నటుడు ‘ఏవీఎస్’

avs no more 1 avs no more 2 avs no more 3 avs no more 4 avs no more 5 avs no more 6 avs no more  7 avs no more 8 avs no more 9 avs no more 10 avs no more 11 avs no more 12 avs

ఆయన్ను చూడగానే మనకెన్నో గుర్తుకు వస్తాయి, వెనువెంటనే పెదవుల మీదకు నవ్వు తోసుకుని వస్తుంది “నాకదో తుత్తి” మీ ఇంట్లో బల్లుందా? అది ఆడదా మగదా? మీది తెనాలే  మాది తెనాలే..ఇలాంటివి మచ్చుకే ఇంకా ఎన్నెన్నో పాత్రలతో మనల్ని నవ్వించిన నవ్వులు రేడు ఏవియస్ అనబడే ఆమంచి వేంకట సుబ్రహ్మణ్యం. జర్నలిస్టుగా తన కేరీర్ ప్రారంభించి బాపు గారి ద్వారా మనకు పరిచయమైన ఆణిముత్యం. ఏ విషయమైనా నిర్భయంగా, నిర్మొహమాటంగా చెప్పే ఆయనలో ఒక నిర్మాత, దర్శకుడు కథకుడు కాలమిస్టు, లిరిసిస్టు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కోణాలున్నాయి. ఆ మధ్య కన్న కూతురి కడుపు చల్లగా తిరిగి వచ్చిన ఆ నవ్వుల రాజు  వచ్చినట్టే వచ్చి తిరిగి తిరిగి లాని లోకాలకు వెళ్ళిపోయాడు. ఈ రోజు ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయన బ్రతికి ఉండగా చేసిన చివరి ఇంటర్వూ  ఆంధ్రజ్యోతి.కామ్ పాఠకులకు ప్రత్యేకం.

నా గురించి
నా పూర్తి పేరు ఏ.వి. సుబ్రహ్యమణ్యం. సినిమా పరిశ్రమకు వచ్చేనాటికే ధర్వవరపు సుబ్రహ్మణ్యం గారు కూడా ఉండటంతో  నా పేరును ఏవియస్ గా మార్చారు. మా నాన్న పేరు ఆమంచి రఘురామయ్య, అమ్మ పేరు ఆమంచి శివకామేశ్వరమ్మ.మాది పెద్ద సంతానం. ఏడుగురు అన్నదమ్ములు.ముగ్గురు అక్క చెళ్ళెల్లు.మా వృత్తి అర్చకత్వం. నేను ఒక్కడిని దానిలోనుండి బయటకు వచ్చాను. మా స్వంత ఊరు గుంటూరుజిల్లా తెనాలి. మా అమ్మ నాన్న ఇద్దరూ కాలం చేశారు.నా బాల్యం అంతా తెనాలిలో గడిచింది. నా స్కూలు విషయానికి వస్తే తెనాలి తాలూకా హైస్కూల్లో చదివాను.ఇది ఇప్పుడు తెనాలి జూనియర్ కాలేజీ అయింది. వియస్ఆర్ కాలేజీలో ఇంటర్ వరకు చదివాను. తరువాత తెనాలిలో నే జీవితం స్థిరపడ్డం కోసం పలు ప్రయత్నాలు చేశాను. ఆ ప్రయత్నాల్లో భాగంగా ఉదయం పత్రికలో జర్నలిస్టుగా చేరాను. ఆ పత్రికలోనే ఒంగోలుకు ట్రాన్స్ ఫర్ అయి అక్కడ కొంత కాలం పని చేశాను.  దాని తరువాత ఆంధ్రజ్యోతిలొ చేరి ఆ పత్రిక రిపోర్టర్ గా కొంత కాలం పని చేశాను. కొంత కాలం గుంటూరులో పని చేసి తర్వాత విజయవాడ డెస్క్ కు షిఫ్ట్ అయ్యాను.
బాల్యం గురించి
నాకు బాల్యం అంటే చాలా ఇష్టం. అందువల్ల ఇప్పటీకీ పిల్లలను చూస్తుంటే ఇష్టం, ఈర్షకూడా. ఎందుకంటే జీవితంలోనే అతి గొప్ప పీరియడ్.వత్తిడి, టెన్షన్,పరుగులు, కుళ్ళు, కల్మషం, స్వార్థం ఇవేమి లేని ఒక నిష్కల్మమైన ప్రపంచం. అందుకే బాల్యం అంటే ఇష్టం. నేను ఎంతగా ఇష్టపడ్డానో అంతగా ఎంజాయ్ చేయలేదేమో, అంటే విపరీతయమైన కష్టాలుపడ్డనని కాదు కాని ఎందుకనో అంతగా ఎంజాయ్ చేయలేదేమో అనిపిస్తుంది. దానికి కారణాలు లేవు. పెద్దసంసారం, అంతమంది మధ్యన ఉండటంతో ప్రత్యేకించి ఏమీలేదు. అప్పుడు అంతగా టెన్షన్ లు లేవు. ఇప్పడున్న టెన్షన్లతో పోల్చుకుంటే బాల్యం అందంగా కనిపిస్తుంది. బహుశా పెద్దయిన తరువాత బాల్యం తాలూకు రుచి తెలుస్తుందేమో.
చదువులో మరీ ..
చదువు పరంగా చూసుకుంటే పూర్ స్టూడెంటునే. చదువు మీద పెద్దగా ధ్యాస ఉండేదికాదు. చిన్నతనం నుండే జనాన్ని నవ్విస్తూ ఉండేవాడిని. ఇంటర్ మీడియట్ కు వచ్చిన తరువాత ఇద్దరు, ముగ్గురు లక్చరర్స్ను ఇమిటేట్ చేయడం తరువాత మిమిక్రీ ఆర్టిస్టు కావడం కాలేజీలో మోనో యాక్షన్ చేయడం లాంటివి చేస్తుండటం వల్ల చదువు మీద పెద్దగా దృష్ఠి సారించలేదనే చెప్పాలి.
