Heroine Keerti suresh

5dcba2b8-fbf5-4f11-a4d3-4d1a801b97d0kertisuresh

bea193ff_13-crop--06231e

6aeca264-3bfd-4405-8bce-b6452e4940b8

ఇక బయోపిక్స్‌ చేయను!
జాతీయస్థాయి కీర్తి

కన్ను గీటితే… శశిరేఖ, కంట నీరొలికితే… పార్వతి, కంట నీరు తెప్పిస్తే… సుమంగళి…  పాత్ర ఏదైనా ఆమెకు ఆమే సాటి. నటిగా సావిత్రిది ఎవరెస్టు స్థాయి… అంతటి మహానటి పాత్రలో ఒదిగి, నటిగా ఎంతో ఎదిగిన కీర్తి సురేష్‌ ఇప్పుడు జాతీయ అవార్డుతో మరోస్థాయిని అందుకున్నారు.  ఈ సందర్భంగా ఆమెను పలకరిస్తే… ఎన్నో కబుర్లు చెప్పారు.

* నేను పుట్టి పెరిగింది సినిమా నేపథ్యం ఉన్న కుటుంబంలో. అమ్మ మేనక మంచి నటి. నాన్న సురేష్‌కుమార్‌ నిర్మాత. మా అక్క రేవతి ప్రస్తుతం ఈ రంగానికి సంబంధించి అకాడమీ బాధ్యతలను నిర్వహిస్తోంది.
* మలయాళం, తమిళ చిత్రాల్లో నటించిన అమ్మ తెరపైనే నటి. ఇంటి ముందు ముగ్గు పెట్టడం నుంచి మా ఆలనాపాలనా వరకు అంతా ఆమే చూసేది. స్కూల్‌ ఫస్ట్‌ వచ్చేయాలి, వందకు వంద మార్కులు తెచ్చుకోవాలని ఇబ్బంది పెట్టేది కాదు. జీవితానికి చదువు ముఖ్యం. చదువే జీవితం కాకూడదు అనేది. 70శాతం మార్కులు తెచ్చుకునే వాళ్లం.
* జాతీయ ఉత్తమ నటి పురస్కారానికి ఎంపికైనట్లు తెలిసినప్పుడు అమ్మ, నాన్న దగ్గరే ఉన్నాను. చాలా సంతోషమేసింది. తెరపై అమ్మ నటన అద్భుతంగా ఉంటుంది. ఆమె నటించిన ‘ఓ పోల్‌’ (తోబుట్టువు) చిత్రంలో ఆమె పాత్ర జాతీయ ఉత్తమ నటి అవార్డుకు నామినేట్‌ అయ్యింది. అయితే చివరి ఎంపికలో అమ్మ పేరు లేదు. ఆ సందర్భంలో తనకు కలిగిన నిరుత్సాహం అమ్మ ఎప్పుడూ గుర్తు చేసుకుంటూనే ఉంటుంది. ఇప్పుడు నాకు దక్కిన ఈ గౌరవాన్ని అమ్మకు అంకితమిస్తున్నా.
* మహానటి ప్రాజెక్టు గురించి చెప్పినప్పుడు ముందుగా అమ్మ చాలా భయపడింది. సహజసిద్ధమైన నటన ఉంటేనే ఆ పాత్రకు న్యాయం చేయగలుగుతాం అంది. నిర్మాతలు, దర్శకుడు ఇచ్చిన ధైర్యంతో ముందడుగు వేశా.
* ముందుగా మాయాబజార్‌ సినిమాలోని షాట్‌ చిత్రీకరించారు. చాలా టేక్స్‌ తీసుకున్నా. దానికి ముందుగా చాలాసార్లు రిహార్సల్స్‌ చేశాం. ఎడమ కంటి నుంచి రెండు నీటి బొట్లు, కుడి కంటిలో ప్రేమ కనిపించే సీన్‌ కోసం రెండు గంటలపాటు ప్రయత్నించాను.
* మహానటి చిత్రం పూర్తిగా భావోద్వేగాలమయం. మనసులోని భావాలు ముఖంపై ప్రతిఫలించాలి. ఆమె నడక, తలకట్టు, దుస్తులు అన్నింటిలో ఆమెలా మారిపోతేనే పాత్ర పరిపుష్టి అవుతుంది. దాదాపు వంద రకాలకు పైగా దుస్తులను ధరించా. మొదటి రోజు మేకప్‌కు నాలుగు గంటలకు పైగా పటింది. ఏడాదికి పైగా ఆ పాత్రలో లీనమైపోయా. చాలారోజులు నిద్రపట్టేది కాదు. పగలు షూటింగ్‌లో ముఖం వాడినట్లు కనిపిస్తుందని భయం. ఇలా ఎన్నో ఇబ్బందులకు గురయ్యేదాన్ని.
* మహానటి చిత్రం విడుదలైన తరువాత అభిమానులే కాదు, విమర్శకులూ బ్రహ్మరథం పట్టారు. ఇప్పుడు జాతీయ స్థాయిలో గౌరవాన్ని అందుకోబోతున్నా. దీనికి సహకరించిన టెక్నీషియన్స్‌ అందరికీ కృతజ్ఞతలు చెప్పుకొంటున్నా. అలాగే ఈ చిత్రంలోని కొన్ని సంఘటనలు, సన్నివేశాల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే వారిని క్షమాపణలు కోరుకుంటున్నా.
* మరో బయోపిక్‌ ఒప్పుకొంటారా అని చాలామంది అడుగుతుంటారు. ఇదే మొదటిది, చివరిది అని చెబుతుంటా. ఎందుకంటే మహానటి లాంటి పాత్రలో నటించి మరో పాత్ర చేయాలని లేదు. అంతగా ఈ పాత్రకు ప్రభావితురాలినయ్యా. షూటింగ్‌ పూర్తయ్యే 10 రోజుల ముందు నుంచే మనసులో ఏదో బాధ మొదలైంది. చిత్రీకరణ పూర్తయిన తరువాత ఏడ్చేశా. ఏదో వదిలివెళుతున్నట్లే అనిపించింది. పెద్దనాన్న పాత్రలో చేసిన రాజేంద్రప్రసాద్‌ షూటింగ్‌ ముగిసి, వెళ్లిపోతుంటే కళ్లల్లో నీళ్లు కారిపోయాయి. ఆయనను గట్టిగా హత్తుకుని ఏడ్చేశా. అందుకే నేను అంటుంటా… ‘మహానటి ఓ మహాద్భుతం…ఓ ప్రయాణం. మనషులనే కాదు, మనసులను కూడా కట్టిపడేసే మాయాజాలం ఆ చిత్రం’ అని.
* హాలీవుడ్‌లో టామ్‌క్రూస్‌ అభిమానిని. బాలీవుడ్‌లో షారూఖ్‌ఖాన్‌, దీపికా పదుకోణే, ఆలియాభట్‌ అంటే చాలా ఇష్టం. నయనతార డ్రెస్‌ సెన్స్‌, సిమ్రాన్‌ డ్యాన్స్‌ అంటే ఫిదా అయిపోతా.

