిగారు.
అమితాబ్‌, బెన్‌కింగ్స్‌లే, మాధవన్‌ ఆ సినిమాలో నటించారు. మంచి అవకాశం అనిపించింది. ఇంట్లో అప్పుడు చెప్పాను. నిజానికి నాది అందులో తక్కువ నిడివి ఉన్న పాత్ర. అయినా కథ నచ్చి చేశాను. కారణం ఏదైనా చదువు మధ్యలో వదిలేయకపోవడమే మంచిది. కాలేజీ రోజులు మన వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవడానికీ, ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికీ మంచి అవకాశం. దాన్ని మిస్సవకూడదెవరూ.

అవకాశాలు వరసకట్టలేదు…
నేనెవరో తెలియకుండానే మొదటి సినిమాలో అవకాశం వచ్చింది. అందులో అమితాబ్‌తో కలిసి చేసినపుడు చాలా నెర్వస్‌గా ఫీలయ్యాను. కానీ ఆయన చాలా అభిమానంగా, హోమ్లీగా ఉంటూ నా భయాన్ని పోగొట్టారు. రెండో సినిమా యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ ‘లవ్‌ కా ది ఎండ్‌’. దీనికి కూడా ఆడిషన్‌ చేశారు. ఈ రెండు సినిమాల తర్వాత కూడా ఆడిషన్స్‌ చేసి నన్ను తీసుకున్నవాళ్లు తిరిగి ఫోన్‌చేసి వద్దని చెప్పిన సందర్భాలున్నాయి. కుటుంబ నేపథ్యంకంటే కూడా మన సినిమాలు బాగా ఆడితేనే ఇక్కడ స్థానం, లేకుంటే కష్టం…
ఆ విషయం నాకు మొదట్లోనే అర్థమైంది. మూడో సినిమా ‘ఆషికీ 2’నే నా మొదటి సినిమా అనుకుంటారు చాలామంది.
యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌లో మూడు సినిమాలకు ఒప్పందం కుదిరింది. ‘లవ్‌ కా ది ఎండ్‌’ మొదటి సినిమా. అది అంతగా ఆడలేదు. తర్వాత ‘ఔరంగజేబ్‌’లో అవకాశం ఇచ్చారు. అదే టైమ్‌కి ‘ఆషికీ 2’ ఆఫర్‌ వచ్చింది.
ఈ కథ నాకు బాగా నచ్చడంతో ధైర్యంచేసి యశ్‌రాజ్‌… ఒప్పందం క్యాన్సిల్‌చేశాను. మోహిత్‌ సూరి దర్శకత్వంలో వచ్చిన ‘ఆషికీ 2’లో సింగర్‌గా కనిపించాను. సినిమా పెద్ద హిట్‌. అందులోని నా పాత్ర ‘ఆరోహీ’ పేరుతోనే నన్ను ఇప్పటికీ గుర్తుంచుకుంటారు. తర్వాత మోహిత్‌ దర్శకత్వంలోనే ‘ఏక్‌ విలన్‌’లో చేశాను. అది కూడా మంచి హిట్‌. నా మొదటి రూ.100 కోట్ల సినిమా అది. కమర్షియల్‌ సినిమాల పరంగా ముందుకు వెళ్తుండగా ప్రయోగాత్మక చిత్రం ‘హైదర్‌’లో ఛాన్స్‌ వచ్చింది. ఆ సినిమా కూడా మంచి హిట్‌. తర్వాత ‘ఏబీసీడీ 2’… ఇలా వరస హిట్‌లు వచ్చాయి. అదే సమయంలో తర్వాత వచ్చిన ‘రాక్‌స్టార్‌ 2’, ‘ఓకే జానూ’ అంతగా ఆడలేదు. గతేడాది వచ్చిన ‘స్త్రీ’తో మరో హిట్‌ అందుకున్నాను. హిట్‌లు ఆనందించడానికీ, ఫ్లాప్‌లు చింతించడానికీ కాదూ, అన్నీ నేర్చుకోవడానికే అన్నది నా సిద్ధాంతం.

కథల ఎంపిక…
ఏదైనా కథ విన్నాక ఆ పాత్రని నేను చేస్తే బావుంటుందా లేదా అని మాత్రమే ఆలోచిస్తాను తప్ప ఈ సినిమా చేస్తే నాకేం వస్తుందనే కోణంలో ఆలోచించను. మొదట్లోకంటే ఇప్పుడు ఒక పాత్రని ఎంచుకోవడంలో ఇంకొన్ని ఎక్కువ ప్రశ్నలు వేసుకుంటున్నాను.  దర్శకుడు నా పాత్రని బాగా చూపిస్తాడా, సెట్‌లో ప్రతిరోజునీ ఆస్వాదించగలనా లేదా అని కూడా చూసుకుంటాను. ఎందుకంటే ఒక్కో సినిమా మూడు నెలల నుంచి ఏడాదిపాటు ఉంటుంది. ఇష్టంలేకపోతే చేయడం కష్టం. అందుకే మనస్ఫూర్తిగా ఓకే అనుకుంటేనే చేస్తానని చెబుతాను. ఎప్పటికప్పుడు వినూత్నమైన పాత్రలు చేయకపోతే ప్రేక్షకులకే కాదు, నటులకీ బోర్‌ కొట్టేస్తుంది.
ఆ కోణంలోనూ ఆలోచిస్తాను.

నాన్నే చూసుకుంటారు…
నేను ఒంటరిగా ఉండగలనేమోనని పరీక్షించుకోవడానికి కొన్నేళ్ల కిందట ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నాను. ఒక నెలరోజులుండి చూద్దాం అనుకున్నాను. కానీ అది విమానాశ్రయానికి చాలా దగ్గరగా ఉండటంతో నిత్యం శబ్దాలతో నిద్ర పట్టేది కాదు. విషయం నాన్నకి తెలిసి వెంటనే జుహూలోని మా అపార్ట్‌మెంట్‌కి తీసుకువెళ్లారు. నెల అనుకున్నది వారం కూడా సాధ్యంకాలేదు. ఆర్థిక ప్రణాళికల్లో నేను ఇంకా పూర్‌. నా ఆర్థిక వ్యవహారాలన్నీ నాన్నే చూస్తారు. షాపింగ్‌ మాత్రమే నేను చేసుకుంటాను. మేం ఉంటున్న ఫ్లాట్‌కి పక్కనే సొంతంగా ఫ్లాట్‌ కొన్నాను. దాన్ని నా ఆఫీసులా ఉపయోగించుకుంటాను. ఫ్రెండ్స్‌తో భేటీలూ అక్కడే. భవిష్యత్తులో కూడా ఏం కొన్నా కొనకపోయినా స్థిరాస్తిలో మాత్రం పెట్టుబడి పెడతాను. ఇది నాన్న చూపిన బాట. ఆయన కూడా అందులోనే పెట్టుబడులు పెడుతూ వచ్చారు.

ఆయనతో సినిమా నా కోరిక
బాలీవుడ్‌లో ప్రముఖవ్యక్తుల నెట్‌వర్క్‌లో ఉంటేనే సినిమాలు వస్తాయని ప్రారంభంలో కొందరు సలహా ఇచ్చారు. కానీ అవసరం కోసం స్నేహాలు కలుపుకోవడం నాకు చేతకాదు. ‘ఏబీసీడీ 2’లో హిప్‌ హాప్‌ డాన్సర్‌గా చేశాను. అప్పుడే డాన్స్‌లో ఏబీసీడీలు నేర్చుకున్నాను. ‘హసీనా పార్కర్‌’ పాత్ర చేసినపుడు ఎనిమిది కిలోలు బరువు పెరగాల్సి వచ్చింది. వాళ్ల కుటుంబ సభ్యులతో కొద్దిరోజులు మాట్లాడాను. ఆమె గురించి చాలా చదివాను కూడా. ఏక్‌ విలన్‌, హైదర్‌,
ఏబీసీడీ 2, బాఘీ, రాక్‌ఆన్‌ 2, హాఫ్‌ గర్ల్‌ఫ్రెండ్‌ సినిమాల్లో పాటలూ పాడాను. అలా నా సినిమా కోసం చేయగలిగిందంతా చేస్తాను. ప్రస్తుతం ఛిఛోరే, స్ట్రీట్‌ డ్యాన్సర్‌ సినిమాలు చేస్తున్నాను.
సినిమాల్లోకి వచ్చి దశాబ్దం కావొస్తోంది. ఇప్పటివరకూ జర్నీ బాగుంది. ఎన్నో భిన్నమైన పాత్రలు చేశాను.  ఛాలెంజింగ్‌గా అనిపిస్తే నెగెటివ్‌ పాత్ర చేయడానికైనా సిద్ధమే. సంజయ్‌ లీలా భన్సాలీ సినిమాలో చేయాలన్నదే ఇక్కడ నాకింకా తీరాల్సిన కోరిక. సినిమాలవల్ల కొన్నిసార్లు కుటుంబ సభ్యుల్నీ స్నేహితుల్నీ మిస్సవుతాను. నేను వర్కహాలిక్‌. పనిని ప్రేమిస్తాను. పనిలో పడితే మిగతా ప్రపంచాన్ని మర్చిపోతాను. అలాకాకుండా పనినీ, వ్యక్తిగత జీవితాన్నీ సమంగా బ్యాలెన్స్‌ చేసుకోవాలన్నది నా కోరిక, ప్రయత్నం.