బాల్యం అనగానే గుర్తుకు వచ్చేది
బాల్యం అనగానే గుర్తుకు వచ్చేది అంటే నాకు పెద్దగా ఊహరాకముందే ఒక సంఘటన ఇప్పటికీ గుర్తు. మానాన్న  గారు నాకు సుబ్రహ్మణ్యం అనే పేరు పెట్టారు. సుబ్రహ్మణ్యం అంటే నాగరాజు అంశ అంటారు. ఆధ్యాత్మిక చింతన ఉంటే సుబ్రహ్మణ్య స్వామి గుర్తుకు వస్తారు. నా చిన్న తనంలో ఇంట్లో చీరతో ఉయ్యాల కట్టారు. అందులో నేను కూర్చని ఊగుతున్నాను. మా అమ్మగారు తిడుతున్నారు. చిన్న పిల్లలకు కట్టిన ఉయ్యల్లో నువ్వు కూర్చుని ఊగుతున్నావేమిటి అని. మాది పెంకుటిల్లు అందులో పాము ఎప్పుడు పిల్లలను పెట్టిందో తెలియదు. ఓ మూడు పాము పిల్లలు వచ్చి నా ఒళ్ళో పడ్డాయి.నేను వాటిని పట్టించుకోకుండా ఊగుతుంటే మా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళెవ్వరో వాటిని తీసేశారు. తరువాత పాములు పట్టుకునే వారిని పిలిపించి పట్టించారు.అంటే సుబ్రహ్మణ్యస్వామి పేరు పెట్టాము కదా ఆ అంశ ఉంది అని పెద్దలు నమ్మారు. అప్పటి నుండి ఎక్కడ పామును చూసినా నాకు భయంతో కూడిన థ్రిల్ కలుగుతుంది. పామును నేను థ్రిల్లింగ్ గా చూస్తుంటాను. టివిల్లో పాముల గురించి ప్రోగ్రామ్ వస్తే నేను ఇంట్రస్టుగా చూస్తుంటాను.
చిన్నతనంలో చేసిన అల్లరి గురించి
అల్లరి బాగా చేసేవాడిని. అంటే కాస్త కామెడీ చేస్తుంటే చుట్టు పక్కల వారు నవ్వేవారు. అలా నేను కామెడీ చేసి తిట్టించుకున్నానుకూడా .ఇంట్లో న్నాన గారితో దెబ్బలు కూడా తిన్నాను. చదువు మీద ఎక్కవ శ్రద్ధ ఉండేది కాదు. స్నేహితులతో ఎక్కువగా తిరుగుతూ కామెడీ చేసేవాడిని. తెనాలి హైస్కూల్లో చదివే ప్పుడు మాకు ఒక తెలుగు టీచర్ ఉండేవాడు. ఆయన పె్దగా చదువు చెప్పేవాడు కాదు కాని మ్మమల్ని బాగా తిట్టేవాడు. దాంతో ఆయన క్లాస్ సమయంలో దురద గుంటాకు తీసుకుని వచ్చి ఆయన కూర్చుండే కుర్చీకి రాశాము. ఆయన వచ్చి కూర్చుని గోక్కోవడం ప్రారంభించి మూడు రోజులు సెలవు పట్టాడు. అంతకు మించి పెద్దగా అల్లరి చేసిన దాఖలాలు లేవు. ఆయన ఎవ్వరు రాశారని ఎంక్వయిరీ చేసే తీరిక లేక గోక్కంటూ వెళ్ళారు.
మిమక్రీ , నాటకం
చిన్న తనం నుండి పదిమంది కనిపించినపుడు జోకులు వేసి నవ్విస్తూ ఉండేవాడిని. 1974 లో డిగ్రీలో చేరినపుడు మాకు యం.యస్. అనే లెక్చరర్ ఉండేవారు. నేను ఆయన్ను ఇమిటేట్ చేశాను. తరువాత మా కాలేజీ ప్రిన్సిపాల్ ని అనుకరించాను. మా కాలేజీ నాన్న టీచింగ్ స్ఠాఫ్ ముందు  మా కాలేజీ ప్రిన్సిపాల్ నుఅనుకరించాను. అలా అనుకరించిన తరువాత వాల్ళు మెల్లగా అక్కడినుండి వెళ్ళిపోతుంటే నేను వెనక్కి చూశాను. మా కాలేజీ ప్రిన్సిపాల్ వెనుక నిల్చుని ఉన్నారు. అంతే ఆమె చాల స్పోర్టివ్ గా తీసుకోలేదు. వారం రోజులు కాలేజీ నుండి సస్సెండ్ చేశారు. అప్పడు నాకు అర్థమయింది. నాన్న టీచింగ్ స్టాఫ్ నన్ను కావాలనే ఇరికించారని దాని తరువాత మా ప్రిన్సిపాల్ పిలిపించి మిమిక్రీ బాగానే చేస్తున్నావు. మంచి మిమిక్రీ అర్డిస్టు అవుతావు అని ప్రోత్సహించారు. నేను ఎవరినైతే తొలుత అనుకరించానో ఆ లెక్చరరే పిలిచి నాటకాల్లో వేషాలు ఇచ్చి ప్రోత్సహించారు. అప్పటి నుండి మూడు సంవత్సరాలు ఇంటర్ కాలేజీ కాపిటీషన్స్ లో బెస్ట్ ఆర్టిస్టుగా వచ్చాను.