క్రేజీగాఓసారి ఒక నగల దుకాణం ప్రారంభోత్సవానికి వెళ్లినప్పుడు ఓ అభిమాని నావద్దకు వచ్చి కానుకిచ్చి వెళ్లాడు. అదేంటంటే నా ఫొటోలన్నింటినీ పొందుపరిచిన అల్బంలాంటిది. వాటితోపాటు ఒక ఉత్తరం కూడా ఉంది. నన్ను ప్రపోజ్‌ చేస్తూ రాసిన ఆ లేఖను ఉంచుకున్నా. ఎందుకంటే కాలేజీ రోజుల్లో ఒక్క ప్రేమలేఖా రాలేదు కాబట్టి.
సామాజిక సేవలోగతేడాది కేరళలో వరద బాధితులకు చేయూత అందించాలనుకున్నా. ఒక బృందంతో కలిసి ఆయా ప్రాంతాలన్నీ చుట్టివచ్చి, ఇబ్బందులన్నీ తెలుసుకున్నా. వెంటనే స్థానిక ప్రభుత్వ కాలేజీలో కొన్ని రోజులు బృందంతో కలిసి ఉండి ఫ్యామిలీ కిట్‌లు తయారుచేసి పంపిణీ చేశాం. ఆ కిట్‌లో బియ్యం, పప్పు, ఉప్పు, వంట సరుకులు, కూరగాయలు వంటివన్నీ ఉండేలా దగ్గరుండి చూసుకున్నా. అలాగే మహిళలకు కావాల్సిన శానిటరీ న్యాప్‌కిన్స్‌ నుంచి లోదుస్తుల వరకు అందేలా కృషి చేశా. అమ్మ నుంచి ఇవన్నీ నేర్చుకున్నా.
తరగతులెగ్గొట్టిసినీ రంగంలోకన్నా కాలేజీ స్నేహితులే నాకు ఎక్కువ. తరగతులు ఎగ్గొట్టి చాలా సినిమాలు చూసేవాళ్లం. ఇప్పుడు బిజీ అవడంతో వారందరినీ కలవలేకపోతున్నా. దుస్తుల్లో పార్టీవేర్‌ కన్నా సాదాసీదా అవుట్‌ఫిట్స్‌ అంటే ఇష్టపడతా. ఆకుపచ్చ రంగంటే ఇష్టం. నేను చదివిన కాస్ట్యూమ్‌ డిజైనింగ్‌ కోర్సును నా వృత్తిలో ఉపయోగిస్తూ ఉంటా.