సాహో… ఎందుకంటే…

బాహుబలి ప్రభాస్‌ సరసన చేయడం, అదీ ప్రాధాన్యం ఉన్న పాత్ర దొరకడం, తెలుగు-హిందీ భాషల్లో చిత్రీకరించడంతోపాటు మరో రెండు దక్షిణాది భాషల్లోకి డబ్‌ కావడం… ఇవన్నీ ఒక్క సినిమాతో సాధ్యమవుతుంటే ఎవరు కాదంటారు.  దాదాపు రెండేళ్లపాటు సాహోతో ప్రయాణించాను. సెట్‌లో అడుగుపెట్టిన రోజునుంచే ఒక కుటుంబంతో ఉన్నట్టు ఫీలయ్యాను. ప్రభాస్‌ది చాలా కూల్‌ యాటిట్యూడ్‌. నిజాయతీగా, సరదాగా, స్నేహపూర్వకంగా ఉంటాడు. దర్శకుడూ, నిర్మాతలూ కూడా అంతే. దాదాపు సెట్‌లో ఉన్న ప్రతిరోజూ నాకు ఇంటి భోజనమే వచ్చేది.  నావల్ల ఎలాంటి ఆలస్యమూ, ఇబ్బంది ఉండకూడదని ప్రయత్నిస్తూ నాకిచ్చిన తెలుగు డైలాగుల్ని ఎంత కష్టమైనా కంఠతా చెప్పేసేదాన్ని. షూటింగ్‌ పూర్తయిన రోజున… ‘సినిమా అప్పుడే అయిపోయిందా’ అన్న భావన కలిగింది.  సినిమా రిలీజ్‌ దగ్గరపడుతున్నకొద్దీ నాకు టెన్షన్‌ పెరుగుతుంది, వణుకు మొదలవుతుంది. అవన్నీ ఓ చిరునవ్వు చాటున దాచేయాలని చూస్తానుకానీ కుదరదు. 24 గంటల ముందునుంచీ అమ్మని పట్టుకుని కూర్చుంటాను. ‘దేవుడా ఈ ఒక్కరోజునీ ఏదోలా ముందుకు నడిపించు, నన్ను గెలిపించు’ అని కోరుకుంటాను.

శాకాహారిగా మారిపోయా!

స్కూల్‌ రోజుల్లో నవలలు బాగా చదివేదాన్ని. సినిమాల్లోకి వచ్చాక టైమ్‌ అంతగా దొరకడంలేదు. రెండేళ్లుగా మళ్లీ చదవడం ప్రారంభించాను. ఆ తర్వాత నా జీవనశైలిలో కొన్ని మార్పులు వచ్చాయి. వెజిటేరియన్‌గా మారాను.
* ఒకట్రెండు రోజులు టైమ్‌ దొరికితే ఇంట్లో ఉంటూ కుటుంబ సభ్యులూ, ఫ్రెండ్స్‌తో కాలక్షేపం చేస్తాను. సినిమాలు చూస్తాను.
* ఎప్పుడైనా బ్రేక్‌ తీసుకుని విహారానికి వెళ్తే రోజంతా హోటల్‌ రూమ్‌లోనే ఉండి… సాయంత్రాలు మాత్రమే బయటకు వెళ్తాను. అప్పటివరకూ హోటల్‌లో రకరకాల రుచుల్ని ఆస్వాదిస్తాను. ఎక్కడికి వెళ్లినా జ్ఞాపకంగా ఏదో ఒక వస్తువుని నాతోపాటు తెస్తాను.
* స్కూల్‌ రోజుల్లో ఒకబ్బాయిమీద క్రష్‌ ఉండేది. సినీ హీరోల్లో హృతిక్‌రోషన్‌ అంటే క్రష్‌. అది ఎప్పటికీ పోదేమో!
* ఇన్‌స్టాగ్రామ్‌లో నావి ఫ్యాషన్‌ ఫొటోలకంటే కూడా సాధారణమైన ఫొటోలే పెడతాను. అక్కడైనా నన్ను నేనో మామూలు వ్యక్తిగా చూసుకోవాలనుకుంటాను.
* పుకార్లని అస్సలు పట్టించుకోను.  ఎవరో ఏదో రాస్తారు, అవన్నీ పట్టించుకుని వాటికి తగ్గట్టు నన్ను మార్చుకోలేను.
* టొమాటో, పెరుగు మిశ్రమంతో ఫేస్‌ప్యాక్‌ చేయించుకుంటాను. ఇంట్లో కలబంద మొక్క ఉంది. తరచూ కలబంద గుజ్జు రాస్తాను. అవి నా చర్మానికి అద్భుతంగా పనిచేస్తాయి.
* అమ్మచేసే సంప్రదాయ మహారాష్ట్రియన్‌ ఫుడ్‌ బాగా ఇష్టం.
* పరిశ్రమలో వరుణ్‌ ధావన్‌, మోహిత్‌ సూరి, ఆదిత్య కపూర్‌… నాకు మంచి మిత్రులు.
* తనకంటూ ఒక గుర్తింపుతోపాటు మంచి వ్యక్తిత్వం ఉండే వ్యక్తినే పెళ్లిచేసుకుంటా. అది ఎప్పుడన్నది చెప్పలేను.
* నటిని కాకపోతే గాయనినయ్యేదాన్ని.

Heroine Srutisarma (agent sai srinivasa atreya)

3a6a4008-e5bd-49d6-8c38-352f32afd27d

Heroine Niveda Thomas

 

5ea01b15-de3e-49c9-ab64-14aec38715b7

 

 


అవే నా డ్రీమ్‌ రోల్స్‌!
 

వరస విజయాలతో వెండితెరపైన దూసుకెళుతోంది నివేదా థామస్‌. తాజాగా ‘బ్రోచేవారెవరు’లో మెప్పించిన ఈ అందాల  భామ తన  ఇష్టాయిష్టాల గురించి ఏం చెప్పిందంటే…

డ్రీమ్‌ రోల్స్‌


‘పద్మావత్‌’లో దీపికా పదుకొణె, ‘తను వెడ్స్‌ మను’లో కంగన రనౌత్‌ పోషించిన పాత్రల వంటివి చేయాలని కోరిక.

అభిమానం


ఏఆర్‌ రెహమాన్‌కు వీరాభిమానిని. ప్రయాణంలో రెహమాన్‌ సంగీతం విని సేద తీరుతుంటా.

ఒత్తిడిగా అనిపిస్తే…
గరిటె తిప్పుతా. నాకు వంట బాగా వచ్చు. చిన్నప్పుడే అమ్మ నేర్పించింది.
ఓ సరదా


వర్షం పడుతుంటే బాల్కనీలో నిల్చునో, బీచ్‌లో గొడుగు కింద కూర్చునో మసాలా చాయ్‌ తాగడం నాకు భలే సరదా. కానీ వరస సినిమాల వల్ల కుదరట్లేదు.

నచ్చే తారలు


అందాల తార శ్రీదేవి అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు టీవీలో రజినీకాంత్‌ సినిమాలు వస్తుంటే రెప్పవాల్చకుండా చూసేదాన్ని. కమల్‌హాసన్‌ నటన అంటే పడిచచ్చిపోతా.

నైట్‌లైఫ్‌
అప్పుడప్పుడూ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌పైన రైడ్‌కి వెళుతుంటా. హెల్మెట్‌ పెట్టుకుంటా కాబట్టి ఎవరూ గుర్తు పట్టరు.
ఇష్టంగా తినేది


కేరళ స్పెషల్‌ అప్పం అంటే ఎంతిష్టమో. ఇంట్లో ఉంటే అమ్మతో రోజూ చేయించుకుని తింటా. హైదరాబాద్‌లో ఉంటే ఉలవచారు రుచి చూడాల్సిందే. చెబితే నమ్మరు ఆ పేరు తలచుకుంటేనే నాకు నోరూరిపోతుంది.

నచ్చే సినిమా


కమల్‌హాసన్‌, సరిత నటించిన ‘మరో చరిత్ర’ బాగా నచ్చుతుంది. ఎన్నిసార్లు చూశానో లెక్కేలేదు. సరిత వాయిస్‌లో ఏదో తెలియని ఫీల్‌ ఉన్నట్టు అనిపించింది.

ఆరోగ్య రహస్యం
బ్యాడ్మింటన్‌ నా ఫిట్‌నెస్‌ రహస్యం. షూటింగ్‌ అయ్యాక అరగంటైనా ఆడతా. ఈ మధ్య ఓ అకాడమీలో కూడా చేరా. మాట్లాడే భాషలు మలయాళం, తమిళం, హిందీ, ఇంగ్లిష్‌, తెలుగు భాషల్లో స్పష్టంగా, వేగంగా మాట్లాడగలను.
నచ్చే హాలిడే స్పాట్‌


బ్రెజిల్‌, ఇటలీ రాజధాని రోమ్‌లంటే చాలా ఇష్టం. ఎక్కువ రోజులు సమయం దొరికితే కుటుంబంతో కలిసి వెళ్లాలనుకుంటున్నా.

నటికాకపోయుంటే
ఆస్ట్రోనాట్‌ అయ్యేదాన్ని. ఒకవేళ అదీ కుదరకపోతే నాకు ఇష్టమైన ఆర్కిటెక్చర్‌ సబ్జెక్టును బోధించేదాన్ని. చదువు ఈ మధ్యనే బీటెక్‌(ఆర్కిటెక్చర్‌) పూర్తైంది. ఇంకా చదవాలనుంది కానీ సమయం దొరకట్లేదు.

Heroine Surabhi

af4c8cbe-e821-416e-9659-19794eee2686

Heroine Niveda Pethuraj

మల్లయుద్ధం నేర్చుకుంది!
 

 

కొన్ని సినిమాలంతే. వెండితెరపైకి వచ్చినప్పుడు పెద్దగా మెప్పించలేకపోయినా… యూట్యూబ్‌ వీడియోలతో అందరి మనసుల్నీ దోచేస్తాయి. విజయ్‌ ఆంటోనీ ‘రోషగాడు’ అలాంటిదే. ముఖ్యంగా… అందులో హీరోతో కలిసి పోలీసు హెడ్‌ కానిస్టేబుల్‌గా నివేదా పెత్తురాజ్‌ చేసిన నటనా, తన డైలాగులూ నెటిజన్ల మధ్య ‘షేర్‌’లుగా చక్కర్లు కొడుతున్నాయి. అంతకుముందు ‘మెంటల్‌ మదిలో’ చిత్రంలోనూ, ఆ తర్వాత ‘చిత్రలహరి’లోనూ ఆకట్టుకున్న నివేదా తాజాగా ‘బ్రోచేవారెవరురా’ చిత్రంతో మన ముందుకొచ్చింది.తన గురించిన విశేషాలివి…