బహుమతులు
ఒక ఏడాది గుంటూరు హిందూ కాలేజీలో ఇంటర్ యూనివర్సిటీ కాపంటేషన్స్ జరిగాయి. అందులో నాటికలు, మోనోయాక్షన్, మిమిక్రీ ఫ్రాన్సీ డ్రెస్ వీటన్నిటో నేనే ప్రధమ బహుమతి సాధించాను. అది ఇప్పటికీ యూనివర్సిటీ రికార్డుగానే ఉంది. నేను ఈ గెలుపు సాధించడంతో కాలేజీకి ఒక రోజు సెలవు ప్రకటించారు. అంతే కాకుండా మా కాలేజీ మేగజైన్ లో కవర్ పేజ్ వేసి ఆర్టికల్ రాశారు. పరిశత్తు నాటకాలు చాలా తక్కువగా ఆడాను. నెల్లూరు నెఫ్జా లో నాటకాలు వేశాను. పెద్దగా నాటకానుభవం లేదు.కాళ్ళు కడిగిన చేతులు అని కృష్ణేశ్వరరావు రాసిన నాటకంలో తండ్రి పాత్ర పోషించాను. అది చాలా చోట్ల ప్రదర్శించారు. నాకు చాలా పేరు వచ్చింది. కూతురని అర్హతలేని ఒక వ్యక్తికి ఇచ్చి  పెళ్ళి చేసి కూతురు పడుతున్న బాధలు చూడలేక అల్లుడిని చంపేసి తాళి తెంపి కూరుర్ని తన వెంట తీసుకుని వెళ్ళే తండ్రి పాత్ర అది.
చిన్న పాటి ఇబ్బందులు
కాలేజీలో చేరిన తొలి సంవత్సరంలోనే డ్రమెటిక్ అసోసియేషన్ సెక్రటరీగా చేశాను. మిమిక్రీ ఆర్టిస్టుగా ఊర్లోనూ, కాలేజీలోనూ ప్రదర్శనలు ఇస్తుంటే  మా కాలేజీలో నన్ను ప్రత్యేకంగా చూసేవారు. అంతమంది నన్ను ప్రత్యేకంగా చూడటంతో నాకు చిన్న పాటి గర్వం పెరిగింది. దాన్ని కొంతమంది జీర్ణించుకున్నారు. కొందరు ఫోజు కొడుతున్నాడురా అనుకునేవారు. అందరితోనూ బాగానే ఉండేవాడిని. ఎప్పుడైనా బాడీలాంగ్వేజ్ లో తేడా కనిపిస్తే అను అనుకునే వారు. మూడు సంవ్త్సరాలు కాలేజీ డేస్ చాలా బాగానే గడిచాయి. మా నాన్నగారు ఆకస్మికంగా చనిపోవడంతో కాలేజీ ఫీజులు కట్టలేక పోవడం ఇలాంటి చిన్న చిన్న ఆర్థిక సమస్యలతో కొంత ఇబ్బందులు పడక తప్పలేదు. తరువాత అనేక రకాల కష్టాలు అనుభవించాను. నేను మిమిక్రీ ఆర్టిస్టుగా అయ్యేప్పటికి మా నాన్న లేరు. మా అన్న్యలు ఇతర కుటుంబ సభ్యలు ఆనందించేవారు. ఎంకరేజ్ చేసేవారు. ఏనాడు మా వాళ్ళు నన్ను నిరుత్సాహ పరచలేదు.
చేతులు తెంచిన తాడు
కాళ్ళు కడిగిన చేతులు అనే నాటకంలో చివర్లో కూతురు మెడలో తాళి తెంచాలి ఆ సమయంలో ఓ సంఘటన జరిగింది. ఆ నాటకంలో నా కూతురిగా ఇప్పటి సినిమా నటి శివపార్వతి నటించింది. ఆమెకు మెడలో కాటన్ దారం తో మంగళ సూత్రం కట్టారు.  అది జారు ముడి వేస్తారు. అయితే ఆ రోజు నైలాన్ తాడు డేశారు. మేము దాన్ని చూడలేదు. అది ఫ్యాక్ట్ థియేటర్ నాటకం మొదలైన తరువాత గమనించాను. అయితే నాటకం మంచి రసపట్టులో జరుగుతోంది. నాటకాన్ని మధ్యలో ఆపడానికి లేదు. నాటకం చివరికి వచ్చింది అందరూ నిమగ్నమై చూస్తున్నారు. తాళిని తెంచడానిక ముందు నేను చూసి షాక్ం అయ్యాను. ఆ విషయాన్ని శివపార్వతికి అర్థమయ్యే విధంగా ప్లాస్టిక్ తాడు వేసుకున్నావు అని చెప్పాను . ఎలా గయితే అలా అయింది అని తెంపడానికి ప్రయత్నించాను. ఎలాగోలా తెంచాను. తీరా చూస్తే నా చేతుల నిండా రక్తం. ఆడియన్స్ మేము కావాలని అలా చేశామేమో అనుకున్నారు. విపరీతంగా చప్పట్లు కొట్టారు. తరువాత వారం రోజుల పాటు  ఆ గాయం మానలేదు. స్టేజీ ఆర్టిస్టుగా నేను మరచిపోలేని సంఘటన అది.
మరచి పోలేని అనుభూతి
ఒకసారి సత్తెనపల్లిలో ప్రగతి కళా పరిషత్ వారి ఆహ్వానం మేరకు మిమిక్రీ ఆర్టిస్టుగా ప్రోగ్రాం ఇచ్చాను. ఆ కార్యక్రమానికి గెస్ట్ గా అక్కినేని నాగేశ్వరావు వచ్చారు. నేను తొలి సారిగా ఆయన ముందు ఆయన్ను అనుకకరించాను. ఆయన కూడా చాలా బాగుంది అని మెచ్చుకున్నారు. అది నా జీవితంలో మరచి పోలేని అనుభూతి. తరువాత మిమిక్రీ ఆర్టిస్టుగా ఓ రెండు మూడు వేల ప్రోగ్రామ్స్ చేశాను.
పాత్రికేయుడిగా ప్రమాదం వరకు వెళ్ళాను.