అలా… పిల్లల్ని ఏడిపిస్తా…!

మహానటిగా మెప్పించిన కీర్తి సురేష్‌ ఎప్పటికప్పుడు సరికొత్త పాత్రల్ని ఎంచుకోవడంలో ముందుంటుంది. ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకొచ్చిన మిస్టరీ థ్రిల్లర్‌ ‘పెంగ్విన్‌’లో విభిన్నంగా అలరించే కీర్తి జీవితంలో ఆసక్తికర విశేషాలివి…

అభిమాన తారలు

విజయ్‌, సూర్యలకు వీరాభిమానిని. చిన్నప్పుడు వాళ్ల సినిమాలు ఎక్కువగా చూసేదాన్ని.

డ్రీమ్‌ రోల్‌

‘క్వీన్‌’లో కంగన, ‘కహానీ’లో విద్యాబాలన్‌లు పోషించిన పాత్రలు నాకు చాలా ఇష్టం. ఎప్పటికైనా అలాంటి రోల్స్‌ చేయాలనుంది.

బ్యూటీ సీక్రెట్‌

నీళ్లు ఎక్కువగా తాగుతా, ఉదయం లేవగానే యోగా చేస్తా.

తొలి సంపాదన

కాలేజీలో ఫ్యాషన్‌ డిజైనింగ్‌ చేసేప్పుడు ఓ ఫ్యాషన్‌షోలో పాల్గొంటే పారితోషికంగా రూ.500 ఇచ్చారు. అదే నా మొదటి సంపాదన.

కష్టపడింది

మహానటి సమయంలో ప్రోస్థటిక్‌ మేకప్‌కి 4 గంటలూ, షూటింగ్‌ మరో ఏడెనిమిది గంటలూ పట్టేది. ఆ సమయంలో తినడానికీ, నవ్వడానికీ కూడా కుదిరేది కాదు. సావిత్రి అమ్మ జీవితం కాబట్టి కష్టమైనా ఇష్టంగానే నటించా.

ప్రేమలేఖ

ఒకసారి చెన్నైలో జ్యూవెలరీ షాపు ప్రారంభానికి వెళితే ఒకబ్బాయి వచ్చి చేతిలో డైరీ పెట్టి వెళ్లాడు. చూస్తే అందులో లవ్‌లెటర్‌తోపాటు తన ఫొటోలూ అడ్రస్‌ ఉన్నాయి. అవి చూసి ఎంత నవ్వుకున్నానో.

ఇష్టంగా తినేవి

దోశలు… ఇంట్లో ఉంటే అమ్మతో రోజూ అవే చేయించుకుని తింటా. చెన్నై సాంబారు ఇడ్లీ కూడా ఇష్టమే.