అల్లరి చేశారో… అంతే!నివేదా పెత్తురాజ్‌కి మార్షల్‌ ఆర్ట్స్‌పైన చాలా ఆసక్తి. అదీ కరాటే, కుంగ్‌ఫూ, టేక్వాండోలాంటి పాతవాటిని వదిలి… జపాన్‌కి చెందిన జుజిట్సూ యుద్ధవిద్య నేర్చుకుంది. అంతేకాదు, తను మల్లయోధురాలు కూడా! ఈ రెండూ తనకి ధైర్యాన్నే కాదు… ఫిట్‌నెస్‌నీ అందిస్తున్నాయంటుంది నివేద. ఇక మోడలింగ్‌ కోసమంటూ డాన్స్‌ కూడా నేర్చుకుంది. అంతేకాదండోయ్‌, చిత్రలేఖనంలోనూ ప్రవేశం ఉంది.
బైకు వెనక హీరోగారు!అన్నట్టు నివేదాకి ఫార్ములా వన్‌ రేసింగ్‌లోనూ ప్రవేశం ఉంది. ‘రోషగాడు’ సినిమాలో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైకు నడపడానికి అదెంతో ఉపయోగపడిందట. ‘హీరో విజయ్‌ ఆంటోనీని వెనక కూర్చోబెట్టుకుని బండి నడిపే ఓ పె…ద్ద షాట్‌ షూట్‌ చేయాల్సి వచ్చింది. దానికి ఐదుగంటలు పట్టింది. అంతసేపు, నేనెలా నడుపుతానా అని అందరిలోనూ ఆందోళనే… ఒక్క నాలో తప్ప!’ అని నవ్వేస్తుంది నివేద.
తెలుగు సంగతులేమిటంటే…

‘తెలుగులో నా మొదటి హీరో శ్రీవిష్ణు. ‘మెంటల్‌ మదిలో’ షూటింగ్‌ ప్రారంభమైనప్పుడు పలకరిస్తే తలెత్తకుండా నేల చూపులు చూస్తూ మాట్లాడేవాడు. అడిగిందానికి మాత్రమే సమాధానం చెప్పేవాడు… తడబడుతూ! అలాంటివాణ్ణి నేనూ, అమృతా (మరో హీరోయిన్‌) కలిసి షూటింగ్‌ ముగిసే నాటికంతా చాలా జోవియల్‌గా మార్చేశాం!’ అంటుంది నివేద.

మిస్‌ ఇండియానే కానీ…నివేద పుట్టింది మదురైలో. తర్వాత వాళ్లనాన్న పెత్తురాజ్‌కి దుబాయ్‌లో ఉద్యోగం రావడంతో కుటుంబం అక్కడే స్థిరపడింది. పద్దెనిమిదేళ్లప్పుడు మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది. 2015లో ‘మిస్‌ ఇండియా యూఏఈ’గా ఎంపికైంది. ఆ విజయమే తమిళంలో… ఆ తర్వాత తెలుగులోనూ అవకాశాల్ని సాధించిపెట్టింది.
ఓ విషాదం ఉంది…ఎప్పుడూ ఎంతో చలాకీగా, నిర్భయంగా మాట్లాడే నివేదా… చిన్నప్పుడు లైంగిక వేధింపులకి గురైంది. ‘అప్పుడు నాకు ఐదేళ్లుంటాయి. మాదగ్గరి బంధువొకడు ఆ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అసలేం జరుగుతోందో కూడా నాకు ఎనిమిదేళ్లదాకా తెలియదు. తెలిశాకా అమ్మానాన్నలకి ఎలా చెప్పాలో అర్థం కాలేదు!’ అంటుంది నివేద. అందుకే ‘తల్లిదండ్రులు తమ రెండేళ్ల చిన్నారులనైనా సరే… ప్రతి విషయం అడిగి తెలుసుకోవాలి’ అంటూ సలహా ఇస్తుంటుంది.
అది లక్కీ పేరట!

అవకాశాల కోసం చూస్తున్న కొత్తల్లో ‘నీ పేరు వెనక ‘పెత్తురాజ్‌’ అని మీ నాన్న పేరు కూడా ఉండాలా. మోడర్న్‌గా లేదుకదా!’ అని చాలామంది అడిగారట. మొదట్లో డైలమాలో పడ్డ నివేద చివరికి పేరుని యథాతథంగా ఉంచాలనే చెప్పిందట. ఆ పేరుతోనే సక్సెస్‌ అయ్యింది. ఆ మధ్య తనకి సంబంధించిన వికీపీడియా పేజీ కూడా మొదలయ్యాక వాళ్లనాన్న ‘చూశావా నా పేరు నీకెంత లక్కీయో! దానివల్లే నువ్వు సెలబ్రిటీ అయిపోయావ్‌!’ అంటూ ఆటపట్టిస్తున్నాడట.

 

Heroine రుక్సార్‌ థిల్లాన్‌..

పాకెట్‌ మనీ సంపాదించుకునేదాన్ని

లండన్‌లో పుట్టి.. బెంగళూరులో స్థిరపడ్డ పంజాబీ అమ్మాయి రుక్సార్‌ థిల్లాన్‌… చెఫ్‌ కావాలనుకొని.. ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సు చేసి అనుకోకుండా తెరంగేట్రం చేసేసింది… ఆకతాయిగా పరిచయమై.. కృష్ణార్జున యుద్ధంతో మెప్పించి.. ఏబీసీడీతో మరోసారి మనముందుకొచ్చింది రుక్సార్‌ థిల్లాన్‌… అవకాశం ఈజీగా వచ్చినా.. దాన్ని నిలబెట్టుకోవాలంటే హార్డ్‌వర్క్‌ తప్పదంటున్న రుక్సార్‌ తన నేపథ్యం, కాలేజీ కబుర్లు, సినిమాలపై మమకారం గురించి ఇలా చెబుతోంది.

అనుకోకుండా అడుగులు: పెద్దయ్యాక హీరోయిన్‌ అయిపోవాలని నేనెప్పుడూ కలలు కనలేదు. అనుకోకుండానే సినిమా అవకాశం పలకరించింది. ఆ తర్వాత మాత్రం వందశాతం మనసుపెట్టి పని చేస్తున్నా. ఏదైనా క్రియేటివ్‌ ఫీల్డ్‌ ఎంచుకోవాలనీ, నేనేంటో నిరూపించుకోవాలని చిన్నప్పట్నుంచీ చాలా ఆసక్తిగా ఉండేది. మంచి చెఫ్‌ కావాలనీ, హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు చేసి స్టార్‌ హోటళ్లలో పని చేయాలనీ అనుకునేదాన్ని. కానీ దానికి భిన్నంగా, నా ప్రమేయం లేకుండానే సినిమాల్లోకి వచ్చా.

మొదటి అవకాశం: కాలేజీలో ఉన్నపుడు ‘మిస్‌ బెంగళూరు’ పోటీలు జరుగుతున్నాయి. ఫ్రెండ్స్‌ ప్రోత్సాహంతో సరదాగా ప్రయత్నించా. సెకండ్‌ రన్నరప్‌గా నిలిచా. ‘కళ్యాణ సిల్క్స్‌’ యాడ్‌ అవకాశమొచ్చింది. అది చెప్పలేనంత పేరు తీసుకొచ్చింది. తర్వాత ఇతర మోడలింగ్‌ అవకాశాలు వచ్చినా గ్రాడ్యుయేషన్‌ పూర్తయ్యేదాకా ఏవీ చేయకూడదని వదులుకున్నా. అనుకున్నట్టే చదువు పూర్తి చేశా. తర్వాత కొందరు కన్నడ దర్శకుల నుంచి పిలుపొచ్చింది. ‘ఎంతో కష్టపడితేగానీ ఇలాంటి అవకాశం రాదు. నిన్ను పిలిచి హీరోయిన్‌ చేస్తానంటున్నారు. అస్సలు వదులుకోవద్దు’ అన్నారు సన్నిహితులు. ఇంకేం.. నేను హీరోయిన్‌ అయిపోయినట్టేనని సంతోషంగా వెళ్లా. కానీ అక్కడికెళ్లాక ఆడిషన్‌ చేశారు. నటించి చూపించమన్నారు. ఫొటోషూట్‌ తీసుకున్నారు. ఎమోషన్స్‌లో సరిగా పలుకుతున్నాయో, లేదో పరిశీలించారు.. ఇవన్నీ నచ్చాకే మొదటి అవకాశం ఇచ్చారు. అలా ‘రన్‌ ఆంటోనీ’తో తొలిసారి తెరపై కనిపించా. ఆపై ఆకతాయి, కృష్ణార్జునయుద్ధం సినిమాలతో తెలుగువాళ్లకి దగ్గరయ్యా.

లండన్‌లో పుట్టా: అమ్మానాన్నలు లండన్‌లో ఉన్నపుడు నేను అక్కడే పుట్టా. తర్వాత వాళ్లు వ్యాపారం కోసం గోవాకి వచ్చారు. తొమ్మిదో తరగతి వరకు మనోవికాస్‌ ఇంగ్లిష్‌ మీడియం స్కూళ్లో చదువుకున్నా. తర్వాత నా చదువుకోసం బెంగళూరుకి వచ్చి ఇక్కడే స్థిరపడ్డాం. నేనేం చేసినా బాగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటానని అమ్మానాన్నలకు నాపై నమ్మకం. ఇది చేయాలి.. అది చేయొద్దని ఎప్పుడూ ఆంక్షలు విధించలేదు. చదువు, కెరీర్‌ విషయాల్లో నీకు నచ్చిందే చెయ్‌మన్నారు. సినిమాల్లోకి వెళ్తానన్నప్పుడు కూడా అభ్యంతరం చెప్పలేదు. మా కుటుంబానికెలాంటి సినిమా నేపథ్యం లేకపోయినా బాగా ప్రోత్సహించారు.

కాలేజీ రోజులు: అందిరిలాగే కాలేజీ రోజులు నా జీవితంలో గోల్డెన్‌ డేస్‌గా చెప్పుకోవచ్చు. కాలేజీలో ఉన్నపుడే అందాల పోటీల్లో గెలవడం జీవితంలో మర్చిపోలేని రోజు. చదువుల్లో ముందుండేదాన్ని. తరగతిలో టీచర్లకి నేను ‘గుడ్‌ గాళ్‌’ని. సినిమాలు, పార్టీల కోసం క్లాస్‌లు బంక్‌ కొట్టిన సందర్భాల్లేవు. ఇద్దరు అబ్బాయిలు వెంటపడ్డారు. లవ్యూ అన్నారు. అదంతా సరదాసరదాగా ఉండేదే తప్ప నన్నెవరూ సీరియస్‌గా లవ్‌ చేయలేదు. నేనూ ప్రేమలో పడలేదు.