జర్నలిస్టుగ తెనాలిలో ఉదయంలో పని చేస్తుండగా పాము చర్మాల స్మగ్లింగ్ గురించి ఓ ఆర్టికల్ రాశాను. అది అప్పట్లో సంచలనమైంది. నాకు చాలా పేరు తెచ్చి పెట్టింది. తెనాలి పక్క ఊర్ల నుండి పాము చర్మాలు మన దేశంలోనే కాకుండా ఇతర దేశాలకు కూడా స్మగ్లింగ్ అవుతుండేవి. దాదాపు మూడు రాష్ట్రాల పోలీసులు ఫారెస్టు డిపార్టు మెంటు, ఎక్సయిజ్ డిపార్ట్ మెంట్స్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. అది చాలా పెద్ద రాకెట్. దాన్ని ఛేదిస్తూ తెగంచి రాశాను. అప్పట్లో నన్ను చంపాలని చూశారు కూడా. నేను లక్కీగా తప్పించుకున్నాను. తెనాలి నుండి ముంబాయికి అమ్మాయిలను అక్రమంగా తరళించే ముఠా గురించి కూడా రాశాను. అప్పుడు కూడ నా మీద మర్డర్ అటెంప్ట్ జరిగింది. తరువాత స్టాఫ్ రిపోర్టర్ గా ఒంగోలు వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తరువాత జర్నలిస్టు యూనియన్ కు రెండు సంవత్సరాలు పాటు సెక్రటరీగా చేశాను. అక్కడ అందరి ప్రశంసలు పొందాను. జర్నలిస్టుగా ఇండియన్ జీనియస్ ఛాంబర్ నుండి ఉత్తమ జర్నలిస్టు అవార్డును కూడా అందుకున్నాను. విజయవాడకు ఛీఫ్ సబ్ ఎడిటర్ గా వచ్చిన తరువాత గోదారి పుష్కరాలు జరుగుతుంటే దానికి నన్ను ఇన్ చార్జిగా పెట్టారు. నండూరి రామమోహన్ గారు. దానికి కూడా చాలా మంచి పేరు వచ్చంది. అప్పుడు ఈనాడు నుండి రామోజీ రావు గారు కూడా పుష్కర ఇన్ చార్జిగా ఎవరు చేస్తున్నారు అని ఎంక్వయిరీ చేయడం కూడా నేను మరచి పోలేని విషయం.
ఇష్టమైన నటులు
చిన్నతనంలొ సినిమాలు బాగా చూసేవాడిని. ఎన్జీఆర్ అభిమానిని. ప్రస్తుతం కమల్ హాసన్ అంటే ఇష్టం. ప్రపంచ తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమల్ హాసన్ లాంటి గొప్ప నటుడు లేడనేది నా అభిప్రాయం . నేను నాటకాలు వేస్తున్న  సమయంలో సినిమా ఆర్టిస్టుగా, మిమిక్రీ ఆర్టిస్టుగా కొనసాగుతున్న సమయంలో ఎప్పుడూ సినిమా నటుడు కావాలని అనుకోలేదు. కాకపోతే మనం కూడా సినిమా అర్టిస్టు అయితే ఎంత బాగుండు అనుకున్నాను కాని దాన్ని జీవితాశంయంగా తీసుకోలేదు.
బాపు చూపు
జర్నలిస్టుగా నాటకాలు వేస్తూ, హస్య ప్రహసనాలు చేస్తుంటే బాపుగారు చూసి ఆర్టిస్టుగా నవ్వితే నవ్వండి అనే టివి సీరియల్ లో అవకాశం ఇచ్చారు. తరువాత యన్.టి.ఆర్ సినిమా శ్రీనాధ కవి సార్వభౌమలో కూడా అవకాశం ఇచ్చారు. తరువాత మిస్టర్ పెళ్ళాం లో చేశాను. అది ముందు విడుదలైంది కాబట్టి నా తొలి సినిమా అదే అని అందరూ అనుకుంటారు. బాపూగారు నవ్వితే నవ్వండి సీరియల్ తీసే సమయంలో నేను విజయవాడలో ఉన్న ప్రఖ్యాత రచయిత ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారికి ( ఆయన అప్పుడు ఆలిండియా రేడియోలో పని చేసేవారు) బాపు గారు కబురు చేసి ఇలా మేము టివి సీరియల్ చేస్తున్నాము అక్కడ మంచి టాలెంటెడ్ ఆర్టిస్టులు కావాలని అడిగితే ఓ పదిమంది అర్టిస్టులను ఆయన హైదరాబాద్ తీసుకుని వచ్చారు. వచ్చిన పదిమందిలో నేను బాపుగారికి బాగా నచ్చాను. నాకు ఈ ఆర్టిస్టు కావాలి అతన్ని ఎక్కువ రోజులు ఉండేటట్లు చూడండి అని చెపితే నేను హైదరాబాద్ లోనే ఉండి పోయాను. నాతో టీవికి చాలా కామెడీ సన్నివేశాలు తీశారు. ఆ సీరియల్ టెలికాస్ట్ అవుతున్న సమయంలో నేను విజయవాడలో జర్నలిస్టుగా పని చేసేవాడిని. చాలా మంచి పేరు వచ్చింది. అప్పటికే నన్ను జనం గుర్తపట్టేవారు. అప్పటికి నాతో మాట్లాడని వారు కూడా వచ్చి మాట్లాడుతుంటే నాకు సరదాగా ఉండేది. ఆ ఎపిసో్డ్ టెలికాస్ట్ అయిన సమయంలో ఎక్కువగా బయట తిరుగుతుండే వాడిని జనం గుర్తు పట్టాలని. అదొక చిన్న సరదా. అలా ఎంజాయ్ చేసేవాడిని.