సావిత్రితో పోలికలు

ఈత, కార్‌ రేసింగ్‌, క్రికెట్‌… ఆమెకి లాగే నాకూ చాలా ఇష్టం. అలానే నా కనురెప్పలు మడిచి పెట్టి చిన్నపిల్లల్ని ఏడిపించడం భలే సరదా. సావిత్రి అమ్మ కూడా అలానే చేసేవారని షూటింగ్‌ సమయంలో తెలిసింది.

మెచ్చిన సినిమాలు

‘జిందగీ నా మిలేగి దోబారా’, ‘రోమియో అండ్‌ జూలియట్‌’ సినిమాలు ఎన్ని సార్లు చూశానో లెక్కలేదు.

తీరిక వేళ

ఈత కొడతా… స్కూల్‌ రోజుల్లో నేను స్విమ్మింగ్‌ ఛాంపియన్‌ని.

బలం

అమ్మానాన్నలూ, నాపైన నాకున్న నమ్మకం…

నటి కాకపోయుంటే

ఫ్యాషన్‌ డిజైనర్‌ అయి ఉండేదాన్ని.

ఇష్టమైన కార్లు

ఫోర్డ్‌, జాగ్వార్‌ ఎక్స్‌జే… ఈ రెండు కార్లనీ నా సంపాదనతోనే కొనుక్కున్నా.

నచ్చిన ప్రదేశం

ప్యారిస్‌లోని ఈఫిల్‌ టవర్‌ని రాత్రిపూట చూడటం ఇష్టం.
వాళ్ల నటనకు ఫిదా అయ్యా!

వాళ్ల నటనకు ఫిదా అయ్యా!

కీర్తీసురేష్‌… వెండితెరకు పరిచయమైన చాలా తక్కువ సమయంలోనే స్టార్‌ హీరోలతో నటించే అవకాశాన్ని అందుకున్న ప్రతిభావని. ‘సర్కారు వారి పాట’లో మహేష్‌బాబుతో జోడీ కట్టే ఛాన్స్‌ కొట్టేసిన ఈ మలయాళీ కుట్టి ఇప్పటివరకూ తాను కలిసి నటించిన హీరోల గురించి వివరిస్తోందిలా…

పవన్‌కల్యాణ్‌ వ్యక్తిత్వం నచ్చుతుంది

వాళ్ల నటనకు ఫిదా అయ్యా!

కప్పుడు మా అమ్మ చిరంజీవితో కలిసి ‘పున్నమి నాగు’లో నటిస్తే నేనేమో పవన్‌కల్యాణ్‌తో ‘అజ్ఞాతవాసి’ చేశా. నా మూడో సినిమా తనతో కలిసి చేస్తున్నానని తెలిసినప్పుడు ఎగిరి గంతేసినంత పనిచేశా. అంతకన్నా ముందే ఆయన సినిమాలు చూసి చాలా విషయాలు నేర్చుకున్నా. అందరూ ఆయన్ని పవర్‌స్టార్‌ అని ఎందుకు అంటారో తనతో కలిసి నటిస్తున్నప్పుడు అర్థమయ్యింది. మా సినిమా పూర్తయ్యాక నేను తన నటనకే కాదు వ్యక్తిత్వానికి కూడా ఫిదా అయ్యానంటే నమ్మండి. అవకాశం వస్తే మరోసారి పవన్‌కల్యాణ్‌తో కలిసి తెర పంచుకోవాలని ఉంది.

నానీ రుణం తీర్చుకోలేను

వాళ్ల నటనకు ఫిదా అయ్యా!