మర్చిపోలేను: ఎలాంటి సినిమా నేపథ్యం లేని కుటుంబం మాది. పెద్దగా కష్టపడకుండా అవకాశమొచ్చింది. మొదటి అవకాశం, మొదటిసారి కెమెరా ముందు నిల్చున్నపుడు, మొదటి సాంగ్‌ చిత్రీకరణ, వందల మందితో కలిసి పనిచేయడం, పరాయి రాష్ట్రమైనా తెలుగు జనం నన్ను ఆదరించడం.. ఇవన్నీ మర్చిపోలేని క్షణాలే. ఒక్కోసారి అదృష్టంకొద్దీ తేలిగ్గానే మనకు మంచి అవకాశాలొస్తుంటాయి. వాటిని నిలబెట్టుకోవాలంటే మాత్రం బాగా కష్టపడాలి. నేను మిడిల్‌క్లాస్‌ అమ్మాయినైనా నాలో ఆత్మవిశ్వాసం ఎక్కువ. చదువుకుంటున్నపుడే చిన్నచిన్న పనులు చేస్తూ పాకెట్‌మనీ సంపాదించుకునేదాన్ని. నిజాయతీగా, కష్టపడి పని చేస్తే ఏ అమ్మాయైనా అనుకున్నది సాధించగలదు.
* బెంగళూరు యూనివర్సిటీలో ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సు చేశా.
* రుక్సార్‌ అనే పేరుకి గులాబీ రంగు చెక్కిళ్లు అని అర్ధం.
* ఖాళీగా ఉన్నప్పుడు వంట చేస్తా. అది ఒత్తిడి ఉపశమనంలా పని చేస్తుంది.
* టాలీవుడ్‌లో నేను కలిసి పనిచేయాలనుకునే హీరోలు మహేశ్‌బాబు, అల్లు అర్జున్‌.
* యాక్టింగ్‌ కాకుండా బొమ్మలు బాగా వేస్తాను.

- శ్రీనివాస్‌ బాలె

 

Heroine Anu immanyuel

 

విని వదిలేయాలి… అంతే!
27-10-2018 23:48:43
చెంపకు చారడేసి కళ్లు… పెదవంచున సన్నటి నవ్వు.. మత్తుమత్తుగా వినిపించే హస్కీ వాయిస్‌.. చీరకట్టులోనూ, బికినీలోనూ మెప్పించే టాలెంట్‌.. ఇన్ని లక్షణాలను సొంతం చేసుకున్న అనూ ఇమ్మాన్యుయేల్‌ ‘నవ్య’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ విశేషాల సమాహారం..
హాయ్‌ అనూ ఎలా ఉన్నారు?
అనూ : ఐయామ్‌ గుడ్‌ అండీ!
తెరపై మీరు బాగా తెలుసు. కానీ, తెరవెనుక ఇంట్లో అనూ ఎలా ఉంటారు?
అనూ : నేను చాలా బోరింగ్‌ పర్సన్‌ని. చదువుకునే రోజుల్లోనైనా, సినిమాల్లోకి వచ్చిన తర్వాత అయినా ఖాళీ ఉంటే రోజంతా ఇంట్లోనే ఉండటానికి ఇష్టపడతా. నా పెట్‌డాగ్‌తో ఆడతా. లేదంటే ఒంటరిగా కూర్చుని సినిమాలు చూస్తా. అయినా బోర్‌ కొడితే.. ప్రశాంతంగా నిద్రపోతా. సాయంత్రం సమయంలో షాపింగ్‌కు వెళ్లడమంటే ఇష్టం. పుస్తకాల పురుగును కాదు. కానీ నచ్చిన పుస్తకం చదవడంలో ఉన్న కిక్‌ను బాగా ఎంజాయ్‌ చేస్తా. పర్సనాలిటీ డెవల్‌పమెంట్‌ పుస్తకాలు ఎక్కువగా చదువుతా. వాటి నుంచీ చాలా నేర్చుకుంటా. ఓప్రా విన్‌ఫ్రే రచించిన ‘వాట్‌ ఐ నో ఫర్‌ ష్యూర్‌’ నన్ను చాలా ప్రభావితం చేసిన పుస్తకం. వజ్రాలు కావాలా? పప్పీ్‌స(పెట్‌డాగ్స్‌) కావాలా? అంటే పప్సీస్‌ కావాలని కోరుకుంటా.
మీ ఫ్యామిలీ గురించి చెబుతారా?
అనూ : నాన్న తంగచ్చిన్‌ ఇమ్మాన్యుయేల్‌ కేరళలోని కొట్టాయమ్‌కు చెందిన వ్యక్తి. అమ్మ అక్కడే ఆసుపత్రిలో ఉద్యోగి. కొంతకాలం అమెరికాలో ఉన్నాం. నేను పుట్టి పెరిగిందీ, చదువుకుందీ అంతా అమెరికాలోనే! నాకొక అన్నయ్య ఉన్నాడు. ప్రస్తుతం బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ చేస్తున్నాడు. నాన్నకూ, నాకూ సినిమాలంటే చాలా ఇష్టం. ఆయన మలయాళ చిత్రాల నిర్మాత కూడా. ఆరేడేళ్ల వయసు నుంచీ నాకు సినిమాల్లో నటించాలని ఆశ. చిన్నప్పటి నుంచీ నాన్నంటే చాలా భయం. అందుకే సినిమాల ప్రస్తావన ఆయన దగ్గర తీసుకురాలేదు.
2011లో నాన్న నిర్మించిన ‘స్వప్న సుందరి’ సినిమాలో హీరోకి కూతురిగా నటించే అవకాశం ఇచ్చారు. ఆ సినిమా కోసం అమెరికాలోని డల్లాస్‌ నుంచీ కేరళకు వచ్చా. ఎందుకో ఆ షూటింగ్‌నూ, సినిమానూ ఎంజాయ్‌ చెయ్యలేకపోయా. లాభం లేదనుకుని అమెరికా ఫ్లైట్‌ ఎక్కేశా. అక్కడే చదువు కంటిన్యూ చేశా. చిన్నప్పటి నుంచీ నా తల్లితండ్రులు నచ్చింది చేసే స్వేచ్ఛనిచ్చి పెంచారు. యాక్టింగ్‌ కెరీర్‌గా ఎంచుకోవడం కూడా నా ఇష్టప్రకారమే జరిగింది. వాళ్లు నన్ను ఎంకరేజ్‌ చేశారు.
అసలు హీరోయిన్‌గా మీ ఎంట్రీ ఎలా జరిగింది?
అనూ : ఓ సందర్భంలో నాన్నకు తెలిసిన ఓ మ్యాగజైన్‌ ఎడిటర్‌తో మాట్లాడి నా ఫొటోను కవర్‌ పేజీగా వేయించారు. ఆ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. దాన్ని చూసి మలయాళ హీరో నివిన్‌ పాల్‌ నన్ను సంప్రతించారు. స్కైప్‌లో ఆడిషన్‌ చేసి ‘యాక్షన్‌ హీరో బిజు’లో హీరోయిన్‌గా అవకాశం ఇచ్చారు. అలా కథానాయికగా మొదటి అవకాశం అందుకున్నా. ఏదన్నా చెయ్యాలని గట్టిగా సంకల్పించుకుంటే అది తప్పకుండా జరుగుతుందని మొదటి అవకాశం అందుకున్నాక అర్థమైంది.
తొలి తెలుగు అవకాశం ఎలా వచ్చింది?
అనూ : తెలుగులో నేను సైన్‌ చేసిన మొదటి సినిమా ‘ఆక్సిజన్‌’. విడుదలైంది మాత్రం నానితో నటించిన ‘మజ్ను’. ఇన్‌స్టాగ్రామ్‌లో నా ఫొటోలు చూసి దర్శకుడు విరించి వర్మ ఆడిషన్‌ చేశారు. ‘మజ్ను’లో కిరణ్మయి పాత్రకు సూటవుతానని నమ్మి అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’, ‘అజ్ఞాతవాసి’, ‘నా పేరు సూర్య’లో నటించా.
‘మజ్ను’ మినహాయిస్తే మీరు నటించిన చిత్రాలు అంతగా సక్సెస్‌ కాలేదు. అయినా స్టార్‌ హీరోల సరసన వరుసగా అవకాశాలు రావడం అంత తేలిక కాదేమో కదా…
అనూ : సక్సెస్‌ లేకుండా సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు అందుకోవడం కష్టమే. సినిమా ఫెయిల్‌ అయినంత మాత్రాన అందులో నటీనటులు, వారి నటన ఫెయిల్‌ అయిందనుకోకూడదు. వాటిలో నా నటన నచ్చబట్టే స్టార్‌ల పక్కన అవకాశాలు వచ్చాయని నేననుకుంటున్నా. చేసిన పాత్ర పండినా సినిమాకు టాక్‌ బాగోకపోతే సంతృప్తి ఉండదు. అది నాకూ ఉంది. కష్టాల నుంచే సక్సెస్‌ మొదలవుతుందని భావిస్తున్నా. అపజయం నేర్పించే పాఠం ఎప్పటికీ మరచిపోలేం.
సూపర్‌హిట్‌ ‘గీత గోవిందం’లో హీరోయిన్‌గా చెయ్యలేకపోయినందుకు ఫీలయ్యారా?
అనూ : చాలా ఫీలయ్యా. ‘గీత గోవిందం’లో కథానాయికగా ఫస్ట్‌ చాయిస్‌ నేనే. కానీ అదే సమయంలో ‘నా పేరు సూర్య’ సినిమా చెయ్యడం వల్ల డేట్స్‌ క్లాష్‌ అయ్యాయి. అందుకే ఆ సినిమా చెయ్యలేకపోయా. కానీ దర్శకుడు పరశురామ్‌గారు అతిథి పాత్ర ఇచ్చారు. అదైనా దక్కినందుకు ఆనందంగా ఉంది. ఫైనల్‌గా చూస్తే ‘గీత గోవిందం’ పాత్ర మిస్‌ అవ్వడం చాలా బాధగా ఉంది.
ఓ సినిమా అంగీకరించాలంటే మీరిచ్చే ప్రాధాన్యం దేనికి?
అనూ : ఒక సినిమాకు సైన్‌ చెయ్యాలంటే ఒక్క ఎలిమెంట్‌ని బేస్‌ చేసుకోకూడదు. సినిమాకు కథ ఎంత ముఖ్యమో.. హీరో, డైరెక్టర్‌, బ్యానర్‌ అన్నీ పక్కాగా కుదిరితేనే అది మంచి సినిమా కాగలదు. ‘అజ్ఞాతవాసి’ అంగీకరించడానికి కారణం స్టార్‌ హీరో, పవన్‌కల్యాణ్‌ ఉన్నారనో, స్టార్‌ డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ ఉన్నారనో చెప్పొచ్చు. కానీ నేను వారితోపాటు కథ గురించి ఆలోచించి ఓకే చేశా. ‘అత్తారింటికి దారేది’లోని హీరోయిన్‌ ప్రణీత తరహా పాత్ర అయితే నేను చెయ్యనని ముందే చెప్పేశా. అలా ఉండదని త్రివిక్రమ్‌గారూ మాటిచ్చారు. ఆ సినిమా సరిగ్గా ఆడలేదేమో కానీ నాకు కీర్తీసురేశ్‌కూ మంచి పేరే వచ్చింది.
‘అజ్ఞాతవాసి’ మినహా అన్ని సినిమాల్లోనూ లిప్‌లాక్‌ చేసినట్టున్నారు?
అనూ : కమర్షియల్‌ సినిమాకు గ్లామర్‌ హంగు ఉండాలన్నది ఓ సూత్రం. కాబట్టి కథ డిమాండ్‌ మేరకు స్కిన్‌ షో, లిప్‌లాక్‌ తప్పనిసరి. మీరు బాగా గమనిస్తే కావాలని ఇరికించినట్టు ఎక్కడా అనిపించవు.
సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాక మీలో వచ్చిన మార్పు?
అనూ : పెద్ద మార్పేమీ లేదు. నేను నాలాగే ఉండటానికి ఇష్టపడతా. అలాగే ఉన్నా. పరిస్థితుల్ని బట్టి మారాలి, మార్పును స్వీకరించాలని ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. ఎక్కడి నుంచో వచ్చినవాళ్లు ఏ సపోర్టూ లేకుండా ఇక్కడ ఎదగడం అంత ఈజీ కాదు. చాలా కృషి చెయ్యాలి. ఏ ఇండస్ట్రీలోనైనా ఓ సాధారణ మనిషి ఎదగాలి అంటే చుట్టూ ఉన్న మనుషుల్ని హ్యాండిల్‌ చెయ్యడం నేర్చుకోవాలి. నేను భయపడేది ఫెయిల్యూర్‌కి మాత్రమే! ఈ ఫీల్డ్‌లో జయాపజయాలు సహజం. ఏదీ మన చేతిలో ఉండదు. సక్సెస్‌ వస్తే ‘గోల్డెన్‌ లెగ్‌,’ లేకపోతే ‘ఐరెన్‌లెగ్‌’ అంటారు. ఇలాంటి వాటిని జయించాలనే తపన బాగా పెరిగింది. కొన్ని సందర్భాల్లో వీటిని విని వదిలేయాలి తప్ప ఇంటి వరకూ తీసుకెళ్లకూడదనిపిస్తుంది. కంట్రోల్‌ చెయ్యడం కూడా ఎవరి వల్లా కాదని నా ఫీలింగ్‌. ఇలాంటి వాటిని మరచిపోవడానికి నేను చదివిన సైకాలజీ బాగా ఉపయోగపడుతుంది.
నటిగా ఎవరి ప్రభావమైనా మీపై ఉందా?
అనూ : అలాంటిదేమీ లేదు. నటి అయినా, వేరే రంగంవారైనా వాళ్లకంటూ ఓ స్టైల్‌ ఉండాలని నమ్ముతా. మరొకరిని చూసి ఇన్‌స్పైర్‌ కావచ్చు. కానీ అది అన్ని సందర్భాల్లోనూ కాకూడదు. నాకు శ్రీదేవి, మాధురీ దీక్షిత్‌, సమంత అంటే చాలా ఇష్టం. నటిగా ఉన్నతమైన స్థాయిలో ఉండాలన్నది నా ఆకాంక్ష.
డ్రీమ్‌ రోల్స్‌ ఏమన్నా ఉన్నాయా?
అనూ : డ్రీమ్‌ రోల్స్‌ ఏమీలేవు కానీ ‘మహానటి’లో కీర్తీ సురేశ్‌ చేసిన పాత్ర కోసం ఎదురుచూస్తున్నా. ఆ పాత్ర తనను ఎక్కడికో తీసుకెళ్లిపోయింది. ఆర్టిస్ట్‌ కెరీర్‌ టర్న్‌ అవ్వాలంటే అలాంటి ఓ క్యారెక్టర్‌ పడాల్సిందే. నాకు ప్రయోగాలు చెయ్యాలని లేదు. ఎవర్నీ పోటీగా భావించను. ఇంకా నేను నేర్చుకునే దశలోనే ఉన్నాను.
మీలో మీకు ప్లస్‌ అనిపించేది?
అనూ : ఇండిపెండెంట్‌గా ఉండటం, బోల్డ్‌నెస్‌ నాలో నాకు నచ్చిన గుణాలు. ఇక నాలో ప్లస్‌ పాయింట్‌ అంటే నా కళ్లే. అవి పెద్దగా, గుండ్రంగా ఉంటాయని చిన్నప్పటి నుంచీ అందరూ చెబుతుంటారు. సినిమా అభిమానుల నుంచి వచ్చిన కాంప్లిమెంట్‌ కూడా అదే. పైకే ఇగోయి్‌స్టలా కనిపిస్తాను కానీ లోపల జాలి గుణం కాస్త ఎక్కువే.
మీ హీరోల స్వభావాల్లో మీకు నచ్చింది?
అనూ : నేను పని చేసిన ప్రతి హీరోలోనూ డెడికేషన్‌ను బాగా ఇష్టపడతా. పవన్‌కల్యాణ్‌, బన్నీ, నాని, నాగచైతన్య, రాజ్‌తరుణ్‌ ఇలా ప్రతి ఒక్కరిదీ ఓ స్టైల్‌. ఒకర్ని మించినవారు ఒకరు.
 