తొలి సినిమా చూసినపుడు
మిస్టర్ పెళ్ళాం  సినిమా విడుదలైన తరువాత నన్ను నను చూసుకోవడమే థ్రిల్ ఫీలయ్యాను. ఆ సినిమా నారాయణగూడ శాంతి థియేటర్ లో చూశాను. నా కేరక్టర్ కనిపించి డైలాగులు చెప్పగానే ప్రేక్షకుల ప్రతిస్పందన చూసి నా రక్క ప్రసరణలో మార్పు వచ్చింది. నా కల్ళల నీళ్ళు తిరిగాయి. నన్ను నేను తెరమీద ఒక్కసారి గా చూసిన  నా స్నేహితులు బంధువులు షాక్ అయ్యారు. ఏంటి వీడు ఈ సినిమాలో ఉన్నాడే అని. నను్న వచ్చి కలిసేవారు. ఫోన్లు చేసేవారు. ఉత్తరాలు రాసేవారు. ఆ సినిమా నుండి వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆ సినిమా తరువాత శుభలగ్నం సినిమాతో నాకు మంచి బ్రేక్ వచ్చింది. అందులో నేను ప్రశ్నావతారం పాత్ర పోషించాను. మిస్టర్ పెళ్ళామ్ సినిమా నాకు ఆర్టిస్టుగా గుర్తింపు నిస్తే శుభలగ్నం సినిమా నాకు ఆర్టిస్టుగా స్టార్ ఇమేజ్ ను క్రియేట్ చేసింది. అప్పటి దాకా బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, బాబూమోహన్ గారు ఉదృతంగా సినిమాలు చేస్తున్నారు. వారి మధ్యన చిన్న గ్యాప్ లో నేను దూరాను. వారి తరువాత పేరే నాదైంది. ఆ స్థానాన్ని సంపాదించుకోవడం బాపుగారి పుణ్యమే.
జన్మస్థలి ఆశీర్వచనం
ఆర్టిస్టు అయిన తరువాత రెండు నంది అవార్డులు వచ్చినందుకు స్నేహితులు  బలవంతంగా లాక్కెళ్ళి అక్కడ జన్మస్థలి ఆశీర్వచనం అని పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేశారు. రెండు వందల కార్లతో ర్యాలీ చేశారు. నేను ఊహించలేదు. ఎందుకంటే తెనాలిలో సైకిల్లో తిరిగిన వాడిని కాబట్టి. ఒక విధంగా చెప్పాలంటే నాకు పుష్పాభిషేకం చేశారు. ఇప్పటికీ నన్ను చూసి అందరూ ఆనందపడతారు.
అవార్డుల పరంపర
సినిమా పరిశ్రమకు వచ్చి దాదాపు ఇరవై సంవత్సరాలు అయింది. ఈ ఇరవై సంవత్సరాల్లో దాదాపు నాలుగు వందల పై చిలుకు సినిమాలు చేశాను ఈ సినిమాల్లో నాకు దాదాపు ముప్పయి అయిదు అవార్డులు వచ్చాయి. మిస్టర్ పెళ్ళాం, శుబలగ్నం సినిమాలోతో పాటు అంకుల్ సినిమాకు నంది అవార్డు వచ్చింది.
దాని తరువాత సారా మీద టీవి సింగిల్ ఎపిసోడ్ చేశాను. దానాకి కూడా నంది అవార్డు వచ్చింది. ఉగాదికి చేసిన ఓ సింగిల్ ఎపిసోడ్ కు నంది అవార్డు వచ్చింది. ఎక్కువగా అవార్డులు తెచ్చిపెట్టిన సినిమా శుభలగ్నం. అందులో చేసిన పాత్రకు వివిధ అవార్డులు దాదాపు ముప్పయి వరకు వచ్చాయి.
పేరు తెచ్చిన పాత్రలు
పెళ్ళి సందడి, ఆమె, ఆయనకిద్దరు. వినోదం, అన్నమయ్యలో నారదుడు పాత్ర. వద్దుబావాతప్పు, పరదేశి, అమ్మదోంగ, కూతురు, ఇంద్ర, సీమశాస్త్రి తదితర సినిమాల్లో నాకు మంచి పేరు వచ్చింది. ఆర్టిస్టుగా నేఉన మరచిపోలేని సంఘటన విషయానికి వస్తే నేను మన భారత దేశం దాటి వెళ్ళలేదు. 1997 లో రాఘవేంద్రరావు గారు అశ్వనీదత్ గారు హాలివుడ్ కు తీసుకుని వెళ్ళారు.నేను అక్కడికి వెళ్ళి మేకప్ వేసుకున్నాను అక్కడ దాదాపు ఇరవై రోజుల ఉన్నాను అది మరచి పోలేని అనుభూతి. దాని తరువాత నేను చాలా సార్లు వెళ్ళాను. దాంతో పాటు మీవీ ఆర్టిస్టు అసోసియేషన్ కు నేను జనరల్ సెక్రటరీగా, వైస్ ప్రసిడెంట్ గా దాదాపు ఏడు సంవత్సరాలు కొనసాగాను.
మిస్సయ్యాను
సినిమా పరిశ్రమలో దాదాపు అందరి హీరోలతో చేశాను నాకు ఇష్టమైన నటుడు ఎస్.వి. రంగారావు, సావిత్రి గార్లతో చేయలేక పోయానే అనుకుంటాను. వాళ్ళున్నప్పడు నేను ఎందుకు ఆర్టిస్టును కాలేక పోయాను. నేను ఆర్టిస్టును ఆయ్యే వరకు వాళ్ళెందుకు బ్రతకలేదు అనుకుంటాను. వాళ్ళంటే నాకు అంత ఇష్టమన్నమాట. నగేష్, మనోరమ గార్లతో కూడా చేశాను.
సంతృప్తి నిచ్చిన పాత్రలు
ఆర్టిస్టుగా నాకు సంతృప్తి నిచ్చిన కేరక్టర్ కలవారి చెల్లెలు కనక మహాలక్ష్మి అనే సినిమాలో శాడిస్టు విలన్ గా చేశాను. మిస్టర్ పెళ్ళాం, శుభలగ్నం సినిమాల్లో నా పాత్ర మరచి పోలేనిది. దాంతో పాటు ఇంద్ర సినిమాలో నేను చేసిన పాత్రకు నేను నవ్వుకున్నాను. ఆర్టిస్టుగా వ్యక్తిగతంగా నాకు నచ్చిన సినిమాలు చాలా ఉన్నాయి. వ్యక్తిగతంగా నాకు పేరు తెచ్చిపెట్టిన సినిమాలు చాలా ఉన్నాయి. పేరు తెచ్చి పెట్టిన సినిమాలన్నీ నాకు నచ్చినవి కావు. నచ్చని సినిమాలన్నీ పేరు తెచ్చి పెట్టలేదు.