నాకు ‘నేను లోకల్‌’ సినిమా అవకాశం వచ్చినప్పుడు మా అక్క ‘తెలుగులో నానీని నాచురల్‌ స్టార్‌ అంటారు. నిజంగా అతని నటన చాలా సహజంగా ఉంటుంది…’ అని చెబితే కాస్త భయపడ్డా. కానీ షూటింగ్‌ మొదలయ్యాక ఎలాంటి కష్టమైన సన్నివేశాన్నయినా నానీ చాలా సులువుగా నటించడం చూసి ‘అలా ఎలా చేస్తాడబ్బా’ అనుకునేదాన్ని. షూటింగ్‌ విరామంలో నేను రకరకాల ప్రశ్నలు వేస్తూ ఎంత విసిగించినా చాలా ఓపిగ్గా సమాధానాలు చెప్పేవాడు. ‘మహానటి’లో నన్ను తీసుకోవాలనుకున్నప్పుడు నానీ నాకు ఫోన్‌ చేసి ఆ సినిమా గురించి చెబుతూనే ‘నీకు మంచి గుర్తింపు వస్తుంది. నువ్వు చేస్తే బాగుంటుంద’ని చెప్పాడు. నేను మహానటిగా జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నానంటే నా మొదటి థ్యాంక్స్‌ నానీకే చెబుతా. అతని రుణం ఎప్పటికీ తీర్చుకోలేను.

సూర్యకు పెద్ద అభిమానిని!

వాళ్ల నటనకు ఫిదా అయ్యా!

స్కూల్లో చదువుకుంటున్నప్పటినుంచీ నేను సూర్యకు పెద్ద అభిమానిని. మా అమ్మ సూర్య వాళ్ల నాన్న శివకుమార్‌తో కలిసి కొన్ని సినిమాల్లో నటించింది. అమ్మ ఎప్పుడు ఆ సినిమాల ప్రస్తావన తెచ్చినా ‘చూస్తుండు.. నేను కూడా ఏదో ఒక రోజు సూర్యతో కలిసి నటిస్తా’నని అమ్మతో సవాలు చేసేదాన్ని. ఆ మాటలు ‘గ్యాంగ్‌’తో నిజమయ్యాయి. ఆయన సెట్లో ఉన్నంతసేపూ తనకు సంబంధించిన సీన్లపైనే దృష్టిపెడతారు. ఏదయినా సందేహం అడిగితే మాత్రం తప్పకుండా మంచి సలహా ఇస్తారు. సహనటుల్ని ప్రోత్సహించడంలో ముందుంటారు.

రామ్‌ చాలా ఎనర్జెటిక్‌

వాళ్ల నటనకు ఫిదా అయ్యా!

నా మొదటి సినిమా ‘నేను శైలజ’ నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. రామ్‌ నటన, డాన్స్‌ చేసే విధానం అన్నీ అద్భుతమే. సెట్లో చాలా ఎనర్జెటిక్‌గా ఉంటాడు. ఒక షాట్‌ పూర్తయ్యాక తన నటనను మానిటర్‌లో గమనించుకుంటాడు. ఒకవేళ ఆ సీన్‌ మళ్లీ చేయాల్సి వచ్చినా విసుగు లేకుండా నటిస్తాడు. పని విషయంలో ఎంత నిబద్ధతతో ఉంటాడో… ఆరోగ్యం విషయం లోనూ అంతే శ్రద్ధగా ఉంటాడు. ఆ సినిమా చేస్తున్నప్పుడు తనను చూసి చాలా విషయాలు నేర్చుకున్నా.

దుల్కర్‌ నటనకు హ్యాట్సాఫ్‌

వాళ్ల నటనకు ఫిదా అయ్యా!

‘మహానటి’లో అందరూ నా నటనను మెచ్చుకుంటే నేను మాత్రం దుల్కర్‌ నటించిన విధానం చూసి ‘వావ్‌’ అనుకున్నా. నేను అప్పటికే కొన్ని తెలుగు సినిమాలు చేశాను కానీ, మహానటి తనకి మొదటి అవకాశం. దాంతో ఎలా నటిస్తాడో అనుకునేదాన్ని. అలాంటి దుల్కర్‌ ఆ సినిమాలో తనని తాను నిరూపించుకునేందుకు ప్రతి సీన్‌నీ ప్రాణం పెట్టి చేశాడు. కొన్ని సీన్లలో నేను అతనితో పోటీ పడగలనా అనిపించేంత సహజంగా నటించి అందరి ప్రశంసలూ అందుకున్నాడు.