మీకు నచ్చినవి.. నచ్చనివి?
అనూ : ఒత్తిడి ఫీల్‌కావడం నచ్చదు. సినిమా మేకింగ్‌లో ఉన్న కిటుకులు తెలుసుకోవడం అంటే చాలా ఇష్టం. నాన్నలా సక్సెస్‌ఫుల్‌ నిర్మాత కావాలని ఉంది. కానీ ఎప్పుడో తెలీదు.
సలహా తీసుకోవడం నచ్చదు..
అనూ : ‘మజ్ను’ తర్వాత నాకు బాగా నచ్చిన సినిమా ‘శైలజారెడ్డి అల్లుడు’. నటనకు స్కోపున్న పాత్ర అది. నిజజీవితంలో నాకు ఇగో ఎక్కువ. అలాంటి పాత్రే ‘శైలజారెడ్డి అల్లుడు’లో చేశా. కానీ సినిమాలో చూపించినంత ఇగోయి్‌స్టను కాదు. ఇప్పటి వరకూ చేసిన సినిమాల్లో నేను పెద్దగా మాట్లాడింది లేదు. ఇందులో కాస్త లౌడ్‌ క్యారెక్టర్‌ దక్కింది. మంచైనా, చెడు అయినా ఒకరి సలహా తీసుకోవడం నాకు నచ్చదు. నాకు నచ్చినట్లుగా ముందుకెళ్తా. ఇది చెయ్యొచ్చు అని నా మనసుకి అనిపిస్తే చేసేస్తా. కానీ రమ్యకృష్ణగారితో పనిచేశాక ఆ పద్ధతి తప్పని తెలుసుకున్నా. నాకు తెలియకుండానే ఆమె దగ్గరకు వెళ్లి అడిగి మరీ సలహాలు తీసుకున్నా. ఆమెలోని గ్రేస్‌ చూసి ఆశ్చర్యపోయేదాన్ని. ఆమె నటన, డెడికేషన్‌ చూశాక ఊరకే ఎవరూ స్టార్స్‌ కారు అనిపించింది.
మూడ్‌ను బట్టి..
అనూ : స్టైలింగ్‌ విషయంలో నా ఆలోచనలు ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. అప్పటి మూడ్‌ను బట్టి దుస్తులు ధరిస్తా. క్లాసిక్‌ స్టైల్‌ అంటే చాలా ఇష్టం. నా చర్మం త్వరగా డ్రై అయిపోతుంది. అందుకే ఎక్కువగా లోషన్స్‌ ఉపయోగిస్తా. నేనంత ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ని కాదు. కథానాయికకు కావలసిన ఫిట్‌నెస్‌ ఉండేలా చూసుకుంటా. అదే పనిగా వర్కవుట్స్‌ చెయ్యను. వారానికి రెండుసార్లు జిమ్‌ చేస్తా.
నా హీరోలు-నా మాట
పవన్‌ కల్యాణ్‌: మంచితనం
అల్లు అర్జున్‌: సిన్సియర్‌
నాని: రొమాంటిక్‌ పర్సన్‌
నాగ చైతన్య: కంఫర్టబుల్‌ కో-స్టార్‌
గోపీచంద్‌: కామ్‌ గోయింగ్‌
నా ఇష్టాలు
ఇష్టమైన ప్రదేశం: ఇల్లు
ఆహారం: ఫలానా అని చెప్పడం కష్టం. కానీ చైనీస్‌ ఫుడ్‌ అంటే చాలా ఇష్టం.
ఇష్టమైన సినిమా: నోట్‌బుక్‌ (ఇంగ్లిష్‌)
ఇష్టమైన పుస్తకం: ఓఫ్రా విన్‌ ఫ్రే రచన ‘వాట్‌ ఐ నో ఫర్‌ ష్యూర్‌’
ఆలపాటి మధు
ఫొటోలు: ఎం. గోపీకృష్ణ