దర్శకుడిగా నిర్మాతగా
నిర్మాతగా నేను ఫెయిల్ అయ్యాను. అంకుల్, ఓరి నీ ప్రేమ బంగారం గానూ సినిమాల్లో బాగా దెబ్బతిన్నాను. నటుడిగా అంకుల్ సినిమాలో నాకు వచ్చిన పేరు అంతా ఇంతా కాదు. ఇప్పటికి కూడా అంకుల్ సినిమా గురించి నాతో మాట్లాడుతూ ఉంటారు. ఇటీవల టీవిలో అంకుల్ సినిమా టెలికాస్ట్ అయితే డాక్టర్ రాజశేఖర్ చూసి రాత్రికి రాత్రే ఫోన్ చేసి యుఆర్ ఎ గ్రేట్ ఆర్టిస్ట్ అన్నారు. అలాగే దర్శకుడిగా సూర్ హీరోస్ నా తొలి ఇనిమా అది ఆడలేదు. అయితే ఆ సినిమాను చెత్తగా తీశానని ఎవ్వరూ అనలేదు. అనుభవమున్న దర్శకుడి లాగా చేశానని అందరూ అన్నారు. ఓరి నీ ప్రేమ బంగారం గానూ, రూమ్ మేట్స్ సినిమాలతో దర్శకుడిగా సక్సెస్ అయ్యాను. ఆ సినిమాలకు అవార్డులు కూడా వచ్చాయి. అయితే సినిమా బాగా ఉండటానికి ఆడటానికి సంబంధం లేదనేది నా ఉద్ధేశ్యం.హిట్ అయిన సినిమాలన్నీ గొప్పవి కావు.ప్లాప్ అయిన సినిమాలన్నీ చెత్తవి కావు. కొన్ని కొన్ని పరిస్థితుల మీద ఆధారపడి ఉంటాయి. కమర్షియల్ హిట్ సాధించాలన్నది నా ఆశయం. దాని కోసం వేచి చూస్తన్నాను. నేను నిర్మాతగా అయితే సినిమా తీయను. నామీద నమ్మకంతో ఎవరైనా వచ్చి డైరక్షన్ చేయమంటే చేస్తాను. ఖాళీ సమయాల్లో స్క్ర్టిప్టు రాసుకుంటూ ఉంటాను. డైరెక్షన్ అనేది నా కెరీర్ లో డీవియేషన్ కాదు. ఒక ఎక్స్ టెన్సన్ మత్రమే.
నష్టపోయిన మాట వాస్తవమే
నేను నిర్మాతగా దర్శకుడిగా కొనసాగడం వల్ల ఆర్థికంగా కాస్త నష్టపోయిన మాట వాస్తవమే. సినిమా పరిశ్రమలో వచ్చినా అలాగే వస్తుంది. పోయినా అలాగే పోతుంది. కొంత మంది వీడికి ఒళ్ళు బలిసి కాకపోతే హ్యాపిగా వేషాలు వేసుకోకుండా సినిమాలు ఎందుకు అని తిట్టేవారు కూడా ఉంటారు. అటాంటి వారి పట్ల నేను చెడుగా అనుకోను. మనం మంచి కోరే చెపుతున్నారు అనుకుంటాను. అయితే నా ప్రయత్నంలో లోపం లేదు. ఒక్కోసారి కలసి రావచ్చు ఒక్కోసారి రాకపోవచ్చు. ప్రస్తుతం నా ప్రయత్నం కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం నేను ఇబ్బందులు పడటం లేదు కాని ఇంకా సుఖంగా ఉండాల్సిన వాడినేమో ప్రస్తతానికి బాగానే ఉన్నాను. నేనెప్పుడూ లగ్జరీగా బ్రతకాలని అనుకోలేదు. అలా బ్రతికి ఉంటే నేను కష్టపడి ఉండేవాడిని. నాకు మధ్య తరగతి జీవన విధానం ఇష్టం కాబట్టి నేను ఎంజాయ్ చేస్తున్నాను కానికష్టపడుతున్న ఫీలింగ్ నాకు లేదు.
అందువల్లే గ్యాప్ వచ్చింది
నటుడిగా బాగా బిజీగా ఉన్న సమయంలో నేను తీసిన సినిమాల వల్ల నాకు ఓ ఆరు నెలలు గ్యాప్ వచ్చింది. అలా గ్యాప్ వస్తే ఎవరో ఒకరు దూరి పోవడం సినిమా పరిశ్రమలో మామూలే కదా? ఇప్పటికీ నేను కావాలనుకునే వారు వస్తూనే ఉన్నారు వేషాలు వేస్తూనే ఉన్నాను. అయితే మంచి హీరోమంచి దర్శకుడు మంచి బేనర్ పడితే మళ్ళీ నా కెరియర్ లో వేగం పెరుగుతుంది. దాని కోసంమే నేను ఎదరు రూస్తున్నాను. ఒక రకంగా చెప్పాలంటే నా సినిమాల వల్ల నే నాకు గ్యాప్ వచ్చింది. అంతే కాని వేరే కారణం చేత సినిమా వేషాలు వద్దనుకోలేదు. నేను ఇదే ఇండస్ట్రీలో అంటూ దర్శకత్వం చేపట్టాను. అంతే కానిఏ చేపల చరువుల వ్యాపారమో చేయలేదు. సరే కొంతమంది వీడు డైరెక్షన్ చేసుకుంటున్నాడు. ఇక ఇటువైపు రాడేమో అని నాకు వేషాలు ఇద్దామని కూడా ఇవ్వలేదు. నేను డైరెక్షన్ చేసే సమయంలో ఆర్టిస్టుగా నష్టపోయాను. అయితే మళ్ళీ ఆ గ్యాప్ ను పూడ్చుకుని మళ్ళీ బిజీ కావడానకి ప్రయత్నిస్తాను.