Heroine Sumalatha

ఆ ఆలోచన ఆయనకు ఎప్పుడూ లేదు!
07-04-2019 00:25:57
సుమలతా అంబరీశ్‌… ఈ ఎన్నికల వేళ మారుమోగుతున్న పేరు. నిన్నటి వరకు బహుభాషా నటి, కన్నడ రెబల్‌ స్టార్‌ అంబరీశ్‌ సతీమణి మాత్రమే! నేడు… భర్తను ఆరాధించిన ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు పిడికిలి బిగించిన ధీశాలి. కర్ణాటకలోని మండ్య లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన ఆమె… జనతాదళ్‌(ఎస్‌) ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు, హీరో నిఖిల్‌తో ఢీకొంటున్నారు. బాల్యంలో ఒడుదొడుకులు… రాజకీయాల్లోకి రాగానే ఎదురుదెబ్బలు… అన్నింటికీ ఎదురొడ్డి గెలుపుపై ధీమాతో దూసుకుపోతున్న సుమలత అంతరంగం ఇది…
సినిమాల్లోకి ఎలా వచ్చారు?
నాకు ఏడేళ్ల వయస్సులోనే నాన్న మాకు దూరమయ్యారు. మేం ఐదుగురు పిల్లలం. అందరి బాధ్యతా అమ్మ భుజాలపై పడింది. అయితే నేను పదో తరగతి చదువుతుండగా అనుకోకుండా సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. ఒకటో రెండో అనుకున్నా… కానీ అవకాశాలు పెరిగి, ఏకంగా చదువు ఆపేయాల్సి వచ్చింది. చివరకు సినిమానే జీవితంగా మారిపోయేంతగా అనుబంధం ఏర్పడింది. తెలుగు, కన్నడ, తమిళ, మళయాళం, హిందీ భాషలన్నింటిలోను నటించాను. ఆ తర్వాత కన్నడంలో రెబల్‌స్టార్‌గా రాణిస్తున్న అంబరీశ్‌తో పెళ్లయింది.
సహ నటులలానే రాజకీయాలలోకి రావాలనుకున్నారా?
సినిమాల్లో బిజీగా గడిపే కాలమది. అప్పట్లో నేను నటిస్తున్న అన్ని భాషలలోనూ ప్రముఖ నటులు రాజకీయాల వైపు వచ్చి రాణించారు. ఎన్నో సినిమాల్లో రాజకీయ ఇతివృత్తం కలిగిన పాత్రలు పోషించాను. కానీ ఎప్పడూ అటువైపు వెళ్లాలని ఆలోచించలేదు. ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటకలోనూ ఎందరో నటులు రాజకీయ పార్టీలు స్థాపించినా… ఏ పార్టీలోకీ వెళ్లాలని కానీ, ప్రచారాలు చేయాలని కానీ అనుకోలేదు.
 
అంబరీశ్‌ రాజకీయాల్లోకి ఎలా వచ్చారు?
ఇరువురం సినిమా రంగంలో బిజీగా గడిపే రోజులలోనే పెళ్లి చేసుకున్నాం. అప్పట్లో అంబరీశ్‌ను ఒక నటుడుగానే కాకుండా… కర్ణాటక చిత్ర పరిశ్రమ పెద్ద దిక్కుగా భావించేవారు. అదే సమయంలో అంబరీశ్‌ రాజకీయాల వైపు దృష్టి సారించారు. ఆయనకు తన సొంత జిల్లా మండ్య అంటే ఎక్కడ లేని అభిమానం. పండుగలు, పెళ్లిళ్లు… మండ్యలో ఏ కార్యక్రమం జరిగినా వెళ్లేవారు. అక్కడి ప్రజలతో మమేకమైపోయేవారు. ఆయనది విభిన్న జీవనశైలి. కష్టమని ఎవరొచ్చినా సాయం చేసేవారు. అందుకే ఆయన్ను ‘అభినవ కర్ణుడ’ని ప్రజలు పిలుచుకునేవారు.
 
ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు మీరు ఏవైనా సలహాలిచ్చేవారా?
అంబరీశ్‌ ఎప్పుడూ సామాన్యుల గురించి ఆలోచించేవారు. ఆయనకు సలహాలిచ్చేంతటి పరిస్థితి మాకుండేది కాదు. ఎక్కువమందితో మాట్లాడేవారు. వారిలో అధికారులు, రైతులు, సినిమా రంగానికి చెందినవారుండేవారు. అందరి అభిప్రాయాలూ విని ఒక కచ్చితమైన నిర్ణయం తీసుకునేవారు. కావేరీ నదీ జలాల విషయంలో వివాదం తలెత్తినప్పుడు, కర్ణాటక ప్రజల పక్షాన నిలబడి కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రంలో పేదలకు మంచి చేసే అవకాశం దక్కిందని సంతోషించేవారు. ప్రచారాలకు దూరంగా, రాష్ట్రమంతటా వేలాదిమంది నిరుపేదలకు సొంతింటి కల సాకారం చేశారు. తన కుటుంబం నుంచి మరెవరినీ రాజకీయాల్లోకి తేవాలన్న ఆలోచన ఆయనకు ఎప్పుడూ ఉండేది కాదు.
మరి మీరు రాజకీయాల వైపు ఎలా నడిచారు?
అంబరీశ్‌ ఉన్నంత కాలం… ‘రాజకీయాలలోకి రావాలి… పదవులు అనుభవించాల’ని నేనెప్పుడూ అనుకోలేదు. ఆయన మాకు దూరమయ్యాక మండ్య జిల్లాలో లెక్కలేనన్ని సంతాప సభలు జరిగాయి. అంతటి అభిమానం అక్కడి ప్రజలది! ఆ సభలకు మా అబ్బాయి అభిషేక్‌తో వెళ్లాను. ప్రతి చోటా ఒకటే డిమాండ్‌… ‘ అంబరీశ్‌ అంటే మాకు ప్రాణం. ఆయనను మా కుటుంబ సభ్యుడిగా భావించాం. ఆయన ఆకాంక్షలు నెరవేరాలంటే మీరు రాజకీయాల్లోకి రావాలి’ అని! కానీ నేను అవేమీ పట్టించుకోలేదు. దీంతో వారు ‘అంబి (అంబరీశ్‌ను ప్రజలు ముద్దుగా పిలిచే పేరు) ఆశయాలు సాధించే దిశగా రాజకీయాల్లోకి రండి. లేదంటే ఈ సభల తర్వాత మాకు కనిపించొద్దు’ అన్నారు. ఏ పల్లెకెళ్లినా ఇదే డిమాండ్‌. అంబరీశ్‌ తర్వాత నా కొడుకే జీవితం అనుకున్నా. కానీ ఇంతమంది నన్ను అంబి రూపంలో ప్రాణం కంటే గొప్పగా అభిమానిస్తున్నారని తెలిసి భావోద్వేగానికి లోనయ్యాను. ఆ క్షణమే మండ్య నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నా.
 
కానీ, అంబరీశ్‌ పనిచేసిన కాంగ్రెస్‌ను ఎందుకు కాదనుకున్నారు?
కాంగ్రె్‌సలో ఉన్నప్పుడు అంబరీశ్‌ ఎన్నో పదవులు అనుభవించారు. అందుకే నేను సైతం అదే పార్టీ ద్వారా వెళ్లాలని అనుకున్నా. కానీ కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు ఉన్నందున ఈ సీటు జేడీఎ్‌సకు వెళ్లింది. రాజకీయాలు చేయాలనీ, పదవులు పొందాలనీ, ఇంకేదో చేయాలనీ, మా అబ్బాయి భవిష్యత్తుకు బాటలు వేయాలనీ నాకెప్పుడూ లేదు. మండ్య ప్రజలతో కలిసి ఉండటమే నా భవిష్యత్తు అనుకున్నా. అయితే మండ్యలో కాకుండా బెంగళూరు దక్షిణ లేదా ఉత్తర నుంచి పోటీ చేయాలనీ, లేదంటే రాజ్యసభ సీటిస్తామని కాంగ్రెస్‌ చెప్పింది. జేడీఎస్‌ కూడా నన్ను ఎమ్మెల్సీని చేసి, మంత్రి పదవి ఇస్తామంది. సరే అంటే పదవి వచ్చేస్తుంది. కానీ నాకు ఆ పదవి కంటే మండ్య ప్రజలతో అనుబంధమే ముఖ్యమనుకున్నా.
కన్నడనాట ఎన్నికల్లో ఇప్పుడు మండ్యనే ప్రముఖంగా మారింది కదా!
మండ్యలో ఎన్నికలంటే ఆత్మాభిమానానికీ… అధికార పాలనకూ మధ్య జరుగుతున్న పోరాటం. నేను నామినేషన్‌ వేసినప్పటి నుంచి అధికార పార్టీ అడ్డంకులు సృష్టిస్తూనే ఉంది. నామినేషన్‌కు జనమొస్తే జీర్ణించుకోలేకపోయారు. నా సొంత పిల్లల్లాంటి సినీ హీరోలు దర్శన్‌, యశ్‌లు ప్రచారానికొస్తే బెదిరిస్తున్నారు. దీనికంతటికీ కారణం సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్‌ జేడీఎ్‌స-కాంగ్రె్‌సల ఉమ్మడి అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేయడమే. ముఖ్యమంత్రి, ముగ్గురు మంత్రులు, ఐదుగురు శాసనసభ్యులు… ఇంతమంది కలిసి నిఖిల్‌ తరపున ప్రచారం చేస్తున్నారు. నిఖిల్‌ నామినేషన్‌లో తప్పులపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశా. నాపై కసితో సుమలత పేరున్న మరో ముగ్గురి చేత నామినేషన్లు వేయించారు. నా వ్యక్తిగత జీవితం గురించి, నా కులం గురించీ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. నా ఫోన్‌ ట్యాప్‌ చేశారు. ఇవేవీ పట్టించుకోని నేను ప్రశాంతంగానే ఉన్నా. కానీ ఉత్కంఠ అంతా ప్రత్యర్థుల్లోనే కనిపిస్తోంది.
ప్రచారంలో సుమలత ప్రత్యేకతలేంటి?
ప్రచారంలోనే కాదు… సుమలత అంటే ఎప్పుడూ సౌమ్యంగా ఉండాలనుకుంటా. కానీ అంబరీశ్‌ను సోదరుడనీ, తమ కుటుంబం సభ్యుడనీ చెప్పుకున్నవారు, ఆయనకు పాదాభివందనాలు చేసినవారే ఇప్పుడు నాపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారు. ఎవరెన్ని విమర్శలు చేసినా పట్టించుకోను. పాజిటివ్‌ దృక్పథంతో ముందుకు వెళుతున్నా.
మీ అబ్బాయి అభిషేక్‌ను రాజకీయాలలోకి తీసుకొస్తారా?
అభిషేక్‌ ఇప్పుడే తొలి సినిమాలో నటిస్తున్నాడు. ఆ రంగంలో రాణించి, జీవితమంటే ఏంతో తెలుసుకోవాలి. ఎటువైపు నడవాలనేది వాడి నిర్ణయానికే వదిలేశాను. రాజకీయాలలోకి వస్తానంటే వద్దనేది లేదు.
 
గెలిస్తే ఏం చేయాలనుకుంటున్నారు?
గెలిచిన వెంటనే మండ్యను సింగపూర్‌ చేస్తానని చెప్పడం లేదు. అలాంటి వాగ్దానాలు చేయను. మండ్య ప్రజలు ఎదుర్కొనే సమస్యలు తెలుసుకున్నా. వాటికి కేంద్రం ద్వారా వచ్చే నిధులతో అభివృద్ధి చేసి చూపిస్తాను. ఇక ఓడిపోతే… ప్రజల తీర్పును గౌరవిస్తా. కానీ మండ్య ప్రజల అభిమానానికి మాత్రం దూరమవ్వను. జీవితకాలం వారితోనే కలిసివుంటా.
 
 
చిరంజీవి, రజనీకాంత్‌లను ఆహ్వానించలేదు…
చిరంజీవి, రజనీకాంత్‌లతో కలసి చాలా చిత్రాలు చేశాను. సహనటులుగానే కాదు… వారిద్దరూ నాకు సన్నిహితులు. అంబరీశ్‌కు వారంటే ఎంతో ఇష్టం. ఇరువురూ అపార అనుభవం కలిగినవారు. నా రాజకీయరంగ ప్రవేశాన్ని అభినందించారు. కానీ ప్రచారాలకు నేను ఆహ్వానించలేదు. అయితే మీడియాలో ప్రచారం జరుగుతోంది. అటువంటి ఆలోచన ఏదీ ప్రస్తుతానికి లేదు.
 
అమ్మ, ఆయనే నాకు స్ఫూర్తి…
నా చిన్నప్పుడే నాన్న చనిపోతే… ఐదుగురు పిల్లలను మా అమ్మ పెంచి పెద్ద చేసింది. ఇందుకు ఆమె పడిన కష్టాలు చూశాను. అందుకే నాకు అమ్మకు మించిన స్ఫూర్తి ఎవరూ లేరు. ఆ తర్వాత అంబరీశ్‌తో గడిపిన 27 ఏళ్లలో ఎన్నో నేర్చుకున్నా. కష్టంలో ఉండేవారి పట్ల దయ, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రేమాభిమానాలు చూపడం ఆయనలోని ప్రత్యేకత. సమాజంలో నేటికీ మహిళలంటే తక్కువనే అభిప్రాయాలు పూర్తిగా పోలేదు. ఎన్నికలలో పోటీ చేస్తే ఆప్తులు, బంధువులు కూడా గేలి చేస్తున్నారు. వీటన్నింటికీ ఎదురు నిలిచి ముందుకెళ్లాలనేది… మా అమ్మ, ఆయన నుంచే నేర్చుకున్నా.
 
సేకరణ: హిందూపురం రవి
ఫొటోలు: కె.ఎన్‌.శివణ్ణ

Heroine Priyadarshini (Hello)

ఎప్పటికైనా డైరెక్షన్‌ చేస్తా!
 

2017లో ‘హలో’ అంటూ తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది కల్యాణి ప్రియదర్శన్‌. అమ్మాయి బావుంది, బాగా చేసింది అనుకున్నారంతా. ఆమె ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్‌, అలనాటి నటి లిజీల తనయ అని ఆ తర్వాతే తెలిసింది. తాజాగా ‘చిత్రలహరి’లో లహరిగా మరోసారి నటిగా మార్కులు కొట్టేసింది. సినిమా కుటుంబం నుంచి వచ్చిన ఈ అమ్మాయి తన కెరీర్‌కు సంబంధించిన ప్రశ్నలకు ఇలా బదులిచ్చింది…

సినిమా మీ జీవితంలోకి ఎప్పుడొచ్చింది?
చిన్నప్పుడు స్కూల్‌కి సెలవులొస్తే నాన్నతోపాటు షూటింగ్‌కి వెళ్లిపోయేదాన్ని. నాన్న చాలా బిజీ డైరెక్టర్‌. ఏడాది పొడుగునా సినిమాలు చేసేవారు. సెట్‌లో నాన్న తన పనిని చాలా ఎంజాయ్‌ చేస్తారు. నేను కూడా రోజంతా ఆడుతూపాడుతూ టైమ్‌పాస్‌ చేసేదాన్ని. ‘సెలవులు అయిపోయాయి. మళ్లీ స్కూల్‌కి వెళ్లాలి’ అంటే, అప్పుడే అయిపోయాయా అనుకునేదాన్ని. కాస్త పెద్దయ్యాక అమ్మ సినిమాల్ని టీవీలోనే ఎక్కువగా చూశాను. అలా చిన్నప్పట్నుంచీ సినిమా నా జీవితంలో భాగం అయిపోయింది. సినిమాలంటే ప్రత్యేకమైన ఇష్టం ఏర్పడింది.

ఏం చదువుకున్నారు?
సినిమాల్లోకి వెళ్తానని తెలుసు. కానీ ఏ విభాగంలో అన్న క్లారిటీ లేదు. ‘ముందు బాగా చదువుకో. చదువుద్వారానే నీకు మిగిలిన వాళ్లకంటే భిన్నంగా, ఉన్నతంగా ఆలోచించే సామర్థ్యం వస్తుంది’ అని చెప్పేవారు నాన్న. సింగపూర్‌లో చదువుకుంటూనే నాటకరంగానికి సంబంధించిన కోర్సునీ చేశాను. అక్కడే యాక్టింగ్‌, డైరెక్షన్‌ రెంటినీ నేర్చుకున్నాను. తర్వాత న్యూయార్క్‌ వెళ్లి పార్సన్‌ స్కూల్‌ ఆఫ్‌ డిజైన్‌ నుంచి ఆర్కిటెక్చర్‌ కోర్సు చేశాను. అక్కడ రంగస్థల సంస్థ ‘బ్రాడ్‌వే’ ఆధ్వర్యంలో ప్రదర్శించే నాటకాల్లో తెరవెనక పాత్ర పోషించాను. అప్పటికీ నా సినిమా కెరీర్‌ ఏ విభాగంలో అన్న క్లారిటీ లేదు. అమెరికా నుంచి ఇండియా వచ్చాకే యాక్టింగ్‌వైపు వెళ్లాలనుకున్నాను. మనిషి కదలికల్ని బట్టి డిజైన్‌ ఉండాలని ఆర్కిటెక్చర్‌ చెబుతుంది. అలాగే సినిమాలోని నా పాత్రని బట్టి నా బాడీ లాంగ్వేజ్‌, డ్రెస్సింగ్‌ అన్నీ ఉండేలా చూసుకుంటాను. ఆ విధంగా నా చదువు నాకు ఉపయోగపడుతోంది.

సినిమాల్లోకి ఎలా వచ్చారు?
నాది సున్నిత స్వభావం. ఎవరైనా విమర్శిస్తే దాన్ని చాలా సీరియస్‌గా తీసుకునే రకం. అందుకే నా స్వభావానికి యాక్టింగ్‌ సరిపోదు అనుకునేదాన్ని. సినిమా ప్రపంచానికి దగ్గరగా పెరిగినదాన్ని కాబట్టి సినిమాలకి దూరంగా ఉండలేను. అందుకని తెరవెనక ఏదైనా విభాగాన్ని ఎంచుకోవాలనుకున్నాను. అమెరికాలో డిజైనింగ్‌ కోర్సు చేస్తున్నపుడు ఆర్ట్‌ డైరెక్షన్‌ వైపు వెళ్దామనుకున్నాను. నాన్నా, ఆర్ట్‌ డైరెక్టర్‌ సాబు సిరిల్‌ మంచి స్నేహితులు. ఫ్యామిలీ ఫ్రెండ్స్‌ కూడా. అందుకే సిరిల్‌ అంకుల్‌కి సహాయకురాలిగా ‘క్రిష్‌ 3’, ‘ఇరుముగన్‌’ సినిమాలకి పనిచేశాను. అలా సినిమాల్లో ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌లో అరంగేట్రం చేశాను.

తెరమీదకు రావాలన్న నిర్ణయం?
మొదట్నుంచీ అమ్మానాన్న నాకు పూర్తి స్వేచ్ఛనిస్తూ పెంచారు. ఎప్పుడూ ‘ఇది చెయ్యి, అది చెయ్యకు’ అని చెప్పలేదు. ఏదైనా విషయం గురించి వాళ్ల అభిప్రాయం చెబుతారు కానీ, నేను ఏ నిర్ణయం తీసుకున్నా మద్దతిస్తారు. ఇక నేను తెరమీద కనిపిస్తే ప్రేక్షకులు నా నటనని మొదటిరోజు నుంచీ అమ్మా, నాన్నల సామర్థ్యంతో పోలుస్తారు. అలాంటపుడు వచ్చే విమర్శల్ని తట్టుకోలేనేమో అన్న సందిగ్ధంలోనే చాన్నాళ్లు ఉండిపోయాను. కొన్నాళ్లు ఆలోచించాక ‘ఈ ఒక్క విషయమే నన్ను ఆపుతోంది. దాన్ని పక్కనపెట్టి పనిచేస్తా’ అనుకున్నాను. ఆ తర్వాత నాన్నతో విషయం చెప్పాను. నాన్న సినిమా ద్వారా నేను పరిచయం కావొచ్చు. కానీ నేను సొంతంగా అవకాశం  తెచ్చుకుంటే, అది నాకూ, పరిశ్రమకీ కూడా మంచిదన్నారు.