ప్రత్యక్షరాజకీయాలు
రాజకీయంగా వస్తే నాకు తెలుగు దేశం పార్టీ అంటే ఇష్టం.రాజకీయ నాయకుడిగా చంద్రబాబు నాయుడు నాకు ఇష్టం. ఆయన విజన్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఇష్టం. ఎలక్షన్స్ కు ముందు ఆయన కొందరు సినిమా వాళ్ళను పిలిచి పార్టీ పరంగా కొన్ని బాధ్యతలు అప్పగించారు. నను అప్పుడప్పుడూ ఆయన వద్దకు వెళుతుండే వాడిని . ఆయన కు నా సలహాలు సూచనలు నచ్చి నన్ను దగ్గరకు తీసుకున్నారు. నేను అలాగే పార్టీ పనుల్లో లీనమయ్యాను. అలా ఉంటున్న సమయంలొ నన్ను అధికార ప్రతినిధిగా నియమించారు. అందులో బాగా ఇన్వాల్వ్ అవడంతో పార్టీ పరంగా కమిట్ మెంట్ వచ్చింది. ఎలక్షన్స్ అయిపోయిన తరువత నేను పెద్దగా యాక్టివ్ గా లేను. ఎప్పుడన్న ఆ చంద్రబాబు గారిని కలుస్తుంటాను. ఆ పార్టీ అనే కాదు నాకు అన్ని పార్టీలు ఇష్టమే. అందరూ మంచి స్నేహితులే.
నా పెళ్ళి కుటుంబం
నా పెళ్ళి 1980 లో జరిగింది. కులాంతర ప్రేమ వివాహం. నాకు ఇద్దరు పిల్లలు నేను ఎక్కడికి వెళితే అక్కడ వారి చదువు కొనసాగుతూ వచ్చింది. ఇద్దరికీ పెళ్ళిళ్ళు అయి పోయాయి. అమ్మాయి, అల్లుడు హెపి కంప్యూటర్స్ కు ఆథరైజ్డ్ డీలర్స్ గా ఉన్నారు. అబ్బాయి కోడలు కలిసి యాక్టివ్ అసోసియేట్స్  పేరుతో జంటనగరాలకు కనెక్షన్స్  కలెక్షన్స్ చేస్తున్నారు. వాళ్ళు మంచి పొజీషన్ లో సెటిల్ అయ్యారు అని చెప్పలేను కాని వారు ఇంకా మంచి పొజిషన్ లో సెటిల్ కావడానికి నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. మా అబ్బాయికి సినిమాల్లో చేయాలనే ఇంట్రస్టు లేక పోవడం వల్ల నేను హాయిగా ఉన్నాను. అలాంటిదే ఉంటే నాకు సన్ స్ట్రోక్ తగిలి ఉండేది.
అభిమానం
అభిమానం పరంగా చెప్పాల్సి వస్తే నా పేరులో మూడు అక్షరాలు. నేను ఎప్పుడైనా రిమోట్ ఏరియాలకు వెళితే పొలంగట్టున కూర్చున్న ములోళ్ళు కూడా అదో ఆ ఎల్తానా్నయనే ఏవియస్ అంటే అని చెపుతుంటారు. అలా వారి నోటితో వింటుంటే ఆనందంగా ఉంటుంది. అలాగే ఎక్కడికి వెళ్ళినా తుత్తి తుత్తి అంటుంటారు. అలాగే రంగుపడుద్ది అని నా మేనరిజంతో నన్ను అంటుంటారు. ఇంద్ర సినిమాలో నీ మేనరిజం నీది తెనాలే నాది తెనాలే మనది తెనాలే అనే డైలాగ్ అనుకోకుండా చాలా పాపులర్ అయింది. అన్నారు. అలాగనే నేను హీరోను కాకపోయనా మమ్మల్మి అభిమానిస్తుంటారు. నాకు ఎంతమంచి అభిమానులున్నదీ నాకు ఆపరేషన్ జరిగిన సమయంలో తెలిసింది. ఎంతో మంది నాకు ఫోన్ లు చేసి మీరు కోలుకోవాలని కోరుకున్నారు. వాళ్ళు ఇచ్చిన ఆనందమే నన్ను కోలుకునే విధంగా చేసింది.
అభిమానం ఒక పక్క బాధ మరో పక్క ఆనందం
ఒక సారి నాకు వింత పరిస్థితి ఎదురయింది. ఒక పర్క బాధ మరో పక్క ఆనందం రెండూ కలిగాయి. విజయవాడలో ఉండే మా చెల్లి చనిపోతే నేను బరియల్ గ్రౌండుకు వెళ్ళాను. నేను వస్తున్నానని తెలుసుకుని ఆ చుట్టుపక్కల వాళ్ళు అక్కడికి భారీగా వచ్చారు. మా చెల్లి పోయిందనే దుఃఖం లో నేను ఉంటే, కొందరు వచ్చి నా మేనరిజాలు చెపుతూ ఏంటి సార్ కామ్ గా ఉన్నారు. నవ్వించండి సార్ అన్నప్పుడు నా పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి. అందుకనే చార్లి చాప్లిన్ అన్నాడు నవ్వేవాడికి ఏడుపు అవసరం అని. కాబట్టి నా  ఏడుపు వారికి అఖ్ఖరలేదు. ఏవియస్ అంటే నవ్విస్తాడు. అనేదే వారికి తెలుసు. నేను న్వించాలని డిమాండ్ చేయడం వారి హకు్కు ఎందుకంటే వాళ్ళు నవ్వారు కాబట్టి నేను స్థితి లో ఉన్నాను. అదొకటి నేను మరచిపోలేని ఇన్సిడెంట్. అంతకు మిచి ఇబ్బంది పెట్టేవి జరగలేదు.
నవ్వించే కమెడియన్స్
నేను ఎంతో మందిని నవ్విస్తుంటాను. కాని నాకు నగేష్ గారిని చూస్తే విపరీతంగా నవ్వు వస్తుంది. ఆయన కామెడీ అంటే నాకు చాలా ఇష్టం. అలాగే చలం గారన్నా కూడా చాలా ఇష్టం. ఒకసారి తెనాలి వచ్చినపుడు ఆయన్ను చూసి నవ్వుతూనే ఉన్నాను. ఆయన నన్నుచూసి నవ్వుతూనే ఉన్నాను. ఆయన నేను నవ్వడం చూసి నా భుజం తట్టి వెళ్ళిపోయారు. అలాగే హిందీలో అస్రాని,తెలుగు అల్లురామలింగయ్య గారంటే నాకు చాలా ఇష్టం.
రచయితగా
పదవ తరగతి చదువుతుండగా శరత్ చంద్ర ఛటర్జీ గారి శతజయంతి ఉత్సవాలు వచ్చాయి. ఆ సమయంలో ఆంధ్రపత్రిక  వారు ఆయన మీద ఓ పాటల పోటీని కండక్టు చశారు. అప్పుడు నేను ఒక పాట రాశాను. ఆ పాటకు నాకు బహుమతి వచ్చింది.  రచయితగా నేను ముప్పయికి పైగా కథలు రాశాను. వాటిలో 11 కథలకు ప్రధమ బహుమతి ఎనిమిది కథలకు ద్వితీయ బహుమతి వచ్చింది. అరణ్య భారతం, అమ్మ దొంగ, మల్లెతీగ అనే మూడు నవలలు రాశాను. వాటిలో రెండు సీరియల్స్ గా వచ్చాయి. అమ్మదొంగా అనే టైటిల్ సాగర్ గారికి నేను ఇచ్చాను. ఆంధ్రజ్యోతి సినిమా వీక్లీకి ఆర్టికల్స్ రాసే వాడిని. సూపర్ హీరోస్ లో ఒక పాట, అంకుల్ సినిమాలో ఒక పాట రాశాను. తరువాత నాటికలు,నాటకాలు రాసే వాడిని సినిమా పరిశ్రమలోకి వచ్చిన తరువాత ఓరి నీ ప్రేమ బంగారం గానూ, రూమ్ మేట్స్ కు కథ, స్క్కన్ ప్లే డైలాగులు రాశాను. సూపర్ హీరోస్,అంకుల్ సినిమాలకు కథ నాదే . ప్రస్తుతం పలు పత్రికలకు కాలమిస్ట్ గా వ్యాసాలు రాస్తుంటారు. ఆంధ్రజ్యోతిలో రాసిన ఉత్తినే అనే వ్యాసాలను పుస్తక రూపంగా తీసుకురావడం జరిగింది. వెంకయ్యనాయుడు ఎప్పుడైనా ఫోన్ చేసి మనసు బాగాలేకపోతే నీ ఉత్తినే పుస్తకం చదువుతుంటానయ్యా అని అంటుంటారు.
వ్యాఖ్యాతగా
వ్యాఖ్యాతగా చిన్న తనం నుండి నాకు బాగా అలవాటు.సినిమా పరిశ్రమకు వచ్చిన తరువాత చాలా ఫంక్షన్ చేశాను. నేను చేసిన పెద్ద ఫంక్షన్ లలో ఇంద్ర చాలా పెద్దది దానికి లక్షల సంఖ్యలో జనం తరలి వచ్చారు. వ్యాఖ్యాతగా ఏవియస్ బాగా చేస్తాడు అనే గుర్తింపు తెచ్చుకున్నాను. వీటితో పాటు స్టోర్ షోస్ పలు దేశాల్లో చేశాను. చేస్తూనే ఉంటాను. అలా చేయడం నాకు చాలా ఇష్టం. అమెరికాకు 14  సార్లు వెళ్ళి వచ్చాను. చాలా దేశాలు తిరిగి కార్యక్రమాలు చేస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు మూవీ ఆర్టిస్తు అసోసియేషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను.
నా కూతురు తల్లి అయింది.
మాది చాలా స్వీట్ ఫ్యామిలీ అని చెప్పాలి. చాల మంది ఇళ్ళలో మాదిరిగానే మాఇంట్టో కూడా అఫెక్షన్స్, అటాచ్ మెంట్స్ ఎక్కువ. అంతా ఫ్రెండ్స్ లాగా ఉంటాము. తండ్రీ కొడుకుల మధ్య సీరియస్ నెస్ ఉండదు. చాలా సరదాగా ఉంటాము. ఎదైనా వస్తే అందరం కలిసి డిస్కస్ చేసుకుంటాము. మా అల్లుడు నాకు కొడుకులాగా ఉంటాడు. కోడలు కూతురు లాగా ఉంటుంది. అందరం చాలా హ్యాపిగా ఉంటాము. ఫ్యామిలీ రిలేషన్స్ పరాకాష్ట చాలా మంది ప్రపంచంలో చేయలేని పని మా అమ్మాయి చేసింది. ఈ మధ్యన నాకు లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయవలసి వచ్చింది. రక్తసంబంధీకులు ఎవరైనా లివర్ ఇస్తే ఆపరేషన్ చేయవచ్చు అని డాక్టర్ లు చెప్పినపుడు మా ఆవిడ నా కొడుకు నా కూతురు అందరినీ పరిక్షించినపుడు మా అమ్మాయి లివర్ సూటవుతుంది అని చెప్పడంతో నేను వద్దని వారించినా మా అమ్వయి లివర్ లో కొంత భాగం ఇచ్చి నాకు పునర్జన్మ ను ఇచ్చింది. చాలా ఇంటర్యూలలో కూడా నేను చెప్పాను. నేను తనకు జన్మనిస్తే నాకు పునర్జన్మ నిచ్చిందని.మా కుటుంబంలో ఒకిరి మీద ఒకరికున్న ప్రేమలకు ఇంతకంటే పెద్ద ఉదాహరణ అఖ్ఖరలేదేమో. భగవంతుడు నాకు ఇచ్చిన గొప్ప వరం నా కుటుంబం ని ఫీల్ అవుతుంటాను. మా అన్నదమ్ములు మేము కూడా చాలా ప్రేమ ఆప్యాయలతో ఉంటాము.
అంటూ తన జీవితపయనపు విశేషాలను వెల్లడించారు. ఆమంచి వెంకట రామకృష్ణ