‘హలో’ ఛాన్స్‌ ఎలా?
తెలుగు సినిమా ద్వారా పరిచయం అవుతానని నేనెప్పుడూ అనుకోలేదు. నేను మలయాళీని. చెన్నైలో చదువుకోవడంవల్ల తమిళం కూడా తెలుసు. ఈ రెండు పరిశ్రమల్లో ఏదో ఒకచోట అరంగేట్రం చేస్తే బావుంటుందన్న ఆలోచన ఉండేది. ‘హలో’ దర్శకుడు విక్రమ్‌కుమార్‌ కథ చెప్పాక నో చెప్పడానికి నాకు కారణం దొరకలేదు. అంతా విధి రాత. ఆ సినిమా కూడా అదే అంశంమీద ఉంటుంది. సినిమా పట్టాలెక్కడానికి ఇంకా పదిరోజులు ఉందనగా నేను సంతకం చేశాను. ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసిన అనుభవంవల్ల మొదట్లో సెట్‌లో అడుగుపెట్టగానే అన్నీ సవ్యంగా ఉన్నాయా లేదా అని చూసేదాన్ని. నేను హీరోయిన్‌ అన్న సంగతి తర్వాత గుర్తొచ్చి నా క్యారెక్టర్‌ గురించి ప్రధానంగా దృష్టిపెట్టాలని నాకు నేను చెప్పుకునేదాన్ని. వారం రోజుల తర్వాతే ఆర్ట్‌ డైరెక్షన్‌ సంగతి మర్చిపోగలిగాను. అప్పట్నుంచీ సెట్స్‌లో మిగతా అంశాల్లో మరీ ఎక్కువగా ఇన్‌వాల్వ్‌ అవ్వకుండా జాగ్రత్తపడ్డాను. ఆ సినిమా సమయంలో మంచి టీమ్‌తో పనిచేశానన్న సంతృప్తి కలిగింది. నాకు తెలుగు రాదు. అందుకే ముందు రోజే నాకు డైలాగులు ఇచ్చేసేవారు. విక్రమ్‌కుమార్‌ నన్ను క్యారెక్టర్‌కి తగ్గట్టు బాగా తీర్చిదిద్దారు. ఆ సినిమాలోని నా పాత్ర పేరు
‘జున్ను’తో నన్ను ఇప్పటికీ సోషల్‌ మీడియాలో ప్రస్తావిస్తుంటారు. అది చూడగానే నవ్వొస్తుంది.

అమ్మానాన్నల పాత్ర ఏంటి?
నాన్న దర్శకుడే కాదు, మంచి నటుడు కూడా. ఇక అమ్మ గురించి చెప్పేదేముంది. వాళ్లిద్దరూ నన్ను చేయిపట్టుకుని నడిపిస్తుంటారని అంతా అనుకుంటుండొచ్చు. కానీ ‘హలో’ సమయంలో నేను ఎలా చేస్తున్నానూ, ఎలాంటి డ్రెస్సులు వేసుకుంటున్నానూ… వంటి విషయాల్ని ఒక్కరోజు కూడా అడగలేదు వాళ్లు. షూటింగ్‌కి వచ్చి చూసిందీ లేదు. నేను ఒక్కదాన్నే షూటింగ్‌కి వస్తుంటే చాలామంది ఆశ్చర్యపోయేవారు. ఆ సినిమా టీజర్‌ వచ్చాక అందరిలానే అమ్మానాన్నా నా వర్క్‌ని చూశారు. సినిమా చూశాక అమ్మ భావోద్వేగానికి లోనై నన్ను 10 నిమిషాలు కౌగిలించుకుని ఏడ్చేసింది. తర్వాత డైరెక్టర్‌ చేతులు పట్టుకునీ ఏడ్చేసింది. నాన్న నాకు మంచి విమర్శకుడు. చిన్నప్పట్నుంచీ ఏదైనా పొరపాటు చేస్తే దాన్ని లోతుగా విశ్లేషించి చెప్పేవారు. మొదటి సినిమాలో నా పాత్రకు పూర్తిగా న్యాయం చేయగలనన్న నమ్మకం నాన్నకి లేదు. ఆ సినిమా చూశాక నన్ను ఏమీ అనలేదు. అదే ఆయనిచ్చిన కాంప్లిమెంట్‌.

‘చిత్రలహరి’ అనుభవాలు చెప్పండి?
దాదాపు ఏడాదిన్నర తర్వాత ‘చిత్రలహరి’తో మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాను. ‘లహరి’ పాత్రలో ఈతరం అమ్మాయిలు తమని చూసుకున్నారు. ఈసారి తెలుగు నేర్చుకుని నా పాత్రకు నేనే డబ్బింగ్‌ చెప్పాను. డబ్బింగ్‌ సమయంలో డైరెక్షన్‌ టీమ్‌ చాలా హెల్ప్‌ చేశారు. దర్శకుడు కిశోర్‌ తిరుమల చాలా పొయెటిక్‌గా డైలాగులు రాస్తారు. పొరపాటుగా పలికి వాటి తీవ్రతని తగ్గించకూడదని ప్రతి పదం అర్థం తెలుసుకుని మరీ చెప్పేదాన్ని. ఈ సినిమా షూటింగ్‌ చాలా సరదాగా గడిచిపోయింది. ఓసారి నా పుట్టినరోజు గురించి డిస్కషన్‌ వచ్చింది. ‘ఆరోజు నీకు ఏం గిఫ్ట్‌ కావాలి’ అని అడిగాడు తేజూ. ఐపాడ్‌ కావాలన్నాను నవ్వుతూ. సరదాగా అడిగాడు అనుకున్నాను. కానీ పుట్టినరోజు నాడు ఐపాడ్‌ పట్టుకుని వచ్చాడు. అంత ఫ్రెండ్లీ నేచర్‌ తనది. ఈ సినిమాతో నటనలోనూ, తెలుగు భాషలోనూ చాలా మెరుగయ్యానని చెప్పాలి. ప్రి రిలీజ్‌ ఫంక్షన్‌రోజు తెలుగులోనే మాట్లాడాను. కానీ ఇంకా బాగా నేర్చుకోవాలి.

మీరు మోహన్‌లాల్‌ ఫ్యానా?
మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ మాకు ఫ్యామిలీ ఫ్రెండ్‌. ఆయన్ని ‘అంకుల్‌’ అని పిలుస్తాను. మా రెండు కుటుంబాలూ కలిసి ఐరోపా పర్యటనకు వెళ్లిన రోజులు నాకింకా గుర్తే. ఆయన సినిమాల్ని చూస్తూ పెరిగిన నాకు ఆయన ఫీడ్‌బ్యాక్‌ చాలా ముఖ్యం. అందుకే నా మొదటి సినిమాను ఆయనకు చూపించాను. సినిమా చూశాక కౌగిలించుకున్నారు. ఆయనకు సినిమా నచ్చిందని ఆ స్పర్శతో నాకు అర్థమైంది. అంకుల్‌ వాళ్లబ్బాయి ప్రణవ్‌ కూడా నాకు మంచి ఫ్రెండ్‌. చాలా సింపుల్‌గా ఉంటాడు. తనూ సినిమాల్లోకి వచ్చాడు. ప్రణవ్‌తో కొద్దిరోజులు మాట్లాడితే ఏ అమ్మాయి అయినా ఇతణ్ణి ఇష్టపడుతుంది. ఎవరైనా మంచి స్క్రిప్టుతో వస్తే కచ్చితంగా ప్రణవ్‌, నేనూ కలిసి పనిచేస్తాం.

సినిమా ఎంపిక ఎలా?
20 ఏళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే, నేను గర్వంగా ఫీలయ్యే పాత్రలు కొన్నయినా ఉండాలనేది నా లక్ష్యం. అందుకే స్క్రిప్టు నచ్చితే అయిదు నిమిషాలుండే పాత్ర అయినా చేస్తాను. వారసురాలిగా అమ్మానాన్నల గౌరవాన్ని నిలబెట్టే బాధ్యత నాపైన ఉంటుంది. ఆ విషయాన్నీ కథ ఓకే చేసినపుడు ఆలోచిస్తాను. నిజానికి కొత్తవాళ్లకి ఛాయిస్‌లు ఎక్కువ ఉండవు. కానీ కథ నచ్చకపోతే నేను చేయను. నటన పరంగా ఏ భాష అయినా పెద్దగా తేడా ఉండదు. నాకు తెలుగు బాగా రాదు కాబట్టి, ఇక్కడ డైరెక్టర్‌ చెప్పినట్టు చేస్తాను. మలయాళం, తమిళం తెలుసుకాబట్టి, డైలాగులో అంతర్లీనంగా ఉన్న అర్థం తెలుసుకుని నా ఆలోచనలకు అనుగుణంగా నటిస్తాను. డైరెక్టర్‌ని బట్టి కూడా అప్రోచ్‌ మారుతుంది. భవిష్యత్తులో మూడు భాషల్లోనూ చేస్తాను.

అమ్మానాన్నా విడిపోయారా?
అవును… అయిదేళ్లకిందట విడిపోయారు. మాకోసం మాత్రం కలిసి మాట్లాడుకుంటారు. నాకు మాత్రం వాళ్లు దూరమైన ఫీలింగ్‌ లేదు. నిజంగా నాకూ, తమ్ముడికీ ఏరోజూ ఎలాంటి లోటూ రాకుండా చూసుకున్నారు,చూసుకుంటున్నారు. వాళ్లతో ప్రతి విషయాన్నీ పంచుకుంటాను. వాళ్లూ అంతే. దానికి తోడు చిన్నప్పట్నుంచీ నా నిర్ణయాలు నేనే తీసుకునేలా పెంచారు. ఇప్పుడు స్క్రిప్టులు నేనే విని సినిమాలు ఎంపిక చేసుకుంటాను.

ఏ సినిమాలు చేస్తున్నారు?
తెలుగులో శర్వానంద్‌తో ఓ సినిమా చేస్తున్నాను. అది త్వరలోనే రిలీజవుతుంది. తమిళంలో ‘హీరో’, ‘మానాడు’ చేస్తున్నాను. హీరో పక్కా కమర్షియల్‌ సినిమా, ‘మానాడు’ రాజకీయ నేపథ్యంతో సాగే కథ. మోహన్‌లాల్‌ అంకుల్‌తో నాన్న చేస్తున్న మలయాళీ సినిమా ‘మరక్కర్‌’లో చిన్న పాత్ర చేస్తున్నాను. అది పీరియడ్‌ సినిమా. 16వ శతాబ్దంలో పోర్చుగీసువాళ్లు ఇండియాకి వచ్చిన సమయం నాటి కథ.

మీ జీవిత లక్ష్యం?
జీవితంలో ఒక్క సినిమాకైనా డైరెక్షన్‌ చేయాలనేది నా లక్ష్యం.